ఒళ్లే కాదు బుద్ధి కూడా జాగ్రత్త

 

 

 

వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను

బహు శుచిగ కాపాడుకొనియేరయ!

తమవెంట వచ్చేది మనస్సు బుద్ధనుమాట

యోచింపకుండనే బ్రతికేరయ!

మనుషులు తమ ఒంటిని చక్కగా శుచిగా ఉంచుకుంటారు. దానికి తొడిగే బట్టలూ మాసిపోకుండా చూసుకుంటారు. కానీ బుద్ధి సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు బ్రహ్మంగారు. వల్లకాటికి పోయే దేహాన్నీ, బట్టలనీ అంత శుచిగా చూసుకునే మనుషులు... జన్మజన్మలుగా మనతోనే ఉండే బుద్ధిని, నిష్కల్మషంగా ఉంచుకునే ప్రయత్నం చేయరెందుకని అంటున్నారు.

 


More Good Word Of The Day