డర్టీ ఫ్లోర్ ను ఎలా క్లీన్ చేయాలి ?
దైనందిన జీవితంలో అనేకసార్లు దుస్తులమీద, గచ్చుమీద రకరకాల మచ్చలు లేదా మరకలు పడుతుంటాయి. ముఖ్యంగా డర్టీ ఫ్లోర్ ను చూస్తే చిరాకేస్తుంది. మరి డర్టీ ఫ్లోర్ ను ఎలా శుభ్రం చేయాలి ? మన ఫ్లోర్ మార్బుల్ లేదా టైల్స్ గనుక అయితే ఆ మరకలు మరింత స్పష్టంగా, అందవికారంగా కనిపిస్తాయి. అందుకే మనది డర్టీ ఫ్లోర్ కాకుండా చూసుకుందాం. ఫ్లోర్ మీద పడిన మచ్చలు, మరకలను తొలగించుకునే మార్గాలు కొన్ని తెలుసుకుందాం.
--> డర్టీ ఫ్లోర్ ను రబ్బర్ ఎరేజర్ సాయంతో శుభ్రపరచవచ్చు.
--> నీళ్ళలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేసి, మరక పడినచోట దాన్ని రాసి కడిగేయడం ద్వారా కూడా పోగొట్టవచ్చు. ఈ మిశ్రమాన్ని మరకలపై రాసి, రెండు నిమిషాల తర్వాత కడిగి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరి. టూత్ పేస్ట్ తో శుభ్రం చేసినా మరకలు పోతాయి.
--> అవి తుప్పు మరకలు గనుక అయితే, వాటిపై బేకింగ్ పౌడర్ జల్లి, కొద్దిసేపు ఉంచి, వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడవాలి. మరక పోయేదాకా అలాగే చేస్తుండాలి.
--> మార్బుల్ ఫ్లోర్ పై మరకలుపడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్ మాదిరి తయారుచేసి, మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి, ఉదయాన్నే తుడిచేయాలి.
--> మామూలు ఫ్లోర్ పై పడే మరకల్ని డిటర్జంట్ నీళ్ళలో ముంచిన బ్రెష్ లేదా స్పాంజ్ లతో తుడిచేయవచ్చు.
--> కొన్ని మరకలను పెట్రోల్లో దూదిని ముంచి తుడవడం ద్వారా పోగొట్టవచ్చు.
--> నూనె మరకలకు మార్కెట్లో ప్రత్యేకంగా లభించే క్లీనర్లు బాగా పనిచేస్తాయి.
--> నేలపై గమ్ పడినట్లయితే ఐస్ క్యూబ్ తో రుద్ది, ఆనక శుభ్రం చేస్తే తేలిగ్గా పోతుంది.. దైనందిన జీవితంలో అనేకసార్లు దుస్తులమీద, గచ్చుమీద రకరకాల మచ్చలు లేదా మరకలు పడుతుంటాయి. ముఖ్యంగా డర్టీ ఫ్లోర్ ను చూస్తే చిరాకేస్తుంది. మరి డర్టీ ఫ్లోర్ ను ఎలా శుభ్రం చేయాలి ? మన ఫ్లోర్ మార్బుల్ లేదా టైల్స్ గనుక అయితే ఆ మరకలు మరింత స్పష్టంగా, అందవికారంగా కనిపిస్తాయి. అందుకే మనది డర్టీ ఫ్లోర్ కాకుండా చూసుకుందాం. ఫ్లోర్ మీద పడిన మచ్చలు, మరకలను తొలగించుకునే మార్గాలు కొన్ని తెలుసుకుందాం.
--> డర్టీ ఫ్లోర్ ను రబ్బర్ ఎరేజర్ సాయంతో శుభ్రపరచవచ్చు.
--> నీళ్ళలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేసి, మరక పడినచోట దాన్ని రాసి కడిగేయడం ద్వారా కూడా పోగొట్టవచ్చు. ఈ మిశ్రమాన్ని మరకలపై రాసి, రెండు నిమిషాల తర్వాత కడిగి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరి. టూత్ పేస్ట్ తో శుభ్రం చేసినా మరకలు పోతాయి.
--> అవి తుప్పు మరకలు గనుక అయితే, వాటిపై బేకింగ్ పౌడర్ జల్లి, కొద్దిసేపు ఉంచి, వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడవాలి. మరక పోయేదాకా అలాగే చేస్తుండాలి.
--> మార్బుల్ ఫ్లోర్ పై మరకలుపడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్ మాదిరి తయారుచేసి, మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి, ఉదయాన్నే తుడిచేయాలి.
