కాలాతీతుడు.. కారణ జన్ముడు.. నారా చంద్రబాబునాయుడు!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు 75 జన్మ దినం ఆదివారం (ఏప్రిల్20).  ఈ సందర్భంగా, వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ..అందిస్తున్న అభినందన అక్షరమాల .. 
 
నారా చంద్రబాబు నాయుడు.. కాలాతీతుడు, కారణ జన్ముడు. అవును. వయసు ముందుకు వెళ్ళే కొద్దీ, భారంగా మారుతుంది. వయసు భారం పెరుగుతుంది. ముఖ్యంగా, సప్త పదులు దాటి, వృధ్యాప్యంలో అడుగు పెట్టిన తర్వాత ప్రతి అడుగూ భారంగానే పడుతుంది. సహజంగానే  అడుగులు తడబడతాయి, ఆలోచనలు మందగిస్తాయి. కదులుతున్న కాలంతో కదలలేని నిరాసక్త కృంగదీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితం చలన రహితంగా,నిశ్చలన చిత్రంగా నిలిచిపోతుంది.  అవును. ఇది నిజం.  సర్వ సాధారణ ప్రకృతి ధర్మం. 

కానీ.. కొందరుంటారు, ఏదో ఒక పవిత్ర కార్యాన్ని నెరవేర్చేందుకు జన్మించిన కాలాతీత వ్యక్తులు, కారణ జన్ములు.  ఎక్కడో కోటికొక్కరు ఉంటారు. అలాంటి కారణ జన్ములకు వయసుతో సంబంధం ఉండదు. వయసు అడ్డురాదు. కాలంతో సంబంధం ఉండదు. కార్యమే ప్రధానంగా సాగిపోతూనే ఉంటారు. కార్యసిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంటారు. అలాంటి కారణజన్ములను, ఆవరోధాలు అడ్డుకోలేవు. వాటినే వారు  అవకాశాలుగా మలచుకుంటారు. వివేచనతో  అవరోధాలను అధిగమిస్తూ ముందుకు  సాగుతూనే ఉంటారు.   

అదిగో అలాంటి కారణజన్ముల్లో, అలాంటి కాలాతీత వ్యక్తుల్లో  ఈరోజు (ఏప్రిల్ 20) 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న  తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఒకరు. ఒకరు కాదు. ఒకే ఒక్కరు. అవును ఈ వయసులోనూ అలుపూ సొలుపూ లేకుండా పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల కోసం పని చేయడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. అందుకే  చంద్రబాబు ఒకే ఒక్కరు. ఆయనలాంటి ఇంకొకరు ఉండరు.  

అవును  75 సంవత్సరాల వయసులో, ఒకటీ రెండు కాదు, ఏకంగా వంద మెట్లు సునాయాసంగా ఎవరు ఎక్కగలరు. వయసును జయించిన చంద్రబాబు  తప్ప. మెట్లు ఎక్కడమే కాదు నిటారు నిలబడి బాధ్యతల బరువులు మోయగల సామర్ధ్యం కూడా ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చారిత్రక వాస్తఃవం. అదొక్కటే కాదు, చంద్రబాబాబు, ‘పుస్తకం’ తెరిస్తే.. ఇలాంటి రికార్డ్స్  ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ఎవరి  ఆసరా అవసరం లేకుండా,(అవును,ఆయనే ఎందరికో ఆసరా కదా)  ప్రచార రథం మెట్లు చకచా ఎక్కేస్తారు. ఎక్కడా తడబడకుండా,తొట్రుపాటు లేకుండా అలా నిలబడే అనర్గళంగా, అద్భుతంగా. సుదీర్గ ప్రసంగం చేస్తారు.. చప్పట్లు కొట్టించుకుంటారు. 

చంద్రబాబు నాయుడు కారణజన్ముడు మాత్రమే కాదు. కాలాన్ని జయించిన కాలాతీతుడు. అందుకే  47 డిగ్రీల మండు టెండలో అయినా, గజగజ లాడించే తుపాను గాలుల్లో అయినా ప్రజాబలంతో పనిచేసే, ఒకే  ఒక్కడు. చంద్ర బాబు నాయుడు రోజుకు 20 గంటల చొప్పున ఏడాది పొడవునా అంటే  365 రోజులూ పని చేసే ఏకైక నాయకుడు. చంద్రబాబుకు  పని రాక్షసుడు’ అనే పేరు ఎప్పుడో  వుంది. అలాగే  పరిపాలనలో ఆయనకు ఆయనే సాటి. ప్రభుత్వ శాఖలన్నిటిపైనా  పట్టున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సుదీర్గ అనుభంలో అన్ని ప్రభుత్వ శాఖలను అవపోసన పట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఇన్ని మాటలు ఎందుకు.. తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన వరం నారా చంద్రబాబు నాయుడు. ఆయన జీవితం.. ఈ తరానికే కాదు, ముందు తరాలకు కూడా ఒక పాఠ్య పుస్తకం. అందరం చదువుకుందాం.అందరం నేర్చుకుందాం. 
మరొక్క మారు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu