Home » Ladies Special » Tips to femiliarize your crush
ప్రతి అమ్మాయికి కూడా అందరూ అబ్బాయిల యొక్క దృష్టిని తమ వైపు చూసేలా చేసుకోవడం చాలా సులభం. కానీ తనకు ఇష్టమైన అబ్బాయితో మొదటిసారిగా మాట్లాడటం ఎలాగో తెలియక కంగారు పడుతుంటారు. మీకు నచ్చిన అబ్బాయిని ఆకర్షించేలా చేయడంతో పాటు, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మొదలు పెట్టాలో కొన్ని చిన్ని ప్రయత్నాలు చూద్దామా...!
మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు ఆత్మ విశ్వాసంతో వెళ్ళి ‘హాయ్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?'' అని ఇలా పలకరించండి. అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానం వచ్చినా సరే.. మీ మధ్య ఖచ్చితంగా సంభాషణ మొదలవుతుంది. దీనివల్ల మీకు ఇష్టమైన వ్యక్తితో మాట కలుపుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం.
ప్రపంచంలో తల్లిదండ్రులకైనా సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ.. అమ్మాయిలు అడిగిన వెంటనే అబ్బాయిలు ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. మీకు నచ్చిన వ్యక్తి దగ్గరగా ఉంటే అతడిని ఏదైనా సహాయం అడగండి. మీరు అతన్ని అలా అడగడం వల్ల అతను లక్కీగా ఫీల్ అవుతాడు.
ఇంకా మీరేదైనా అడ్రెస్ కనుక్కోవాలనుకొన్నప్పుడు, మీ చేతిలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నప్పుడు, లేదా అతను కూర్చున్న పక్కనే ప్లేస్ ఉంటే.."కుర్చోవచ్చా" అంటూ ఏదో ఒక విధంగా వారి సహాయం అడగండి. అమ్మాయిలకు హెల్ప్ చేయడం అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. సరదా. ఎప్పుడైతే అతను మీకు హెల్ప్ చేస్తారో అప్పుడు ఇక చిరునవ్వుతో థాక్స్ చెప్పండి అక్కడి నుండే మొదలవుతుంది మీ మధ్య అసలైన ముచ్చట్లు.
మీకిష్టమైన వ్యక్తితో దగ్గరగా మాట్లాడాలి అనుకుంటే... అతనికి దగ్గరగా వెళ్ళుతున్నప్పడు తెలియకుండానో లేదా పోరపాటుగానో మీ దగ్గర ఉన్న పెన్, బుక్స్, కూరగాయలు, ఖర్చిఫ్ వంటి ఏదైనా ఒక వస్తువును వదిలేయండి. దాంతో వాటిని మీకు ఖచ్చితంగా తీసి ఇస్తాడు. కానీ మీరు పడేసుకున్న వస్తువు అతనికి కనిపించేలా మాత్రమే పడేయండి. లేకపోతే అతని స్థానంలోకి మరో హీరో దిగిపోతాడు.
అతను చేసిన సహాయానికి చిరునవ్వు నవ్వి, కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అప్పుడు అతను కూడా బదులిస్తాడు. దీనివల్ల మీరు ఇపుడు మాట్లాడకపోయినా మరోసారి కలిసినపుడైనా.. ఈ విషయం గుర్తు చేసి అతనితో మాట్లాడవచ్చు.
ఈ సలహాలతో ఖచ్చితంగా అబ్బాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం. మీ గ్రీకువీరుడు కోసం మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి.