చంద్రబాబుని తక్కువ అంచనా వేయొద్దంటున్న బీజేపీ నేత

 

ఎవరెన్ని చెప్పినా చంద్రబాబుకి తెలివితేటలు, పట్టుదల, ముందుచూపు ఎక్కువని అందరికి తెల్సిన నిజం.. ఈ నిజం ప్రతిపక్ష నేతలకి తెల్సినా కూడా ఒప్పుకోరని విశ్లేషకులు అంటుంటారు.. కానీ బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర రావు మాత్రం చంద్రబాబుని తక్కువ అంచనా వేయొద్దంటూ తన మనస్సులో మాటని చెప్పారు.. 'ప్రస్తుతం మోడీ, అమిత్ షా లాంటి వారిని అంచనా వేయగల అతి తక్కువమంది నాయకుల్లో చంద్రబాబు ఒకరని.. అందుకే ఎన్నికలకి ఏడాది ముందే బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఎన్నికల కసరత్తు మొదలు పెట్టారు' అన్నారు.

'చంద్రబాబుని ఓడించడం అంత ఈజీ కాదని. చంద్రబాబుని ఓడించాలంటే చాలా శక్తుల్ని ఓడించాలి' అన్న మురళీధర్.. చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యమని.. దానికోసం చాలా ప్రణాళికలు రచించాలని అన్నారు.. మొత్తానికి చంద్రబాబుని తక్కువ అంచనా వేయవద్దని మురళీధర్, బీజేపీ నేతలకి బాగానే గుర్తుచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.