అమితాబ్ ను కలవనున్న రజనీ....రాజకీయాల్లోకి రావచ్చా..?


తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే పలు వార్తలు హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే. ఒకపక్క కొంతమంది విమర్సిస్తున్నా...మరోపక్క అభిమానులు మాత్రం ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరో వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే... బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను రజనీ త్వరలోనే కలవనున్నారని తెలుస్తోంది. అంతేకాదు  రాజకీయాల్లోకి రావడం శ్రేయస్కరమా? లేదా? అన్న వివరాలను రజనీ అమితాబ్ ను అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం వరకూ ఆగాల్సిందే.