మద్యపాన నిషేధం దిశగా ఏపీ మరో కీలక అడుగు

మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొస్తామని చెప్పిన జగన్ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి మరో 535 మద్యం షాపులు మూతపడనున్నాయి. ఇటీవల తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. రాష్ట్రంలో 535 మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ తగ్గించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3500 షాపులు ఉండగా, ఇప్పుడు వాటిని 2,965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 20 శాతం షాపులు తగ్గించింది. ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 33శాతం షాపులు తగ్గించినట్లైంది. మద్య నిషేధం లక్ష్యమని చెబుతున్న జగన్ సర్కార్.. అందులో భాగంగానే షాపులను తగ్గించుకుంటూ వస్తోంది.