Home » » గోవర్ధనాష్టకమ్
Home » » వీధి వీధినా వినాయకుడే
Home » » వందేళ్లుగా పూజలందుకుంటున్న పేపరువినాయకుడు
గోవర్ధనాష్టకమ్

 

గోవర్ధనాష్టకమ్

 

గుణాతీతం పరం బ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్

గోకులానందదాతారం, వందే గోవర్ధనం గిరిమ్

 

గోలోకాధిపతి కృష్ణ విగ్రహం పరమేశ్వరమ్

చతుష్పాదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్

 

నానా జన్మకృతం పాపం దాహేత్తూలం హతాశనః

కృష్ణ భక్తిప్రదం శశ్వద్వందే వందే గోవర్ధనం గిరిమ్

 

సదానందం సదావంద్యం సదా సర్వార్ధసాధనమ్

సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్

 

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్

ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్

 

విశ్వరూపం ప్రజాధీశం వల్లవీపల్లవప్రియమ్

విహ్వల ప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్

 

ఆనందక్రుత్సురాధీశక్హ్ర్ త సంభారభోజనమ్

మహేమద్ద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్

 

కృష్ణ లీలారసావిష్టం కృష్ణాత్మానాం కృపాకరమ్

కృష్ణానన్దప్రదం సాక్షాద్వందే వందే గోవర్ధనం గిరిమ్

 

గోవర్ధనాష్టకమిదం య : పఠేద్భక్తిసంయుత:

తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వర:

 

ఇదం శ్రీ మద్ఘనస్యామనందనస్య మహాత్మనః

జ్ఞానినో జ్ఞాని రామస్య కృతి ర్విజయతేతరామ్

 

ఇతి శ్రీ గోవర్ధనాష్టకమ్


వీధి వీధినా వినాయకుడే

వీధి వీధినా వినాయకుడే...

 

 


సాధారణంగా ఏ పండుగ వచ్చినా.., ఆ పండుగ వాతావరణం ఆ రోజుకే పరిమితమై ఉండుంది. కానీ.., కొన్ని పండుగల సందడి వారం రోజుల ముందునుంచే  మొదలై, పండుగ వెళ్లిన పది రోజులదాకా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి పండుగల్లో మొదటిది వినాయకచవితి, రెండవది విజయదశమి (దసరా)  మూడవది శ్రీరామనవమి.ఆబాల గోపాలం కలిసి, చందాలు వసూలు చేసి, సామూహికంగా  జరుపుకునే పండుగలు ఈ మూడే. అయితే, ఈ మూడు  పండుగల్లో మరింత ప్రత్యేకత గల పండుగ ‘వినాయకచవితి’. ఎందుకంటే..వారంరోజుల ముందునుంచే వివిధ రూపాల్లో, వివిధ పరిమాణాల్లో, వీధివీధినా  కొలువుతీరి వుంటాడు వినాయకుడు.

పత్రికై  పిల్లల పరుగులు


‘ఒరేయ్...ఇంకా పడుక్కునే ఉన్నార్రా..తెల్లారితే వినాయకచవితి పండుగరా...వెళ్ళి పత్రి తీసుకురార్రా’ అని తాతయ్యలు అరుస్తూంటే.., మంచాలమీంచి  దుమికి, ఉరుకులు పరుగులుగా వీధుల్లోకి పరుగులెత్తే మనుమల సందడి మాటల్లో వర్ణించలేము. (ఇప్పుడా సందడి లేదు లెండి. అవన్నీ నా  చిన్నతనంలోనే. కంప్యూటర్ కాలం కదా.. అంతా మారిపోయింది.) అయితే.., పందిర్లు వేయడంలోనూ, వినాయకుని బొమ్మలు తీసుకుని రావడంలోనూ  ఇంకా ఆ సందడి కనిపిస్తున్నందుకు సంతోషించాల్సిందే.



‘గరికె’ అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం?

