Home » Health Science » Treating constipation during pregnancy
గర్భవతులకు మలబద్దకం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి!
గర్భం ధరించిన స్త్రీల శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. డెలివరీకి ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డెలివరీ తర్వాత అంతా నార్మల్‌గా అయిపోతుందని అనుకుంటారు కానీ చాలావరకు అది జరగదు. చాలా మంది మహిళలకు బిడ్డ ప్రసవం తర్వాత కూడా పైల్స్ సమస్యలు అలాగే ఉంటాయి. . ప్రెగ్నెన్సీకి ముందు పైల్స్ సమస్య లేకపోయినా, ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే, మహిళలు గర్భధారణ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుని, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.
అసలు పైల్స్ అంటే ఏంటి?
మానవ శరీరంలో పురీషనాళం చుట్టూ సిరలు ఉంటాయి. ఈ సిరలు ఉబ్బుతాయి. అసాధారణమైన వాపు ఏర్పడుతుంది. ఈ సమస్య కారణంగా, ప్రేగు కదలిక సమయంలో దురద, నొప్పి ఉంటుంది. ఇవి బయటికి పొడుచుకు వచ్చిన చిన్న గింజలా ఉంటాయి.
గర్భవతుల్లో ఎందుకొస్తుంది?
నిజానికి, గర్భధారణ సమయంలో గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, సిరలు సులభంగా ఉబ్బుతాయి. అంతే కాకుండా ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల గర్భిణీ స్త్రీలో మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం సమయంలో, మలం చాలా గట్టిగా మారుతుంది. ఈ కారణంగా పైల్స్ పరిస్థితి తీవ్రంగా మారుతుంది. సరళంగా చెప్పాలంటే, గర్భిణీ స్త్రీలు మలబద్ధకం కారణంగా పైల్స్‌కు గురవుతారు. డెలివరీ సమయంలో అధిక ఒత్తిడి కారణంగా హేమోరాయిడ్లు సంభవించవచ్చు.
పైల్స్ సమస్యను ముందే గుర్తుపట్టడం ఎలా?
పైల్స్ వ్యాధిలో, మలద్వారంలో నొప్పి, మంట, దురద ఉంటుంది.
ప్రేగు కదలిక సమయంలో నొప్పి పెరుగుతుంది.
కూర్చున్నప్పుడు కూడా పైల్స్ కారణంగా నొప్పి ఉంటుంది.
పైల్స్ కారణంగా, మల విసర్జన తర్వాత కూడా ఇబ్బందిగానే ఉంటుంది.
పురీషనాళం సమీపంలోని కణజాలంలో వాపు, పుండ్లు, రక్తస్రావం కనబడతాయి.
పైల్స్ తగ్గడానికి, రాకుండా ఉండటానికి గర్భవతులు ఏమి చేయాలంటే..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి..
గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడే మహిళలు తమ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. దీని కోసం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇది పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మలవిసర్జన ఆపకూడదు..
గర్భవతులు బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపించినప్పుడు, వెంటనే టాయిలెట్‌కు వెళ్లిపోవాలి. కారణాలు చెప్పుకుని మెలాన్ని బిగపట్టుకుని కాలం వెళ్లబుచ్చకూడదు. ఇలా చేస్తే కడుపు అస్తవ్యస్తం అవుతుంది. పేగులు ఎప్పటికపుడు శుద్ధి అవుతుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి
గర్భిణీ స్త్రీలు తమను తాము హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని కోసం నీరు బాగా త్రాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి ద్రవాలను తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల పైల్స్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.
◆నిశ్శబ్ద.