పీకపై కత్తి పెట్టినా ఆ మాట అనను... అయితే పాకిస్థాన్ వెళ్లిపో..శివసేన
posted on Mar 15, 2016 10:25AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్స్) చీఫ్ మోహన్ భగవత్ జెఎన్ యూ వివాదం నేపథ్యంలో భావి తరాలకు ‘భారత్ మాతా కీ జై’ అన్న నినాదాన్ని నేర్పాల్సి ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘పీకపై కత్తి పెట్టినా... భారత్ మాతా కీ జై అనమంటే అనను’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు అసదుద్దీన్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది. దీనిపై శివసేన పార్టీ ఘాటుగా స్పందిస్తూ.. ‘భారత్ మాతా కీ జై’ అని ఉచ్చరించకపోతే... తక్షణమే ఓవైసీ పాకిస్థాన్ వెళ్లిపోవాలని మండిపడింది. మరి శివసేన వ్యాఖ్యలకి అసదుద్దీన్ ఎలా స్పందిస్తారో చూడాలి.