Home » Beauty Care » చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్.. వీటితో జాగ్రత్త!
చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్.. వీటితో జాగ్రత్త!

ఈ రోజుల్లో స్కిన్ కేర్ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దుమ్ము, కాలుష్యం , మారుతున్న వాతావరణం కారణంగా, చర్మం నిరంతరం బయట నుండి నష్టాన్ని ఎదుర్కొంటుంది, అందుకే చర్మాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చర్మానికి మేలు కలించడం కంటే.. చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. చర్మానికి హాని కలిగించే కొన్ని సాధారణ స్కిన్ కేర్ టిప్స్ ఉన్నాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఎంతో మంచివి అనుకునే ఆ టిప్స్ కారణంగానే నేటికాలంలో చాలామంది చర్మ సమస్యలు ఎక్కువ ఎదుర్కుంటున్నారు. కాబట్టి, చర్మానికి హాని కలిగించే సాధారణ స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకుంటే..
సన్ స్క్రీన్..
చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. UV కిరణాలు చర్మాన్ని త్వరగా వృద్ధాప్యం చెందేలా చేస్తాయి, చర్మంపై మచ్చలను పెంచుతాయి, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అయితే ఎండలో వెళ్తున్నప్పుడు తప్ప చాలా మంది సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు, కానీ సాధారణ రోజులలో ముఖ్యంగా వర్షం పడే రోజులలో కూడా దీనిని ఉపయోగించడం ముఖ్యం.
ఇంటి చిట్కాలు..
నిమ్మరసం, టూత్‌పేస్ట్ లేదా ఇతర వంటగది చిట్కాలను నేరుగా ముఖానికి పూస్తుంటారు. దీనివల్ల చర్మం కమిలిపోవడం, రంగు మారడం, చర్మంపై మచ్చలు పెరగడం వంటివి జరిగేలా చేస్తాయి. ఇలాంటి చికిత్సలు ముఖ్యంగా మొటిమలు వచ్చే లేదా సున్నితమైన చర్మానికి హానికరం.
సోషల్ మీడియా టిప్స్..
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చర్మ సంరక్షణ చిట్కాలు ఎక్కువగా ఫ్రూవ్ కానివే అయి ఉంటాయి. చాలామంది వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి టిప్స్ చెబుతూ ఉంటారు. మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్ లేదా ఎగ్జిమా వంటి సమస్యలకు సరైన, ఫ్రూప్ చేయబడిన ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అంతేకానీ సోషల్ మీడియాలో చూసి ఎప్పుడూ అనుసరించకూడదు.
స్కిన్ కేర్ అంటే..
చాలామంది అమ్మాయిలు తమ చర్మ సంరక్షణను కేవలం ముఖానికే పరిమితం చేసుకుంటారు, కానీ మెడ, ఛాతీ , చేతులపై కూడా చర్మం తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ భాగాలకు మాయిశ్చరైజర్ , సన్‌స్క్రీన్ రాయడం కూడా చాలా అవసరం.
ఫేస్ వాష్..
పదే పదే ముఖం కడుక్కోవడం లేదా కఠినమైన సబ్బులను వాడటం వల్ల చర్మపు పొర దెబ్బతిని, చర్మం పొడిబారడం, సెన్సిటివిటీ పెరగడం, చివరికి మొటిమలు కూడా రావడం జరుగుతుంది.
క్రీమ్స్, లోషన్లు...
తడి చర్మంపై క్రీములు, లోషన్లు వంటి పదార్థాలను పూయడం వల్ల వాటి ప్రభావాలు తీవ్రమై, మంట , చికాకు కలిగే ప్రమాదం పెరుగుతుంది. రెటినోల్ , ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్‌ల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం.
ముఖం తుడితే విధానం..
టవల్‌తో ముఖాన్ని రుద్దుతూ తుడుస్తూంటారు. ఇలా తుడుచుకోవడం చర్మానికి హానికరం. దీనివల్ల చర్మంపై లైట్ గా వాపు , మచ్చలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, ముఖాన్ని మెల్లగా తట్టడం ద్వారా తుడుచుకోవాలి. ఇదే మంచి పద్దతి.
స్కిన్ కేర్ ప్రోడక్ట్..
చాలా పవర్పుల్ గా పనిచేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ను అకస్మాత్తుగా వాడటం చర్మానికి హానికరం కావచ్చు. ఇది చర్మపు రక్షణ పొరను దెబ్బతీసి, చికాకు లేదా రియాక్షన్స్ కు కారణం అవుతుంది.
పైన చెప్పుకున్న స్కిన్ కేర్ పద్దతులు అందరూ చాలా సాధారణం అనుకుంటారు. కానీ ఇవి చర్మానికి మేలు చేయకపోగా హాని ఎక్కువ చేస్తాయి. కాబట్టి జాగ్రత్త పడాలి.
*రూపశ్రీ.

