Home » Health Science  » why the menopause could make your teeth fall out,Effects of Menopause on Your Teeth,Factors Associated with Tooth Loss in Postmenopausal Women,Post menopausal hormone use and tooth loss,Menopause Symptoms,Dental Issues

మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోతుంటే ఈ వ్యాధి ఉండవచ్చు..!


రక్తం నుండి వ్యర్థాలను తొలగించడం ద్వారా శరీరం  ఆరోగ్యంగా ఉండటంలో  మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను  సమర్థవంతంగా ఫిల్టర్ చేయడంలో వైఫల్యం అయితే అది  తీవ్రమైన,  ప్రాణాంతకమైన  పరిస్థితులకు దారి తీస్తుంది.  మహిళలలో మెనోపాజ్ తరువాత దంతాలు ఊడిపోవడం అనేది మహిళలలో మూత్రపిండాల సమస్యను కలిగి ఉండే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది నిజమేనా.. దీని వెనుక ఉన్న కారణాలేంటి? తెలుసుకుంటే..


మహిళలలో మెనోపాజ్ తరువాత మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతుంది. మహిళలలో పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. ఈ పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల పొట్ట రావడం,  ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ దీర్ఘకాల మూత్ర పిండ వ్యాధికి కారకాలుగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఎముక,  గుండె సంబంధ సమస్యలతో పాటూ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది.


మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోవడం అనేది నోటి ఆరోగ్యానికి కూడా ప్రధాన సంకేతం. మధుమేహం,  థైరాయిడ్, బోలు ఎముకల వ్యాధి మొదలైన సమస్యలతో ఇవి ముడి పడి ఉంటాయి. ముఖ్యంగా 66 నుండి 79 సంవత్సరాల వయసు గల మహిళలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మహిళలలో ఖనిజాలు,  ఎముక జీవక్రియ రుగ్మతలను నివారించడం దంతాల నష్టాన్ని నివారించడంలో కీలకంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెనోపాజ్ దాటిన మహిళలు నోటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు.

                                             *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.