బీజేపీ ఎమ్మెల్యేపై డీఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు....
posted on Apr 29, 2017 5:01PM
.jpg)
అసోంలో అధికార బీజేపీకి ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక మహిళ ఎమ్మెల్యేను ఇంటిపేరుతో సంబోధిస్తూ ఆయన ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఇలాగే మహిళా ప్రజాప్రతినిధులపై దుర్భాషలు ఆడిన అంజన్ బొరా సస్పెన్షన్‌కు గురయ్యారు. మహిళ ఎమ్మెల్యేను ఇంటిపేరుతో సంబోధిస్తూ ఆయన ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దీంతో బీజేపీ నేతలు ఈ పోస్టుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ ఆయనపై శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. నేరపూరిత అభియోగాల కింద ఆయనను సీఐడీ అరెస్టు చేసింది. కాగా అంజన్ బొరా గతంలోనూ ఇటువంటి పోస్టులే చేసి, సస్పెన్షన్‌కు కూడా గురైన సంగతి తెలిసిందే.