మోదీపై లాల్ సూపర్ పంచ్.. గుండు గీయించుకో..

 

రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం కామన్. ఇప్పుడు తాజాగా  ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్ బీజేపీ నేత సుశీల్ కుమార్ ఇద్దరూ ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇక సుశీల్ కుమార్ వ్యాఖ్యలకు స్పందించిన లాలూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎంగా బీజేపీ యోగి ఆధిత్యనాథ్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకుగాను లాలూపై సుశీల్‌ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ’యోగి సీఎం కావడంతో ఆయనను ఎలా తిట్టాలో కూడా తెలియని దిగ్భ్రాంత స్థితిలో లాలూ ఉన్నారు’ అటూ ట్వీట్‌ చేశారు.

 

మరి లాలూ దీనికి సైలెంట్ గా ఉంటారా.. ఆయన కూడా అంతే ఘాటుగా స్పందించి... ’నువ్వు కూడా చెవులు కుట్టించుకో. గుండు గీయించుకో. దుస్తులు మార్చుకో. ఇది నీకు మేలు చేయవచ్చు. (ప్రమాణస్వీకారానికి) నిన్ను పిలువలేదని మరీ బాధపడిపోకు’ అంటూ చురకలు అంటించారు. నువ్వు కూడా సన్యాసం స్వీకరిస్తే బాగుపడే చాన్సుందని పరోక్షంగా సూచిస్తూ లాలూ పేల్చిన ఈ వ్యంగ్యాస్త్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. సుశీల్‌మోదీకి ఇది అద్భుతమైన పంచ్‌ అని పలువురు నెటిజన్లు అనుకుంటున్నారు.