--> మామూలు ఫ్లోర్ పై పడే మరకల్ని డిటర్జంట్ నీళ్ళలో ముంచిన బ్రెష్ లేదా స్పాంజ్ లతో తుడిచేయవచ్చు.
--> కొన్ని మరకలను పెట్రోల్లో దూదిని ముంచి తుడవడం ద్వారా పోగొట్టవచ్చు.
--> నూనె మరకలకు మార్కెట్లో ప్రత్యేకంగా లభించే క్లీనర్లు బాగా పనిచేస్తాయి.
--> నేలపై గమ్ పడినట్లయితే ఐస్ క్యూబ్ తో రుద్ది, ఆనక శుభ్రం చేస్తే తేలిగ్గా పోతుంది..
CIRCLES ON WALLS
Blank walls make for cold and unwelcoming spaces. Happily, you can easily and inexpensively add warming layers of color and pattern. And Circles are hot now!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వర్షాకాలం ఇల్లంతా తాజా!
వర్షాకాలం మొదలయ్యింది. ఇది క్రమంగా పెరిగేదే తప్ప ఇప్పట్లో తగ్గేది కాదు. ఇళ్లు కాస్త పాతవి అయినా, ఇంటి నిర్మాణం నాసిరకంగా ఉన్నా ఇంటి గోడలు వర్షం నీటి కారణంగా చెమ్మ ఏర్పడుతుంది. గోడలు నీటిని పీల్చుకుని వాసన వస్తుంటాయి. ఇది అంత సులువుగా తొలగిపోయే వాసన కాదు. ఇంట్లో వాళ్ళు ఏదో సర్దుకుపోతారు. కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు, బంధువులు వస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ సమస్య మీ ఇంట్లోనూ ఉన్నా, ఇంకా పెరిగే వర్షాల కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నా దాన్ని తరిమికొట్టే చిట్కాలు ఉన్నాయి. ఈ కింది టిప్స్ పాటిస్తే ఇంటిలో వాసనను పారద్రోలడం సులభం.
దుర్వాసనను వదిలించుకోవడానికి చాలా ముఖ్యమైన విషయం ఇంటి లోపలి భాగం బాగా పొడిగా ఉండాలి. దీని కోసం, ఇంట్లో ఎక్కువ సమయం ఫ్యాన్‌ని ఆన్‌లో ఉంచండి . అలాగే ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాసనలు రావు. ఇంట్లో వాతావరణం చాలా వరకు తాజాగా కనిపిస్తుంది.
గది నుండి వాసనను తొలగించడానికి చాలా మంది డియోను ఉపయోగిస్తారు, కానీ ఇది వాడకూడదు. ఎందుకంటే ఇందులో రసాయనాలు ఉంటాయి. ఇది మొదట బానే ఉన్నా ఇంట్లో ఉన్న వాసనతో కలిపి కొత్త రకమైన వాసనను ఇది క్రియేట్ చేస్తుంది. ఇంట్లో నుండి ఈ వాసనను తొలగించడానికి వెనిగర్ మంచి ఆప్షన్. దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో వెనిగర్, నీరు కలపాలి. ఇంట్లో ప్రతి మూలలో దీన్ని చల్లుకోవాలి.
నిమ్మ, తులసి యొక్క కూడా ఇంటి నుండి తేమ వాసన తొలగించడంలో చాలా సహాయపడుతుంది. దీనికోసం ముందుగా ఒక పాత్రలో ¾ కప్పు నీటిని మరిగించండి. తర్వాత దానికి నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు తులసి వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు టీ స్టయినర్‌తో ఫిల్టర్ చేసి అందులో 2-3 స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో వేయాలి. తర్వాత కాసేపయ్యాక ఇంటి మొత్తానికి చల్లుతూ ఉండండి.
వర్షపు రోజులలో ఇంటి నుండి వచ్చే తేమ వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో 2 కప్పుల నీటిని పోయాలి, దానికి 1 టీస్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. దీన్ని బాగా షేక్ చేసి ఇంట్లో చల్లాలి. అంతే ఇవన్నీ పాటిస్తుంటే ఇంట్లో వర్షం వల్ల కలిగే తేమ వాసన మాయమవుతుంది. ఇంట్లో తాజాదనం వస్తుంది.
*నిశ్శబ్ద.
అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!
