Home » Baby Care » 2000 million children suffering with pollution aasthamaa

ప్రపంచ వ్యాప్తంగా 2 మిలియన్ల పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు....

ప్రపంచ వ్యాప్తంగా 2 మిలియన్ల పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోదనలో 1.8 మిలియన్ల బాలల మరణాలు కేవలం వాయు కాలుష్యం వల్లే అని మీకు తెలుసా? వాయు కాలుష్యం ఆస్తమాకు కారణాలు ......

ప్రపంచం అభివృద్ధి సాదిస్తోంది. యాంత్రికరణ తో పరిశ్రమలు స్థా పించారు. ఉత్పాదకత పెరిగింది పంపిణీ పెరిగింది రవాణా వచ్చింది. పచ్చటి అరణ్యాలు నాశనం చేస్తూ కాలుష్యం పెంచుకుంటూ చుట్టూ కాలుష్య కసారాల మధ్య జీవితాన్ని గడిపేస్తూ చిన్నారుల భవితవ్యాన్నిఆరోగ్యాన్ని చిదిమేస్తున్నాం . తత్ఫలితంగా నేడు ప్రపంచ  వ్యాప్తంగా పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారన్న విషయాన్ని ఇప్పటికీ గ్రహించడం లేదు.దీనిఫలితంగా 2 మిలియన్ల కొత్త పిరియాడిక్ ఆస్తమా కేసులు చోటు చేసుకోవడం ముఖ్యంగా ప్రపంచ వ్యాప్త్గంగా పెద్ద పెద్ద నగరాలలో జరుగుతున్నట్లు ఒక పరిశోదన వెల్లడించింది. ఒక పరిశోదనలో పిరియాడిక్ అస్తమా కేసులు భారంగా మారాయి. దాదాపు 13, ౦౦౦ పట్టణాలలో  లోస్ ఏంజిలిస్, ముంబాయి వంటి నగరాలు ముందువరుసలో ఉండడం నిపుణులు పేర్కొన్నారు.

పిల్లలలో ఆస్తమాకు కారణాలు....

నిపుణులు చేస్తున్న పరిశోదనలో నైట్రోజన్ డయాక్సైడ్ పిల్లలో అత్యంత ప్రమాదకరం గా ఉండడమే ఆస్తమాజు ప్రాధాన కారణం అవుతుందని నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు. అక్యుపెష నల్ హెల్త్ జార్జియా వాషింగ్ టన్  విశ్వ విద్యకయానికి చెందిన ప్రకృతి పర్యావరణ వేత్తప్రొఫెసర్  సుసాన్ అనాన్ బర్గ్  మాట్లాడుతూ అందరికీ కాలుష్య రహి వాతావరణం కల్పించడం లో మనం విఫల మయ్యా మని అన్నారు. కాలుష్య రహిత వాతావరణం కల్పించడం అత్యంత కష్ట తరంగా మారిందని పిల్లలకు  సంపూర్ణ ఆరోగ్యం అందించడం  లో విఫల మౌతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.

పిల్లలో ఆస్తమాకు దారి తీస్తున్న కారకాలు ఇవే ....

అనెన్ బెర్గ్ బృందం పరిశోదనలో నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్ ఓ2  కాలుష్యం వాహనాల పొగ గొట్టాల నుండే వస్తోందని గుర్తించారు. ముఖ్యం గా విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, 2౦౦౦ -2౦19 వరకు పరిశీలించారు. ఆస్తమ దీర్ఘ కాలిక వ్యాధి ఊపిరితిత్తుల నాళాలలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.అని వైద్యులు గుర్తించారు. పరిశోదన లోని కీలక అంశాల ను ఈ బృందం గమనించింది.

1) ప్రపంచ వ్యాప్తంగా 1.85 మిలియన్ల పిల్లలో పిడియాట్రిక్స్ ఆస్తమా కేసులు ఉండవచ్చని వేసిన అంచనా కేవలం  కార్బన్ డయాక్సైడ్ ద్వారా మాత్రమే అని 2౦19 సంవత్సరం లో పేర్కొన్నారు. అందులో 2/3 వంతు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉండటం గమనార్హం.

2) గ్రామీణ పట్టణ ప్రాంతాలలో చేపడుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీ కరణ, కారణంగానే కార్బన్ డై యాక్సైడ్ కారణంగా నిర్ధారించారు. అ త్యధిక శాతం లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్లే పిల్లలకు కాలుష్యం లేని వాతావరణం అందించడం కష్ట సాధ్య మౌతోందని గుర్తించారు. ఈ రకమైన సమస్య అత్యధిక ఆదాయం ఉన్న దేశాలలో అంటే యుఎస్, వంటి దేశాలలో ప్యాండమిక్  ఆస్తమా విస్తరిస్తోంది. ప్రధానంగా ఆయా అభివృద్ధి చెందిన దేశాలలో గాలి నాణ్యత పెరగక పోగా యూరప్, యుఎస్ దేశాలలో కాలుష్యం ప్రత్యేకంగా ఎన్ ఓ2 కార్బన్ డయాక్సైడ్ దక్షిణ ఆశియ దేశాలలో ఆస్తమా కేసులు పెరగడాన్ని పరిశోధకులు గమనించారు.

