Home » Fashion » అమ్మాయిలు రోజూ క్లాస్ గా, అందంగా కనిపించాలంటే.. రోజూ ఇవి ఫాలో అవ్వండి..!
అమ్మాయిలు రోజూ క్లాస్ గా, అందంగా కనిపించాలంటే.. రోజూ ఇవి ఫాలో అవ్వండి..!
.webp)
ప్రతి అమ్మాయి అందంగా, క్లాస్ గా కనిపించాలని కోరుకుంటుంది. అది కేవలం పండుగలు, ఏవైనా ఫంక్షన్ లలో మాత్రమే కాదు.. ప్రతి రోజూ క్లాస్ గా, ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంది. అయితే క్లాస్ గా అందంగా కనిపించాలంటే.. ఖరీదైన బట్టలు లేదా పెద్ద బ్రాండ్లు ఉండాలని అనుకుంటారు. కానీ వాటి వెంట పడాల్సిన అవసరం అస్సలు లేదు. మన దగ్గర ఉన్న సాధారణ దుస్తులనే సరైన పద్ధతిలో వేసుకుంటే చాలు, చూడటానికి చాలా హుందాగా, అందంగా కనిపిస్తారు. చిన్నచిన్న అలవాట్లు మార్చుకుంటే రోజువారీ లుక్ లోనే పెద్ద మార్పు కనిపిస్తుంది. ఆ అలవాట్లు ఏంటో వివరంగా తెలుసుకుంటే..
డ్రస్ ఫిట్టింగ్..
ముందుగా బట్టల ఫిట్టింగ్ పై దృష్టి పెట్టాలి. మరీ బిగుతుగా ఉండేవి కాకుండా, మరీ వదులుగా ఉండేవి కాకుండా మన శరీరానికి సరిపోయే దుస్తులు ఎంచుకోవాలి. అప్పుడే మనం సౌకర్యంగా ఉండటంతో పాటు లుక్ కూడా నీట్ గా ఉంటుంది.
కలర్స్..
రంగుల ఎంపిక కూడా చాలా ముఖ్యం. నలుపు, తెలుపు, క్రీమ్, గ్రే, నేవీ బ్లూ లాంటి రంగులు ఎప్పుడూ క్లాస్ గా ఉంటాయి. వీటిని సులభంగా కలిపి వేసుకోవచ్చు. కావాలంటే ఒక్క రంగు మాత్రమే కాస్త బ్రైట్ గా ఉండేలా చూసుకోవచ్చు.
ఐరన్ దుస్తులు..
బట్టలు ఎంత ఖరీదైనవైనా ముడతలు ఉంటే లుక్ పాడవుతుంది. అందుకే బయటకు వెళ్లే ముందు దుస్తులను తప్పకుండా ఐరన్ చేసుకోవాలి. అలాగే నగలు, యాక్సెసరీస్ మరీ ఎక్కువగా వేసుకోకుండా సింపుల్ గా ఉండే చిన్న ఇయర్ రింగ్స్ లేదా ఒక మంచి వాచ్ పెట్టుకుంటే సరిపోతుంది.
హెయిర్ స్టైల్..
జుట్టు శుభ్రంగా, చిక్కులు లేకుండా దువ్వుకుని చక్కగా సర్దుకుంటే చాలు, రోజూ కొత్త హెయిర్ స్టైల్ వేయాల్సిన పనిలేదు. చెప్పులు లేదా షూస్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా బట్టలకు సరిపోయే సింపుల్ ఫుట్ వేర్ వాడితే మంచిది.
మేకప్..
రోజూ మేకప్ మరీ హెవీగా కాకుండా తేలికగా, సహజంగా ఉండేలా చూసుకోవాలి. కొంచెం కాటుక, లిప్ టింట్ లేదా లైట్ బేస్ వాడితే ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది. ప్రతి ట్రెండ్ ఫాలో అవ్వకుండా మీకు ఏ బట్టలు, ఏ రంగులు వేసుకుంటే సౌకర్యంగా, కాన్పిడెంట్ గా అనిపిస్తాయో వాటినే మీ స్టైల్ గా మార్చుకోవాలి.
శుభ్రత..
శుభ్రత, తేలికైన మంచి సువాసన కూడా మన లుక్ ను ఇంకా మెరుగుపరుస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం చాలా అవసరం. నిటారుగా నిలబడటం, నడవటం, ముఖంలో చిన్న నవ్వుతో మాట్లాడటం వల్ల సాధారణ బట్టల్లో కూడా ఎంతో అందంగా కనిపిస్తారు.
*రూపశ్రీ.
