కమల్‌హాసన్‌ కి ఆమిర్‌ఖాన్ క్షమాపణ

 

సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిన తరువాత ఆచిత్రం విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. ముంబైలో జరిగిన 'ఫిక్కి-ఫ్రేమ్స్' కార్యక్రమంలో ఆమిర్‌ఖాన్, కమలహాసన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభం ఆమిర్‌ఖాన్, కమల్ హాసన్ చేతుల మీదిగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను నిషేధించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గురించి ప్రస్తావించారు. కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ నిషేధించిన సమయంలో పనులతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం గురించి పట్టించుకోలేకపోయానన్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లోనే అందరూ కలిసుండాలని, కానీ ఆపని చేయడానికి నేను ముందుకు రానందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఆయనకు సహాయం చేయలేకపోయినందుకు బహిరంగగా క్షమాపణ చెబుతున్నాని చెప్పారు.