ఢిల్లీలో అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధ౦
posted on Nov 4, 2014 10:28AM
ఢిల్లీలో అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్టీకి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ నివేదిక సమర్పించారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సుముఖంగా లేవని నివేదికలో పేర్కొన్నారు.
ఈ నెల 11లోగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ సోమవారం బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా బీజేపీని గవర్నర్ కోరినా.. ఆ పార్టీ అందుకు నిరాకరించింది. ఇక ఆప్, కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికలకే మొగ్గుచూపారు. దీంతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్టీకి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని నివేదిక సమర్పించారు.