భారతీయ వంటకాల్లో అల్లంకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపుగా అన్ని వంటకాల్లోనూ అల్లంను వినియోగిస్తుంటారు. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మనకు అజీర్ణం, దగ్గు, గొంతునొప్పి, గొంతునొప్పి ఉన్నప్పుడు కొద్దిగా అల్లం తింటే చాలా త్వరగా తగ్గుతుంది. మన అల్లం చాలా శక్తివంతమైనది. అయితే అల్లం పాడవకుండా చాలాకాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి.
తాజా అల్లం కొనండి:
అల్లం కొనుగోలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు తీసుకునే అల్లం గట్టిగా తాజాగా ఉండాలి.చాలా మెత్తగా, చాలా పొరలతో ఉండే అల్లం త్వరగా పాడైపోతుంది. కాబట్టి అల్లం కొనుగోలు చేసే ముందుకు జాగ్రత్తగా పరిశీలించాలి.
అల్లం పొట్టును తొలగించవద్దు:
మీరు అల్లం నిల్వ చేయాలనుకుంటే..దానిపై ఉన్న పొట్టును తీయకూడదు. పొట్టుతో అలాగే ఉంచినట్లయితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇది అల్లానికి రక్షణ కవచం లాంటిది.
రిఫ్రిజిరేటర్లో ఉంచండి:
అల్లం తాజాగా ఉండాలంటే రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో కూడా భ్రదపరుచుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ బ్యాగ్ నుండి అదనపు గాలిని తొలగించండి. ఇది అల్లం తేమ నుండి రక్షిస్తుంది. ఇలా చేయడం వల్ల అల్లంపై ఫంగస్ దరిచేరదు.
ఎండిన అల్లం:
అల్లం నిల్వ చేయడానికి మరొక మార్గం ఏమిటంటే, దానిని పూర్తిగా శుభ్రపరచడం. నీటి శాతం పూర్తిగా పోయే వరకు ఆరబెట్టడం. లేదంటే ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో నీటి శాతం పూర్తిగా లేకుండా చూడాలి. తర్వాత దీన్ని పొడి చేసి, అవసరమైనప్పుడు మసాలాగా ఉపయోగించవచ్చు.
చుట్టి ఫ్రీజర్‌లో ఉంచండి
ముక్కలు చేసిన అల్లాన్ని పార్చ్‌మెంట్ పేపర్‌తో కప్పిన బేకింగ్ షీట్‌పై చుట్టి, గట్టిగా అయ్యేంత వరకు ఫ్రీజర్‌లో ఉంచండి. తర్వాత వాటిని గాలి చొరబడని కంటైనర్ లేదా ఫ్రీజర్ సేఫ్ బ్యాగ్‌లో ఉంచండి.
గర్బధారణ సమయంలో ఎలా కూర్చోవాలి..
గర్భధారణ సమయంలో సరిగ్గా కూర్చోవడం, నిలబడటం చాలా ముఖ్యం. అన్నింటికంటే..గర్భిణీలు ఏ భంగిమల్లో కూర్చోవడం ఉత్తమం? పూర్తి సమాచారం తెలుసుకుందాం.
గర్భం చాలా సున్నితమైనది. ఈ సమయంలో ఎలా కూర్చోవాలి? వంగడం మంచిదేనా? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఈ సమయంలో వెన్ను, మెడ, భుజాలలో నొప్పి కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వారి కూర్చున్న భంగిమపై ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి సరైన భంగిమలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. స్లూచింగ్ మీ బిడ్డను ప్రభావితం చేస్తుంది.
సరిగ్గా కూర్చోవడం ముఖ్యం:
గర్భధారణ సమయంలో స్త్రీ అనుసరించే మంచి భంగిమ ఆమెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తప్పు భంగిమ అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే, ఇది శిశువుకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. గర్భం చివరి దశలలో, హార్మోన్లు కీళ్ళలోని స్నాయువులు, మృదువుగా చేయడం ప్రారంభించినప్పుడు ఈ నొప్పి తీవ్రమవుతుంది.
సరైన భంగిమ ఏమిటి?
గర్భిణీలు వారి వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి, అసౌకర్యాన్ని తగ్గించడానికి గర్భధారణ సమయంలో సరైన భంగిమను అభ్యసిస్తారు. ఉదాహరణకు, కూర్చున్నప్పుడు లేదా వెనుకకు వంగి ఉన్నప్పుడు వీపును నిటారుగా ఉంచండం మంచిది. గర్భిణీలకు నేలపై కూర్చోవడం సరైన భంగిమగా సూచిస్తుంది. ప్రసవానికి ఇది చాలా మంచి భంగిమ అని పెద్దలు అంటుంటారు. మీరు కుర్చీపై కూర్చోవడం అలవాటు చేసుకున్నట్లయితే, మీ వెనుకభాగంలో ఒక మృదువైన దిండు ఉంచుకోవడం మంచిది.