ముఖ్యంగా సహారా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లలో పిడియాట్రిక్ ఆస్తమా కేసులు కేవలం వాయు కాలుష్యం వల్ల వేల సంఖ్యలో సామాన్యుల ప్రజా ఆరోగ్యం పెనుభారంగా మారిందని. గతంలో జరిగిన పరిశోదనలో పరిశోధకులు కార్బన్ డయాక్సైడ్ వల్ల 13% ప్రపంచ వ్యాప్తం గా ఆస్తమా వల్ల 5౦% పెరిగిందని ప్రపంచ వ్యాప్తంగా 25౦ నగరాలలో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూస్తే పిరియాడిక్ ఆస్తమా కేసులు కార్బన్ డయాక్సైడ్ 2౦% తగ్గిందని 2౦౦౦ సంవత్సరం లో 16% 2౦19 లో కొంత వాతావరణం లో కాలుష్యం తగ్గడం  వల్ల యు ఎస్ లో పిల్లలు కొంత ఆరోగ్యం మెరుగు పడినట్లు నిపుణులు గుర్తించారు. ప్రత్యేకంగా ఎవరైతే ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయో వారి మధ్య  రోడ్డు రవాణా పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయో అయాప్రాంతాలలో వాయు కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు. కాగా అధిక ఆదాయం ఉన్న దేశాలలో మరిన్ని పరి శోదనలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రపంచం లోని కొన్ని భాగాలలో ప్రాణాలు హరించే రాసాయనాలు లేకుండా చేయడం, వాహానాలు వెదజల్లే విష వాయువులుపూర్తిగా నిషేదిన్చాల్సిన అవసరం ఉంది. వాహనాలు వేద జల్లే కార్బన్ డై ఆక్సైడ్ పిల్లల కు హానికారకం గా ఉందని దీనిప్రభావం తోనే పిల్లలు ఆస్తమా బారిన పడు తున్నారని నిపుణుల బృందం అభిప్రాయ పడింది. మరొక పరిశోదనలో వేరినోక్ సదర్ ల్యాండ్ అమెన్ బర్గ్ వారి బృందం 1. 8 మిలియన్ల కంటే ఎక్కువగానే  అనారోగ్యం పాలయ్యారని  కార్బన్ డయాక్సైడ్  అధిక మోతాదులో ఉండడం    ఆందోళణ కలిగిస్తోందని  నిపుణులు వెల్లడించారు. 2౦19 లో నే ఇది జరగడం బాధాకరం అని అన్నారు. ఆధునిక పరిశీలనలో 86% పెద్దలు, పిల్లలు పట్టణ ప్రాంతాలాలో నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యు హెచ్ ఓ సూచన లను మార్గదర్సకాలను అనుసరించక పోవడం విస్మరించడం వల్లే  తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కార్బన్ డయాక్సైడ్ లేకుండా ఆరోగ్యం గా ఉండాలంటే ......

ఆస్తమా కు కారణ మౌతున్న వాహనాల ఇంధనం వల్ల కాలుష్యం వె ద  జల్లు తున్న కారణంగా దీని బారి నుండి బయట పడాలంటే సిలాజాల ఇంధనం నడిచే వాహనాల ను రవాణా కు వాడడం ద్వారా కాలుష్యం తగ్గు ముఖం పట్టించ వచ్చు పిల్లలలో శ్వాస కోశ సంబంధిత సమస్యలు తగ్గి పిల్లలు,పెద్దలు గాలి పీల్చు కునే వీలు ఉంటుంది. అదే వారికి మనం ఇవ్వ గలిగే పెద్దడివిడెంట్ శ్వాస కొస సంబందిత  ఆస్తమా కేసులు తగ్గి మరణాలు తగ్గించడమే అని అనెన్ బెర్గ్ అన్నారు. ఇదే సమయం లో గ్రీన్ హౌస్ గ్యాస్ ను తగ్గించాలి అప్పుడే ఆరోగ్యంగా ఉండగలిగే వాతావరణం సాధ్యం. ఎం ఓ2 కార్బన్ డయాక్సైడ్ సాంద్రత స్థితి వల్ల వ్యాధి మరింత భారంగా మారింది.

దాదాపు 13, ౦౦౦ పట్టనాలాలో ప్రపంచ వ్యాప్తంగా పల్స్ నిర్వహించారు.  పిల్లల,పెద్దలా ఆస్తమాకు కారణ మౌతున్న కార్బన్ డయాక్సైడ్ ను నిషేదించడం,లేదా వినియోగించకపోవడం, కాలుష్యానికి కరనమౌతున్న ఉద్గారాల ను పర్స్రమలను పూర్తిగా నిషేదించడం కీలకం ఈదిశాగా ప్రపంచ దేశాలు తమ పారిశ్రామిక విధనానీ భవిష్యత్తు ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. అని నిపుణులు సూచిస్తున్నారు.                                                                           


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.