Home » Health Science » thyroid symptoms in women
ఇలా చేయడం వల్ల థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు
ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువ అయ్యింది. . థైరాయిడ్ గ్రంధిలో అసమతుల్యత కారణంగా, హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సూపర్‌ఫుడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరగుపరచడంలో సహాయపడతాయి. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంధిలో అసమతుల్యత కారణంగా, హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. బరువు పెరిగిపోతారు. థైరాయిడ్ ఈ సమస్యకు చెక్ పెట్టి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు ఎంతగానో సహాయపడతాయి.
* ఉసిరి:
ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి, దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మీ థైరాయిడ్ గ్రంధి అతిగా క్రియాశీలంగా పనిచేస్తుంటే.. ఉసిరి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేం కాబట్టి, దీనిని ఉడకబెట్టి, పచ్చడి చేసుకుని తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జింక్.. శరీరం ఇతర విటమిన్లు, మినరల్స్ గ్రహించడంలో సహాయపడుతుంది. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి , నియంత్రణకు సహాయపడుతుంది.
* ఇవే కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేయడం వల్ల కూడా థైరాయిడ్ కంట్రోల్ చేయవచ్చు .. అలాగే మనం తీసుకునే ఆహారం కూడ లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ మానేసి పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే థైరాయిడ్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.