ఎక్కువ సేపు కూర్చోవద్దు:
గర్భిణీలు ఎక్కువసేపు కూర్చుంటే రక్తప్రసరణ దెబ్బతింటుంది. దీనివల్ల కాళ్లు నొప్పులు వస్తాయి. దీన్ని నివారించడానికి సాధారణ ఫుట్ వ్యాయామం చేయండి. ఆఫీసులో చాలా గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. మీకు సమయం దొరికినప్పుడు కొన్ని నిమిషాలు నిలబడి నడవడం గుర్తుంచుకోండి.
అలాంటి భంగిమ ప్రమాదకరం:
బ్యాక్ సపోర్టు లేకుండా బీన్ బ్యాగులపై కూర్చోవద్దు. విచక్షణారహితంగా వంగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కూర్చోవడం మంచిది కానీ రోజంతా అలా కూర్చోని ఉండటం మంచిది కాదు. ఇది పేలవమైన ప్రసరణకు దారితీస్తుంది, చీలమండలలో వాపు, అనారోగ్య సిరలకు కారణం అవుతుంది.
సరైన నిలబడే భంగిమ:
కూర్చునే భంగిమ ఎంత ముఖ్యమో నిలబడే భంగిమ కూడా అంతే ముఖ్యం. మీ పాదాలను ఒకే దిశలో ఉంచండి. రెండు పాదాలపై బరువును సమానంగా ఉంచండి. అలాగే, మీరు ధరించే చెప్పులు లేదా బూట్లు సరిపోతాయా? అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
మహిళలు ఇంటి పని, ఉద్యోగం రెండూ సక్సెస్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగంటే..!
మహిళా శక్తి రోజు రోజుకూ పెరుగుతున్న కాలమిది. మగవారితో పాటు మహిళలు కూడా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో సత్తా చాటుతున్నారు. కానీ మహిళలు ఎంత సక్సెస్ సాధించినా ఇంటి గడప తొక్కితే గృహిణులుగా మారిపోతారు. ఇంటి పనులు, వంట పనులు, భర్త, పిల్లల బాధ్యత అన్ని చూసుకుంటారు. అందుకే మహిళలను మల్టీ టాస్కర్లు అని అంటారు. ఇది పైన చెప్పుకోవడానికి బానే ఉంటుంది కానీ మహిళలు రెండింటిని బాలేన్స్ చెయ్యడానికి చెప్పలేనంత ఒత్తిడికి లోనవుతుంటారు. అటు ఉద్యోగినిగా, ఇటు తల్లిగా, భార్యగా, గృహిణిగా అన్నింటికి న్యాయం చేస్తూ ఒత్తిడి దరిచేరకూడదంటే ఈ కింది చిట్కాలు పాటించాలి.
ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి..
ముందుగా సమయపాలన ముఖ్యం. ముఖ్యమైన పనులు ఏమిటో నిర్ణయించుకోవాలి. అప్పుడు వాటిపై దృష్టి పెట్టాలి. అవసరమైనప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. అంతేకాని మొహమాటానికి దేన్నీ నెత్తిన వేసుకోకూడదు. అది పని అయినా లేదా ఇంటి బాధ్యత అయినా. చాలా కంపెనీలు పెళ్లై పిల్లలున్న మహిళలకు పని సౌలభ్యాన్ని అందిస్తాయి. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపికల ప్రయోజనాన్ని పొందాలి. అది రిమోట్ పని లేదా సౌకర్యవంతమైన పని గంటలు కావచ్చు, ఇంటి బాధ్యతలతో పాటు మహిళలు తమని తాము డవలప్ చేసుకుంటూ తమ ఉద్యోగాన్ని నిర్వర్థించేందుకు ఇంట్లో వ్యక్తుల మధ్య సమన్వయం ఏర్పడేలా చూడాలి.
సాంకేతికతను బాగా ఉపయోగించుకోవాలి..
ఇప్పట్లో సాంకేతికత చాలా అభివృద్ది చెందింది. పనిని సులభతరం చేయడానికి సాంకేతిక సాధనాలను ఉపయోగించుకోవాలి. దీనితో పని, జీవితం మధ్య మంచి బ్యాలెన్సింగ్ సాధించవచ్చు. ఇంటి పనులను కుటుంబ సభ్యులతో కలసి షేర్ చేసుకోవడం వల్ల మహిళలకు కొంత ఊరట లభిస్తుంది.
