Home » Fashion » kajal and its benefits for eyes
కాటుక పెట్టుకునే మగువలందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్ ఇవే..
మహిళలు ఎంత అందంగా ముస్తాబైనా కళ్ళకు కాటుక లేకపోతే బాగుండదు. ఆ ముఖం చూడు ఏడ్చినట్టుంది, కాటుక పెట్టుకో అని పెద్దవాళ్లు అరుస్తుంటారు. అయితే కాటుక కూడా రూపాంతరం చెందుతూ పేస్ట్ నుండి ఇప్పుడు పెన్సిల్ వరకు వచ్చిచేరింది. అయితే ఇప్పట్లో మేకప్ చేసుకునేటప్పుడు ప్రతి విషయానికి ప్రాధాన్యత ఉన్నట్టు కాటుకకు కూడా చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. కాటుక పెట్టుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మేకప్ మొత్తం ఖరాబ్ అవుతుంది. కాజల్ పెట్టుకునేటప్పుడు ఈ చిట్కాలు తప్పక పాటించాలి. అలా చేస్తే మేకప్ అవుట్ లుక్ అధిరిపోతుంది.
పెన్సిల్ తో కాటుకను అప్లై చేసేటప్పుడు కంటి రేఖ మీద పదేపదే రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల కాటుక ముద్దగా కంటి రేఖ మీద అతుక్కుపోయి అది కాస్తా కంటి కింద నలుపును ఏర్పరుస్తుంది. దీని కారణంగా మేకప్ చాలా సులువుగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
కాటుకను కళ్ల కింది వాటర్ లైన్ పైన మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కళ్ళు ఆకర్షణగా కనిపిస్తాయి.
కాటుక పెట్టుకునేటప్పుడు కొందరు ఎక్కువ మొత్తం కంటి రేఖమీద మెత్తేస్తుంటారు. ఇది కళ్ళ ఆకారం మొత్తాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ఓ మోస్తరు లైన్ గా కాటుక అప్లై చేయాలి.
కాటుక పెట్టుకునేటప్పుడు దానికి వాడే పెన్సిల్ విషయంలో జాగ్రత్త పడాలి. కాజల్ పెన్సిల్ షార్ఫ్ గా లేకపోతే కాటుక అప్లై చేయడంలో ఇబ్బంది తలెత్తుతుంది. కాటుక కంటి రేఖ మీద కాకుండా కింది చర్మం భాగంలో సులువుగా అతుక్కుంటుంది.
కాజల్ సెలక్షన్ విషయంలో ఎప్పుడూ తప్పు చేయద్దు. కళ్లకు ఎంపిక చేసుకునే కాటుక వాటర్ ప్రూఫ్ అయితే మేకప్ పాడైపోకుండా ఉంటుంది. కాబట్టి వాటర్ ప్రూప్ ఎంపిక చేసుకోండి.
పైన చెప్పుకున్న సింపుల్ చిట్కాలు ఫాలో అయితే కళ్ళు అందంగా, ఆకర్షణగా ఉంటాయి. కంటి అందం మిగిలిన ముఖ మేకప్ ను కూడా అద్భుతంగా ఎలివేట్ చేస్తుంది.
*నిశ్శబ్ద.