Home » Fashion » వేసవిలో వేడిగా అనిపించకుండా ఉంచే సూపర్ శారీస్!
వేసవిలో వేడిగా అనిపించకుండా ఉంచే సూపర్ శారీస్!

కాలం మారినప్పుడు దుస్తుల ఎంపిక కూడా మార్చాల్సి వస్తుంది. చలికాలంలో వెచ్చగా ఉండటం కోసం ఎలాగైతే దుస్తులు ఎంచుకుంటారో.. అలాగే వేసవి కాలంలో వేడి బాధించకుండా, చెమట వల్ల ఇబ్బంది పడకుండా ఉండేలా మంచి వస్త్రధారణ ఉండాలని అనుకుంటారు. అయితే..అనుకోవడమే కానీ చాలామందికి సెలక్షన్ తెలియదు. అయితే మరేం ఫర్వాలేదు.. ఫ్యాషన్ గురించి సరిగా తెలియని వారికి, ఏ సీజన్ లో ఎలాంటి వాతావరణంలో ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియని వారికి.. ఏకంగా ఫ్యాషన్ నిపుణులే సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వేసవిలో చెమట వల్ల ఇబ్బంది లేకుండా, వేడిగా అనిపించకుండా ఉండాలంటే ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలో.. ఫ్యాషన్ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
లైట్ వెయిట్..
వేసవిలో కాటన్, లినెన్, ఖాదీ వంటి చీరలు మంచి ఎంపికలు అవుతాయి. ఇవి గాలిని లోపలికి వెళ్ళనిస్తాయి, చెమట త్వరగా ఆరిపోతుంది , ఈ ఫ్యాబ్రిక్ చీరల్లో చాలా సేపటి వరకు సౌకర్యంగా ఉంటారు. ఇది కాకుండా, ఈ వస్త్రాలు తేలికగా ఉంటాయి, దీనివల్ల చీరను రోజంతా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు.
లైట్, పాస్టెల్ రంగులు..
వేసవిలో తెలుపు, లేత రంగులు, లేత పసుపు, పుదీనా ఆకుపచ్చ వంటి రంగులు ధరించడం మంచిది. ఈ రంగులు సూర్యుని వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తాయి. ముదురుగా, ప్రకాశవంతమైన రంగులు వేసవిలో వేడిని పెంచుతాయి. అందుకే వీటిని దూరం పెట్టాలి.
కొంగు కహానీ..
కొంగు మరీ ఎక్కువగా వేలాడకుండా చూసుకోవాలి.
బెంగాలీ డ్రేప్, మరాఠీ డ్రేప్ లేదా స్ట్రెయిట్ స్టైల్ వంటి సులభమైన , హ్యాండిల్ చేయగల స్టైల్స్ లో చీరలు ధరించడం చాలా బాగుంటుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కొత్త లుక్ ఇస్తుంది.
యాక్సెసరీలు..
వేసవిలో బరువైన ఆభరణాలు ధరించడం మానుకోవాలి.
తేలికపాటి ఆభరణాలు, చిన్న స్టడ్స్ లేదా మినిమలిస్ట్ నెక్లెస్ ధరించాలి. ఈ సింపుల్ లుక్ చాలా స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది , వేడిలో అసౌకర్యంగా అనిపించదు.
బ్లౌజ్ ఎంపిక..
గాలి ఆడే, తేలికైన బ్లౌజును ఎంచుకోవాలి. కాటన్ లేదా లినెన్ బ్లౌజులు వేసవిలో సౌకర్యవంతంగా ఉండి, చెమట పట్టకుండా నివారిస్తాయి.
చెప్పులు..
హైహీల్స్ ధరించడం మానుకోవాలి. నడకను సులభతరం చేస్తూ, చెమటను తగ్గించే ఫ్లాట్ చెప్పులు, స్లిప్-ఆన్‌లు లేదా బూట్లు ధరించాలి.
పైన చెప్పుకున్నవి ధరిస్తే.. వేసవిలో శారీస్ కట్టుకుని సింపుల్ గా ఉంటూనే ఫ్యాషన్ గా కనిపిస్తూ తళుక్కున మెరిసిపోవచ్చు.
*రూపశ్రీ.
