Home » Health Science » Solutions for better sleep during menopause
మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.!
.webp)
ఆడవారి జీవితంలో ప్రతి దశలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 10 నుండి 15 ఏళ్ల మద్య మొదలయ్యే ఋతుచక్రం 40ఏళ్లు వచ్చేవరకు ఉంటుంది. ఆ తరువాత ఋతుచక్రం ఆగిపోతుంది. అన్నేళ్లు శరీరంలో క్రమానుసారంగా సాగిన ఈ ప్రక్రియ ముగిసిపోవడం కారణంగా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ప్రధానంగా ఉంటుంది. సరిగా నిద్రలేకపోవడం, కలత నిద్ర, తలనొప్పి, శరీరంలో అసౌకర్యంగా అనిపించడం, హార్మోన్ సమస్యల కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీన్ని పరిష్కరించడానికి ఈ కింది చిట్కాలు సహాయపడతాయి.
మెగ్నీషియం..
శరీరంలో స్కిరాడియన్ సైకిల్ లేదా సహజ గడియారం నియంత్రణ కోల్పోయినప్పుడు కండరాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషీయం తీసుకోవడం ద్వారా కండరాలు సడలించబడతాయి, నిద్ర గడియారం కంట్రోల్ లోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. అల్లం, జీడిపప్పు, బాదం, నువ్వులలో మెగ్నీషియం బాగుంటుంది.
విటమిన్-ఇ
మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు పుడుతుంటాయి. రాత్రి సమయంలో చెమటలు కూడా పడతాయి. విటమిన్-ఇ శరీరానికి లభించేలా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, కొబ్బరి, అవిసె గింజలు, పిస్తాపప్పులలో విటమిన్-ఎ సులభంగా దొరుకుతుంది.
ఒమెగా-3
ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మానసిక కల్లోలాన్ని, నిద్రలేమి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. చేపలు, సజ్జలు, బార్లీ, మొక్కజొన్న, రాగులు మొదలైన వాటిలో ఒమెగా-3 లభ్యమవుతుంది.
సోయా ఉత్పత్తులలో ఐసోప్లేవోన్ లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను అనుసరిస్తాయి. శరీరంలో వేడి ఆవిర్లు తగ్గించడం, ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కనిపించే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల సోయా ఉత్పత్తులు వాడితే నిద్ర నాణ్యత బాగుంటుంది.
*నిశ్శబ్ద.

