Home » Beauty Care » తలస్నానం చేయడానికి 5నిమిషాల ముందు ఈ పని చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది!
తలస్నానం చేయడానికి 5నిమిషాల ముందు ఈ పని చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది!

ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం ఒక పెద్ద సమస్యగా మారింది. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించదు. అయితే జుట్టు రాలడం తగ్గించుకోవడానికి తలకు షాంపూ చేయడానికి ఐదు నిమిషాల ముందు ఒకే ఒక పని చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. కేవలం జుట్టు రాలడం తగ్గడమే కాదు.. జుట్టు ఒత్తుగా, నేచురల్ గా నల్లగా మారుతుంది కూడా. అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి? జుట్టు రాలడాన్ని ఆపడంలో ప్రభావవంతంగా పని చేసే ఆ చిట్కా ఏంటో తెలుసుకుంటే..
జుట్టు రాలడానికి కారణాలు..
కాలుష్యం, దుమ్ము , అనారోగ్యకరమైన ఆహారం వల్ల జుట్టు రాలుతుంది.
ఆవనూనే..
జుట్టు సంరక్షణ కోసం ఆవ నూనెను ఉపయోగించవచ్చు. షాంపూ చేయడానికి ముందు రోజు రాత్రి జుట్టుకు ఆవ నూనెను రాసి, బాగా మసాజ్ చేయవచ్చు. మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేయవచ్చు. ఒకవేళ కుదరకపోతే కనీసం తలస్నానం చేయడానికి 5నిమిషాల ముందైనా సరే.. గోరువెచ్చని ఆవనూనెతో మసాజ్ చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు.
పోషణ..
భారతదేశంలో ఆవ నూనెను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. తల చర్మానికి పోషణ అందించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఆవ నూనెలో ఒమేగా-3 , ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి.
తేమ..
నూనెతో జుట్టుకు మర్దన చేయడం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు నూనె రాయడం వల్ల పొడిబారడం తగ్గి, సహజంగా మృదువుగా మారుతుంది.
చుండ్రు..
ఆవ నూనెతో తలకు మర్దన చేయడం వల్ల తల చర్మం పొడిబారడం తగ్గుతుంది. ఇది చుండ్రును కూడా తగ్గిస్తుంది. ఆవ నూనెను పూయడం ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
