ఎపుడూ వెన్నంటి ఉండే ఆ ఎంపీని దూరం పెట్టిన జగన్.. కారణం అదేనా!!

 

 

ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎటువంటి పరిస్థితులలోను ప్రభుత్వ కార్యకలాపాలలో అవినీతిని సహించేది లేదని  సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై వైసిపి పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా  సీఎం జగన్ స్పష్టమైన సూచనలివ్వడం జరిగింది. ఐతే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఇదే విషయమై అయన ఎప్పుడు తన తో ఉండే ఒక ఎంపీని కూడా దూరం పెట్టారని సమాచారం. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినా మరే ఇతర ముఖ్య కార్యక్రమమైనా ఒక యువ ఎంపీ అయన వెన్నంటే ఉంటారు. ఐతే తాజాగా ఆ ఎంపీ తన పదవిని, అలాగే సీఎం వద్ద ఉన్న పరిచయాన్ని దుర్వినియోగం చేసి త్వరగా నాలుగు రాళ్లు వెనకేసుకునే పనిలో పడ్డారని సమాచారం జగన్ కు చేరిందట. అంతే కాకుండా ఆ ఎంపీ అక్రమ ఇసుక తరలింపులో లోకల్ ఎమ్మెల్యే తో గొడవ పడుతున్నట్లు తెలియడంతో ఆ ఎంపీని దూరం పెట్టినట్లు అలాగే సిఎంవో లోకి నో ఎంట్రీ అన్నట్లు తెలుస్తోంది.