స్వీయ సంరక్షణ ముఖ్యం..
మహిళలు శక్తివంతంగా ఉండాలి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. వ్యాయామం చేయడం, చదవడం, ఇష్టమైన వారితో సమయం గడపడం వంటివన్నీ మానసిక , శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.
విజయాలను సెలబ్రేట్ చేసుకోండి..
మహిళలు సాధించే విజయాలు చిన్నవా, పెద్దవా అనే విషయం కాదు సక్సెస్‌లు చిన్నదైనా, పెద్దదైనా వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి. పనిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విజయాన్ని గుర్తించాలి. ఎవరో మీ విజయాన్ని గుర్తించి మిమ్మల్ని అభినందించాలనే ఆలోచన వదిలిపెట్టాలి. చిన్న విజయాలే పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి చేయూతనిస్తాయి. ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇది మహిళల మనస్తత్వాన్ని పాజిటివ్ గా ఉంచుతుంది.
మంచి కమ్యూనికేషన్..
సహోద్యోగులతో, కుటుంబ సభ్యులతో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. మహిళలు తమ ప్రాధాన్యతలు, బాధ్యతలను వారికి తెలపాలి. ఉద్యోగం, ఇంటి జీవితం విషయంలో వారి సహాకారం, పని ముగించడానికి కావలసిన సమయం విషయంలో స్పష్టత ఇవ్వాలి. వృత్తిపరమైన బాధ్యతల గురించి కుటుంబ సభ్యులకు కూడా అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలిగే ఏ సందర్బాన్ని వీలైనంత వరకు వదులుకోవద్దు. ప్రతి మహిళ బలం కుటుంబం అయితే ఆమె వృత్తి జీవితాన్ని కూడా విజయవంతంగా నెగ్గుకురాగలదు.
*నిశ్శబ్ద.
మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకుంటే ఈ మూడు సమస్యలే కారణం కావచ్చు!
ప్రస్తుతకాలంలో అధికశాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో అధిక బరువు ప్రధానంగా ఉంది. అధిక బరువు క్రమంగా గుండె సంబంధ సమస్యలు, మధుమేహం, కీళ్ల నొప్పులు, ఎముకల అరుగుదల వంటి సమస్యలకు కారణం అవుతుంది. అదే విధంగా అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది. ప్రస్తుతం అధిక బరువు సమస్యకు వయసుతో కూడా సంబంధం లేదు.
ఈ అధిక బరువు మీద చాలా మందికి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు, ఆహారంలో మార్పులు వంటివి ఎన్నో ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ని చేసినా సరే అధిక బరువు తగ్గడం లేదంటే అసలు కారణాలు వేరే ఉన్నాయని అర్థం. అవేంటో తెలుసుకుంటే..
థైరాయిడ్ సమస్యలు..
ఆహారం, వ్యాయామం, జీవనశైలి వంటి విషయాలలో ఎన్ని మార్పులు చేసుకున్నా బరువు విషయంలో ఏమాత్రం మార్పులు కనబడకపోతే థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో బరువు పెరుగుదల దారుణంగా ఉంటుంది.
ఒత్తిడి..
ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారు బరువు విషయంలో మార్పులు పొందలేరు. ఎందుకంటే ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రభావం అవుతాయి. ప్రధానంగా ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసాల్ హర్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. నెలసరి సమస్యలు, మెనోపాజ్, ఇతర ఒత్తిడులు బరువు మీద ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిలో అధిక బరువు సమస్య ఉంటే బరువు తగ్గడం కంటే ముందు ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నం చెయ్యాలి.
నిద్ర..
పౌష్టికాహారం తీసుకుంటున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా బరువు విషయంలో ఎలాంటి మార్పులు లేవని చింతించేవారు ఉంటారు. అయితే అలాంటి వారు నిద్ర విషయంలో సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవాలి. నిద్రసరిగ్గా లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. నిద్ర వేళలు సరిగ్గా ఫాలో అవ్వకపోతే వారి రోజు మొత్తం గందరగోళంగా గడిచిపోతుంది. ఈ చికాకుల కారణంగా హార్మోన్లు కూడా ప్రభావితం అవుతాయి. అందుకే బరువు తగ్గాలని అనుకుంటే ముందు సరైన నిద్ర వేళలు పాటించాలి. రాత్రి 10 నుండి 11 గంటల లోపు నిద్రపోవడం. ఉదయాన్నే 6నుండి 6-30 నిమిషాల లోపు నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రోజు ఖచ్చితంగా 7నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
*నిశ్శబ్ద.