Home » Yoga » మందంగా ఉన్న తొడలు సన్నగా మారాలంటే ఈ ఆసనాలు వేయండి..!

మందంగా ఉన్న తొడలు సన్నగా మారాలంటే ఈ ఆసనాలు వేయండి..!


యోగా.. శరీరం ఫిట్ గా ఉండటానికి భారతీయ ఋషులు అందించిన గొప్ప మార్గం. ప్రతి  రోజూ యోగా చేసే వారి శరీరం చాలా ఫిట్ గా ఉంటుంది.  శరీరంలో ఏ ప్రాంతంలో అయినా కొవ్వు కరిగించాలన్నా,  ఏ భాగంలో అయినా నొప్పులు లాంటివి తగ్గి,  ఆ భాగం బలంగా మారాలన్నా కూడా యోగా బాగా పనిచేస్తుంది.  మహిళలు సాదారణంగా తమ తొడలు సన్నగా ఉండాలని కోరుకుంటారు.  కానీ చాలామంది మందంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. మందంగా ఉన్న తొడలను సన్నగా చేయడానికి కూడా యోగా బాగా సహాయపడుతుంది. తొడలు సన్నగా మారడానికి ఏ ఆసనాలు బాగా సహాయపడతాయో తెలుసుకుంటే.. వాటిని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.  అవేంటంటే..

సేతు బంధాసనం..

సేతు బంధాసనాన్ని వంతెన భంగిమ అని అంటారు. సేతు అంటే బ్రిడ్జ్.. దీన్నే వంతెన అని కూడా పిలుస్తారు.  

ఎలా వేయాలి..

ఈ ఆసనాన్ని వేయాలంటే వెల్లికిలా పడుకోవాలి. మోకాళ్లను వంచి తుంటిని పైకి లేపాలి. ఇలా చేసినప్పుడు శరీరం వంతెన లాగా ఒక ఆకారానికి వస్తుంది. ఇది తొడలను టోన్ చేయడంలో సహాయపడుతుంది.

నౌకాసనం..

నౌకాసనం ను బోట్ పోజ్ అని కూడా అంటారు.  ఇది పడవ ఆకారాన్ని పోలి ఉంటుంది.  అందుకే నౌకాసనం అని అంటారు.

ఎలా చేయాలి..

నౌకాసనాన్ని వేయడానికి నేల మీద కూర్చోవాలి.  ఇప్పుడు పిరుదుల మీద బరువు ఉంచి చేతులను,  పాదాలను పైకి లేపాలి. ఇలా ఉన్నప్పుడు శరీరం V ఆకారంలోకి వస్తుంది. ఈ ఆసనం వల్ల తొడలు సన్నబడటమే కాకుండా.. మానసిక ఏకాగ్రత పెరుగుతుంది.  బలం పెరుగుతుంది, బాలెన్సింగ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.

మలాసనం..

సాధారణంగా భారతీయుల జీవితంలో ముడి పడి ఉన్న ఆసనం ఇది.  బారతీయులు మలవిసర్జనకు కూర్చొన్నట్టు ఉంటుంది.  ఇలా కూర్చొన్నప్పుడు శరీరం ఒక దండ ఆకారంలో కనిపిస్తుంది.

మలాసనం వేయడం వల్ల  తొడలు సన్నబడటమే కాకుండా తుంటి కదలిక బాగుంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.  వెన్నునొప్పికి ఈ ఆసనం చాలా మంచిది.

వీరభద్రాసనం..

వీరభద్రాసనం సూర్యనమస్కారాలలో ఒక భాగంగా కనిపిస్తుంది. దీన్ని యోధుడి భంగిమగా పరిగణిస్తారు.  ఈ ఆసనంలోనే దైర్యం, స్థిరత్వం, బలం స్పష్టంగా వ్యక్తం అవుతాయి.

ఈ ఆసనం వేస్తే శరీరం బలపడుతుంది.  భుజాలు, తొడలు, కాళ్లు బలపడతాయి.  తొడలు సన్నగా ఆవుతాయి.

వృక్షాసనం..

వృక్షాసనం చెట్టు భంగిమను పోలి ఉంటుంది.

ఎలా వేయాలి..

ఈ ఆసనం వేయడం సులభం.  ఒక కాలిపై నిలబడి,  మరొక కాలు మడిచి పాదాన్ని తొడ భాగం లోపల ఉంచాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి.

ఈ ఆసనం తొడలను సన్నగా చేయడమే కాకుండా  బాలెన్సింగ్ పెంచుతుంది,  ఏకాగ్రతను, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.

ఉత్కటాసనం..

ఉత్కటాసనం నే చైర్ పోజ్ అని కూడా అంటారు. ఉత్కట అంటే శక్తివంతమైనది లేదా తీవ్రమైనది అని అర్థం.  ఈ ఆసనం చాలా శక్తివంతమైనది.

ఈ ఆసనం వేయడం చాలా సులభం.  ఈ ఆసనంలో మోకాళ్లను వంచి కుర్చీలో కూర్చున్నట్టుగా  ఉండాలి.  రెండు చేతులను కలిపి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇది తొడలను సన్నగా మార్చడమే కాకుండా,  కాళ్లు, తొడలు, పిరుదులను బలంగా మారుస్తాయి.

నటరాజాసనం..

నటరాజాసనం యోగాలో చాలా ముఖ్యమైనది.  పరమేశ్వరుడి నృత్య భంగిమలలో ఇది ఒకటి. అందుకే దీన్ని నటరాజ ఆసనం అని అంటున్నారు.  దీనిని డాన్సర్ ఫోజ్ అని కూడా అంటారు.

ఈ ఆసనం తొడలను సన్నబరచడమే కాకుండా ఏకాగ్రత పెంచుతుంది, కాళ్లు, తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. ఛాతీ, భుజాలు సాగదీయడం వల్ల ఆ కండరాలు కూడా బలపడతాయి.

                                      *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.