దేవుడా.. మొన్న పవన్... ఇప్పుడు చంద్రబాబు..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలని కూడా చూడారు. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలు ఆయనకు అస్సలు నచ్చదు. వారికి గట్టి వార్నింగే ఇస్తుంటారు. అలా చంద్రబాబు ఆగ్రహానికి గురైంది పాపం అఖిల ప్రియ. వైసీపీ పార్టీ నుండి భూమా అఖిల ప్రియ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం.. చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. అదే  పర్యాటక శాఖ మంత్రి. అయితే తాజాగా జరిగిన మంత్రి వర్గ భేటీలో చంద్రబాబు అఖిల ప్రియపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి అంటే ఏసీ కార్లలో తిరగడం కాదు .ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి...అధికారులను ఎప్పటికప్పుడు పరుగులు పెట్టిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలి .అందులో అందర్నీ భాగస్వాములు చేయించాలి .ఇలా అయితే మీ స్థానంలో ఇంకొకరు ఉంటారు అని మంత్రి అఖిల ప్రియపై బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. అయితే దీనికి కారణం ఉంది లెండి. ఇటీవల కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇందుకుగాను.. ఏపీ ప్రభుత్వంపై అందరూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం, అధికారుల నిర్ణక్ష్యంవల్లే ఇలా జరిగిందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.


మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ టూర్ లో ఈ విషయంపై అఖిల ప్రియకు క్లాస్ పీకిన సంగతి తెలిసిందే కదా. అఖిల ప్రియ.. మీరు అతి కొద్దికాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సాటివాళ్ల బాధను వెంటనే అర్థం చేసుకోగలరు. శోభ నాగిరెడ్డి దంపతులు నాకు పీఆర్పీ నుంచి తెలుసు. మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ప్రత్యర్థి కావాలి. నేను వస్తే ఓడిపోతానంటే.. మీరు అమ్మను కోల్పోయారనే కారణంతో ఎన్డీయేకి మద్దతు ఇచ్చినప్పటికీ నేను నంద్యాలలో ప్రచారం చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. పరోక్షంగా రెండుసార్లు మీ విజయానికి తోడ్పడ్డా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. తానేమీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని... మంత్రిగా బాధ్యత వహించి.. బాధితులతో మాట్లాడాలి. ప్రజాసమస్యల పట్ల స్పందించకపోతే.. మీది బాధ్యత రాహిత్యం అవుతుందని అన్నాడు.

 

మొత్తానికి అటు చంద్రబాబు, ఇటు పవన్ చేతిలో అఖిల ప్రియకు క్లాస్ పడింది. మరి అతి చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించున్న అఖిల ప్రియ పెద్దల మాటలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా యాక్టివ్ అయితే బావుంటుంది మరీ. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిదే..