Next Page 
యోధుడు పేజి 1

                                                                           

                       యోధుడు
   
   
                                                                              ---:సూర్యదేవర రామ్ మోహన్ రావు



    ONE OF THE GREATEST PAINS TO HUMAN NATURE IS THE PAIN OF A NEW IDEA... AND FIGHT WITHA TIME....

    విధి మనిషితో అడే ఇంద్రజాలం పేరే కాలం... మనిషి మనిషితో అడే దాగుడుమూతల పేరే కాలం.... కరవాలం పదునులోని చిరునవ్వే కాలం....

    సున్నితమైన అద్దాలగది, మనస్సులో చెలరేగే మహాద్భుతమైనా అగ్ని ప్రభంజనమే కాలం.... కాలం బహు కఠినమైంది, మన దగ్గరుండే పాత ఘడియల్ని తీసుకోనిదే, కొత్త ఘడియల్ని ఇవ్వదు.

    మనుషులకు ఇచ్చి, పుచ్చుకునే అలవాటుంటే, కాలానికి పుచ్చుకునిగాని ఇవ్వని చిత్రమైన అలవాటు వుంది. కాలం కాటుకి, వెతుకి ఎవరైనా ఎప్పుడైనా తలవంచక తప్పదేమో.....
   
                                                                     ప్రోలోగ్
    ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఒక గ్లాస్ ఛాంబర్ లో నిస్రాణగా పడివున్నాడు కాశీచరణ్.

    ముఖానికి అమర్చిన ఆక్సిజన్ మాస్క ఒక పక్క, వేలాడు తున్న బ్లడ్ బాటిల్స్ మరో పక్కా, బ్రెయిన్ లోని నరాలకు కంప్యూటర్ నుంచి కనెక్ట్ చేయబడ్డ వైర్లు కాశీచరణ్ శరీరంలోను, నరాల్లోనూ జరిగే ప్రతి కదలికను ఆటోమెట్టిగా విశ్లేషించి చూపే మెడికల్ కంప్యూటర్ టేర్మనేల్స్.

    ప్రొపెసర్ వోశ్వంభార్ చేసిన సంజ్ఞ మేరకు కాశీచరణ్ ముఖానికున్న ఆక్సిజన్ మాస్క్ ను తొలిగించాడో డాక్టర్.  వెంటనే అతని ముఖం లోకి అత్రుతుగా చూశాడు నీలకంఠన్ . కుట్లు కుట్ట బడిన బ్రెయిన్, ఆపైన కొద్దికొద్దిగా సవిస్తున్నా రక్తం మరకల్ని దూదితో అడ్డుతున్న నర్స్... పరిష్టితి ఉద్విగణంగా వుంది. భారంగా ఊపిరి పీలుస్తూన్నడతాను. ఆ ఊపిరి శబ్దం ఇంటేన్సివ్ కేర్ సౌండ్ ప్రూఫ్ ఎసీరూం లో స్పష్టంగా వినిపిస్తోంది.

    కాశీచరణ్ ముఖం చర్మపు మడతల్లో చిరు కదలిక. పైకీ కిందకూ వదులుతున్న గుండె. అంతవరకూ నిటారుగా వున్న చేతివెళ్ళు క్రమంగా కంగుతున్నాయి. డాక్టర్లు ఆత్రంగా అతని ఫాల్స్ ని చూస్తున్నారు.

    విశ్వంబర్ చూపులు మాత్రం కాశీచరణ్ కనురెప్పలమీదే వున్నాయి,. నేమ్మదిగా అతని కనురెప్పలు కదులుతున్నాయి అక్కడున్న అందరూ ఊపిరి బిగపేట్టి అతనికేసి చూస్తున్నారు. ఒక్కసారిగా, ఆ కనురెప్పలు తెరుచుకున్నాయి. తెరుచుకున్న అతని కళ్ళు సూటిగా రూఫ్ వైపు చూడసాగాయి. ఒక డాక్టర్ వంగి. ఆ కళ్ళవైపు చూశాడు.

     "మిస్టర్ కాశీ... కాశీచరణ్ పిలిచాడతాను.

    ఒకసారి కాదు ఐదుసార్లు పిలిచాడు.

    ఆ పిలుపు అతనికి వినబడలేదో, వినబడినా అతని జ్ఞానేంద్రియాలు రియాక్ట్ కాలేదో అక్కడున్న ఎవరికీ అర్ధంకాలేదు. కాశీచరణ్ చూపులు మాత్రం రూప్ వైపే వున్నాయి. తనమాటల్ని అతని బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదని గ్రహించిన ఆ డాక్టర్ చేతిసంజ్ఞల ద్వారా భావాన్ని అతనికి అందజేయటానికి ప్రయత్నించాడు. అయినా ఫలితంలేదు. ఆపైన ఆ ఒక్క డాక్టర్ ప్రయత్నాన్ని ముగ్గురు పంచుకున్నారు.

    రకరకాలుగా ప్రయత్నించసాగారు.


    ఇరవైనిమిషాలు గడిచాయి.


    చాలసేపటినుంచి కాశీచరణ్ కుడుచేతివెళ్ళా కదలికల వైపు చూస్తున్న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ "ప్రావుపిసర్ విశ్వంభర్..... అతని వేళ్ళలో పెన్నుని వుంచితే ఏవైనా రాసి అతని మనసులోని మెసేజ్ని మనకు అమ్దిమ్చగలదేమో" అన్నాడు చురుగ్గా ఆలోచిస్తూ.

    అ సూచన ఇచ్చిన డి.సి.పి వైపు విస్మయంగా చూశాడు ప్రొపెసర్ విశ్వంభర్

    "గుడ్ఐడియా! దానివల్ల మీకు ఇమిడియట్  గా కొంత వర్క్ దొరుకుతుంది. మాకు టెన్షన్ తగ్గుతుంది."

