Home » Baby Care » పోలియో టీకాల ప్రాముఖ్యత ఏంటి.. పోలియో వ్యాధి గురించి అసలు నిజాలు ఏంటి!

పోలియో టీకాల ప్రాముఖ్యత ఏంటి.. పోలియో వ్యాధి గురించి అసలు నిజాలు ఏంటి!

చిన్నతనం నుండి ప్రతి ఒక్కరు.. పోలియో చుక్కలు వేయించాలి,  పిల్లల భవిష్యత్తు కాపాడాలి అనే స్లోగన్ వినే ఉంటారు.  మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలతో టీచర్లు ఊరంతా ర్యాలీ నిర్వహిస్తూ.. పోలియో చుక్కల గురించి అవగాహన పెంచాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉంటారు.  అయితే పోలియో చుక్కలు ఎందుకు వేయిస్తారు,  పోలియో వ్యాధి ఎందుకు వస్తుంది,  ఎలా వస్తుంది? చాలామందికి వీటి గురించి పూర్తీగా తెలియదు.  అందరూ వేయిస్తున్నారు కాబట్టి,  వేయిస్తే మంచిది కాబట్టి.. అనే కోణంలో చాలామంది వేయిస్తుంటారు.  కానీ పోలియో వ్యాధి గురించి,  పోలియో టీకాల గురించి తెలుసుకుంటే..

పోలియో వ్యాధి..

పోలియో అనేది పిల్లలను వికలాంగులను చేసే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇందులో పిల్లల శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల కాళ్లు, చేతులలో ఎదుగుదల లోపించడం,  వికలాంగులుగా మారడం జరుగుతుంది.

పోలియో వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.  ఈ వైరస్ నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది.  దీని వలన శరీర భాగాలు కదలకుండా పక్షవాతానికి గురవుతాయి.  

పోలియో వ్యాధి వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో శ్వాస తీసుకోవడానికి కీలకమైన కండరాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.  కొన్నిసార్లు మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది.

పోలియో టీకా..

పోలియో టీకాలు ముఖ్యంగా పోలియో వ్యాధి నివారించడానికే వేస్తారు. పోలియో టీకాలు వేశాక పిల్లల శరీరంలో పోలియో వైరస్ వ్యాపించడానికి ఆస్కారం ఉండదు. ఇది పిల్లలను మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ఇతర పిల్లల నుండి కూడా వ్యాధి వ్యాప్తి జరగకుండా చేస్తుంది.

పోలియో టీకాలను నిరంతరంగా వేస్తూ ఉండటం వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పోలియో దాదాపుగా నిర్మూలించబడింది. ప్రతి పిల్లవాడికి టీకాలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తీగా నిర్మూలించవచ్చని చెబుతున్నారు.

వ్యాక్సిన్ మోతాదు..

పోలియో వ్యాక్సిన్ మోతాదు కూడా చాలా కీలకం.  సరైన మోతాదు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పోలియో నివారించడం చాలా సులభం.  ఇది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇవ్వబడుతుంది.

                                                 *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.