Home » Health Science  » మీకు ఇది తెలుసా.. PCOS సమస్యను PMOS అని మార్చారు.. కారణం ఇదే!

మీకు ఇది తెలుసా.. PCOS సమస్యను PMOS అని మార్చారు.. కారణం ఇదే!

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది మహిళల్లో ఒక సాధారణ సమస్య, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఇటీవల ఈ సమస్యకు సంబంధించి ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం PCOSను ఇకపై పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS) అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల ఏకాభిప్రాయంతో ఈ దీనికి  ఈ పేరు పెట్టారు. ఈ సమస్య  ఉన్న చాలా మంది మహిళలకు వాస్తవానికి అండాశయ తిత్తులు ఉండవు కాబట్టి, "PCOS" అనే పదం వైద్యపరంగా తప్పుదోవ పట్టిస్తుందని నిపుణులు భావించారు. PCOSకు ఈ కొత్త పేరు పెట్టడానికి గల కారణాలను , అది తీసుకురాబోయే మార్పులను తెలుసుకుంటే..

పేరు మార్పు వెనుక అసలు కారణం..

జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం మరియు గుండె సంబంధిత సమస్యలపై ఈ సిండ్రోమ్ చూపే ప్రభావాలు చాలా  విస్తృతంగా ఉంటాయి.  అయితే ఈ సమస్యను  దాని పాత పేరు పూర్తిగా ప్రతిబింబించడం లేదని పరిశోధకులు గుర్తించడం వల్ల, PCOS పేరును మార్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో, లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తున్నందున,  ఊబకాయం, మధుమేహం, వంధ్యత్వం, మానసిక ఆరోగ్య సమస్యలతో దీనికి సంబంధం ఉన్నట్లు ఎక్కువగా తేలుతున్నందున, ఈ పేరు మార్పు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

PCOS ను   PMOS గా ఎందుకు మార్చారంటే..

ఈ సిండ్రోమ్ లో ఒకటి కంటే ఎక్కుగా ఉండే చాలా రకాల సమస్యలను ప్రతిబింబించేలా దీనికి పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే కొత్త పేరు పెట్టారు.  పాత పేరు ఎక్కువగా అండాశయ తిత్తులపై దృష్టి సారించింది, అయితే ఈ వ్యాధి బారిన పడిన చాలా మంది మహిళల్లో తిత్తులు ఏర్పడవు. దానికి బదులుగా, ఈ సిండ్రోమ్ అంతర్గత వ్యవస్థలు, జీవక్రియ , అండాశయ పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే పేర్లు మార్చారు.

కొత్తపేరుకు అర్థం..

పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ వ్యవస్థలు ప్రభావితమవుతాయి.

మెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం , మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది .

ఓవరియన్ : ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుక్రమం , సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

సిండ్రోమ్: ఇది సంబంధిత లక్షణాలు , ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుంది.

 పేరు మార్పు ఇందుకే..

పేరు మార్పు యొక్క లక్ష్యాలు రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపోహలను తగ్గించడం , మరింత కచ్చితమైన చికిత్సను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ చెబుతోంది. స్కాన్‌లో అండాశయ తిత్తులు కనిపించే వరకు తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని  నిపుణులు చెబుతున్నారు.

                                         *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.