నరేంద్రమోడీ పై కేసు నమోదు

ప్రధాని నరేంద్రమోడీ పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని సమాచార హక్కుల కార్యకర్త సందీప్ శుక్లా నరేంద్ర మోడీ పై కేసు నమోదు చేశారు. సియోల్ లో పర్యటించిన నరేంద్ర మోడీ భారత్‌లో పుట్టినందుకు సిగ్గుపడాలంటూ చేసిన వ్యాఖ్యలు తన సెంటిమెంట్ ను దెబ్బతీశాయని అన్నారు. సియోల్ లో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగ వీడియోను కోర్టులో సమర్పించడంతో కోర్టు మోడీపై కేసు నమోదు చేయాలని కాన్పూర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆజ్ల మేరకు పోలీసులు నరేంద్ర మోడీ పై కేసు నమోదు చేశారు.

 ⁠