Home » Baby Care » What is cerebral palsy
పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి?
మస్తిష్క పక్షవాతాన్ని సెరిబ్రల్ పాల్సీ అని అంటారు. మస్తిష్క పక్షవాతం పిల్లలలో నయం చేయలేని వ్యాధి. దీనిలో పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లలలో శారీరక సమస్యలు ఉండవచ్చు. సెరిబ్రల్ పాల్సీ పిల్లలలో బ్యాలెన్స్ లేకపోవడం, వారు ఉండే భంగిమలో మార్పు.. నడవగల సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం.. ఇవన్నీ మస్కిష్క పక్షవాతంలో సంభవిస్తాయి. మస్తిష్క పక్షవాతం పిల్లలలో అత్యంత సాధారణంగా వచ్చే మోటారు వ్యాధి. సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించినది. పక్షవాతం అంటే కండరాలను ఉపయోగించడంలో ఇబ్బంది లేదా బలహీనత. మస్తిష్క పక్షవాతం మెదడు అసాధారణంగా అభివృద్ధి చెందడం వల్ల లేదా మెదడు అభివృద్ధిలో అవరోధం కారణంగా సంభవిస్తుంది. దీని కారణంగా పిల్లలు తమ కండరాలను నియంత్రించుకోలేరు.
సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు..
సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు పిల్లలలో భిన్నంగా ఉంటాయి. తీవ్రమైన మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలకు నడవడానికి ప్రత్యేక పరికరాల సహాయం అవసరం కావచ్చు లేదా అస్సలు నడవలేకపోవచ్చు. జీవితకాల సంరక్షణ అవసరం కావచ్చు. మరోవైపు తేలికపాటి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పిల్లలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తారు. వారికి ప్రత్యేక సహాయం అవసరం అవుతుంది. మస్తిష్క పక్షవాతం లక్షణాలు కాలక్రమేణా అధ్వాన్నంగా మారకపోయినప్పటికీ పిల్లల జీవితంలో లక్షణాలలో మార్పులు జరగవచ్చు.
మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న వారందరికీ నడకలోనూ, వారు కూర్చునే నిలుచునే భంగిమలోనూ సమస్యలు ఉంటాయి. చాలా మంది పిల్లలు బుద్దిమాంద్యంతో కూడా బాధపడవచ్చు. మూర్ఛలు, దృష్టి, మాట్లాడటం, వినికిడి సమస్యలు వంటివి ఉంటాయి. వెన్నెముకలో మార్పులు (పార్శ్వగూని వంటివి) మరిన్ని శారీరక సమస్యలు ఉంటాయి.
సెరెబ్రల్ పాల్సీ రకాలు..
కండరాల దృఢత్వం (స్పాస్టిసిటీ)
అనియంత్రిత కదలికలు (డిస్కినియా)
సంతులనం, సమన్వయం కోల్పోవడం (అటాక్సియా)
పై లక్షణాలు అన్నీ కలిపి అయినా ఉండొచ్చు.
సెరిబ్రల్ పాల్సీ ప్రారంభ లక్షణాలు..
పిల్లలు విశ్రాంతి స్థితి నుండి పైకి లేచినప్పుడల్లా, తల కదలికలు ఆలస్యం అవుతాయి. శరీరం బిగుసుకుపోతుంది. పిల్లలు కుంటుతూ నడుస్తారు. ఇలాంటి పిల్లవాడిని చేతుల్లో పట్టుకున్నప్పడు, పట్టుకున్నవారిని నెట్టినట్లుగా తన వెనుక భాగాన్ని, మెడను సాగదీస్తారు. కాళ్ళు ఎత్తినప్పుడు గట్టిపడతాయి, తరచుగా కాళ్ళు కత్తెర ఆకారంలో తిరుగుతాయి. ఇలాంటి పిల్లలకు నడవడం చాలా కష్టం. ఇక చేతులు కూడా కలిపి ఉంచుకోలేరు.
చేతులతో నోట్లో ఏదీ పెట్టుకోలేరు. ఒక చేతిని చాచి, మరొకటి గట్టిగా ఉంచుతారు. ఒకే దిశలో తిరగడం వారికి సవాలుగా ఉంటుంది.
మస్తిష్క పక్షవాతం చికిత్స..
సెరిబ్రల్ పాల్సీకి ఎటువంటి నివారణ లేదు కానీ తగిన జాగ్రత్తలతో రోగుల జీవితాలను మెరుగుపరచవచ్చు. సమస్య ఉన్నట్టు తేలిన తరువాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించడం ముఖ్యం. మస్తిష్క పక్షవాతం నిర్ధారణ అయిన తర్వాత, వైద్యుల బృందం పిల్లలతో మరియు వారి కుటుంబంతో కలిసి పని చేస్తుంది. పిల్లవాడు తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికను రూపొందిస్తారు. సాధారణంగా మందులు, శస్త్రచికిత్స, శారీరక, వృత్తి, ప్రసంగ చికిత్స మొదలైనవి చికిత్సలో ఉపయోగిస్తారు.
సెరిబ్రల్ పాల్సీకి కారణాలు
తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ పుట్టడం. ప్రసవ సమయానికి ముందే బిడ్డ పుట్టడం. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు, కామెర్లు, కెర్నిక్టెరస్
జన్యు లోపం. మొదలైనవి కారణాలు.
*నిశ్శబ్ద.