    ప్రొపెసర్ విశ్వంభర్ ఆదేశంతో నర్స్ పెన్నూ, పాడ్ తెచ్చి డాక్టరుకిచ్చింది.

    ఆ పెన్నుని కాశీచరణ్ కుడిచేతి వెళ్ళమధ్య పేట్టి, ఏమైనా వ్రాయమన్నట్టుగా సంజ్ఞచేసి, రాయటానికి వీలుగా పాద ను అమర్చాడు డాక్టర్. అందరి చూపులూ కాశీచరణ్ కుడిచేతివెళ్ళ మీద వున్నాయి.

    "మిస్టర్ కాశీచరణ్.... ప్లీజ్ ట్రైటూరైట్ డవున్. సమ్ థింగ్...ఆర్యూరిసీవింగ్ మై వర్డ్స్ మిస్టర్ కాశీచరణ్... మిష్టర్ కాశీ" డాక్టర్ అతని చెవి దగ్గరగా తన ముఖాన్ని ఆనించి,  వివిధ రకాలైన సౌండ్ ప్రీక్వీన్సీ తో పలుమార్లు చెప్పసాగాడు.

    అయినా కాశీచరణ్ చూపుల్లో ఏ మాత్రం మార్పులేదు_ అతను యదేచ్చగా రూమ్ వైపు మాత్రమె చూస్తున్నాడు. అతని గుడ్లుగానీ, కనురెప్పలుగానీ  కదలాడడంలేదు. అంతటా ఉత్కంఠ నేలకోంది_ అందరి ముఖాల్లూనూ ఏదో తెలియని అస్పష్టమైన నిరాశ.

వైద్య శాస్రం, నేరపరిశోధక శాస్రం అతనిముందు తాత్కాలికంగా ఓటమిని అంగీకరించినట్టుగా ఉంది. అక్కడున్న అందరిలో రవ్వంత నిస్ప్రుహా అవరిస్తుండగా కాశీ చరణ్ వెళ్ళు మాత్రం కదులుతున్నాయి. కానీ పెన్నుని పట్టుకోవడంలేదు.

    రెండునిమిషాలుగడిచాయి భారంగా.... అప్పుడు సరిగ్గా అప్పుడే_ అతని చూపుడువేలు, బొటనవేలు పెన్నుని పట్టుకోవడం  ఆ రియాక్షన్కి సంబంధించిన కంప్యూటర్ మానిటర్ స్క్రీన్ మీద రెడ్ అండ బ్లూ కలర్స్తో ఇండికేశన్స్ కనబడంతో అందరి కళ్ళూ క్షణంకాలంపాటు మెరిశాయి.

    కాశీచరణ్ తల దిశగా నడచి, అతని నుదుటి మీద చెయ్యి వేశాడు ప్రొపెసర్ విశ్వంబార్. బాడీ టెంపరేచర్ నార్మల్!" "కామాన్... కాశీ... పిక్ ఆఫ్ ద ఫెన్...ప్లీజ్ రైట్ డవున్ సమ్ థింగ్ " మైక్రోఫోన్ ద్వారా మెసేజ్ ను యిస్తున్నాడు.విశ్వంభర్

అకస్మాత్తుగా కాశీచరణ్ కనురెప్పల్లో చలనం ప్రారంభమైంది. రూఫ్ నుంచి అతని దృష్టి మారింది. నేరుగా నీల ఖమ్తంవైపు చూశాడు ముందు. ఆ తర్వాత చూపులు మార్చి డి సి.పి వైపు చూశాడు. 

    డి .సి.పి అతని కేసి ఆతృతగా చూడసాగాడు.

    అతని చేతివెళ్ళు మరికొంత వేగాన్ని పుంజుకున్నాయి. తెల్లటి పేపర్ మీద అ పెన్ను కదలసాగింది.

    అతని వెళ్ళు పెన్నును పట్టుకున్నాయి. తెల్లటి పేపర్ మీద ఆ పెన్ను కదలసాగింది.

    కేవలం ముప్ఫై సెకండ్లు. ఆ రూమ్ లో గాఢమైన నిశ్శబ్దం. ఒకరి ఊపిరి ఒకరికి వినిపించేటంత నిశ్శబ్దం.

    కాశీచరణ్ కుడిచేతివైపు, ఆ వెళ్ళ కదలికళవైపు, ప్యాడ్ లోని పేపర్ మీద అతను సగం అపస్మారకస్తితులో రాస్తున్న దానివైపు తదేకంగా కన్నార్పకుండా చూస్తూన్నారందరూ. ఇరవై సెకండ్ల తర్వాత అతని వెళ్ళ మధ్యనుండి పెన్ను జారి క్రిందపడిపోయింది.

    అంతవరకు తెరచి వున్న కనురేప్పలు ఒక్కసారిగా మూసుకునిపోయాయి. పక్కనేవున్నడాక్టర్ కంగారుగా స్టేతస్కోపును తీసి అతని గుండెలమీద వుంచాడు.

    అదే సమయంలో ప్రొపెసర్  విశ్వంబర్  వేగంగా ముందుకు కదిలాడు. "డోన్ట్వర్రీ ప్రొపెసర్... అతను మళ్ళీ స్పృహా తప్పి పోయాడు" నిర్లిప్తంగా అన్నాడు డాక్టర్.

    "ఇప్పట్లో మెలుకువ రాదా?" అడిగాడు నీలకంఠన్  డి. సి . పి వైపు చూశాడు. అదే సమయంలో డి సి.పి ప్యాడ్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
   
                                                                            *    *    *    *


Next Page 

  • WRITERS
    PUBLICATIONS