పక్కనే ఉండి ఏం ప్రయోజనం

 

 

 

సరసుని మానసంబు సరసజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం

డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం

బరయఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో

త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ!

 

కొలనులో తామరపూలు ఉంటాయి. ఆ తామరపూల పక్కనే కప్ప కూడా బతుకుతూ ఉంటుంది. కానీ ఆ తామరపూలలో ఉన్న మకరందాన్ని మాత్రం కప్ప ఆస్వాదించలేదు. ఎక్కడి నుంచో వచ్చే తుమ్మెద మాత్రం తామరపూలలోని తేనెని జుర్రుకుంటుంది. అలాగే దైవానికి సమీపంగా భౌతికంగా ఉన్నంతమాత్రాన ఎలాంటి ఉపయోగమూ లేదు. మనసులో ఆ భగవంతుని పట్ల తపన ఉండాలి.

 

..Nirjara


More Good Word Of The Day