 


గరికెను.., సంస్కృతంలో  ‘దూర్వాయుగ్మం’అంటారు. గరికె.., ‘దర్భల’ జాతికి చెందిన మొక్క. ‘దర్భలు’ శ్రీ మహావిష్ణువు రోమకూపాల నుండి జన్మించాయి.  పైగా అమృత స్పర్శకు నోచుకోబడ్డాయి. అందుకే అవి అతి పవిత్రాలు. ఆ జాతికి చెందిన ‘గరికె’ కూడా దర్భలవలె పవిత్రమైనవి. అంతేకాక, గడ్డిపూలు  ఉన్నాయి గానీ...‘గరికె’ పూవులు పూయదు. ప్రకృతి సంబంధమైన పరాగసంపర్క దోషం ‘గరికె’కు లేదు. అవి స్వయంభువాలు. కనుక., సంపర్క దోషం  లేకుండా పార్వతీదేవికి స్వయంభువుడుగా జన్మించిన వినాయకునికి ‘గరికె’ అంత ఇష్టం. అందుకే ఆయన ‘దూర్వాయుగ్మ’ పూజను పరమ ప్రీతిగా  స్వీకరిస్తాడు.

‘తెల్ల జిల్లేడు’కు ఎందుకంత పవిత్రత?


‘మారేడుచెట్టు’..........శివుని

కి ప్రతిరూపం.
‘రావిచెట్టు’..............శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం.
‘తులసిమొక్క’..........శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం.
‘వేపచెట్టు’...............మహా
శక్తికి ప్రతిరూపం. అలాగే -
‘తెల్లజిల్లేడుమొక్క’.......సా
క్షాత్తు వినాయకునికి ప్రతిరూపం.   ఎందుకంటే -
వంద సంవత్సరాలు బ్రతికిన తెల్లజిల్లేడుమొక్క.., వినాయకుని ఆకృతిని సంతరించుకుంటుంది. అలాంటి మొక్కలో.., వినాయకుడు శాశ్వతంగా నివసిస్తాడు.
అట్టి వినాయకుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు  సిద్ధస్తాయి. అందుకే తెల్లజిల్లేడుమొక్కకు అంత పవిత్రత..,విశిష్టత.  


‘పాలవెల్లి’ ఎందుకు కట్టాలి?
 
 
 

‘పాలవెల్లి’...‘పాలపుంత’...అం
తరిక్షంలోని గ్రహ, నక్షత్ర సముదాయానికి పర్యాయ పదాలు. దానికి ప్రతిరూపమే ఈ ‘పాలవెల్లి’. అంతరిక్షంలో వ్రేలాడే గ్రహ,  నక్షత్రాలే.., మనం పాలవెల్లికి కట్టే రకరకాల ఫలాలు, పుష్పాలు. సమస్త సృష్టికీ ఈ ఆదిదేవుడే అధినాయకుడు అని చెప్పడానికే మనం ‘పాలవెల్లి’ని కడతాం.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం



వందేళ్లుగా పూజలందుకుంటున్న పేపరువినాయకుడు

వందేళ్లుగా పూజలందుకుంటున్న

పేపరువినాయకుడు

వినాయక చవితి వేడుకలు అనగానే మహారాష్ట్ర తప్పక గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నా పూనెలో ఉన్న ‘మండై గణపతి’ వేడుకలు మాత్రం చాలా ప్రత్యేకం! ఎందుకంటే… పూనేలో ఉన్న అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ ‘మండై’. ఇక్కడ దాదాపు 500కి పైగా పండ్లు, కూరగాయల దుకాణాలు ఉన్నాయి. 1890లో ఇక్కడ ‘కాచి’ అనే వర్తకుడు ఉండేవాడు. కాచి దంపతులకు ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోయింది. సంతానం కోసం వారు తిరగని గుడి లేదు, మొక్కని క్షేత్రం లేదు. అలా ఓసారి ‘తుల్జాపూర్‌ భవాని’ని దర్శించుకున్నారు ఆ దంపతులు. ‘మాకు కనుక పుత్రభాగ్యం కలిగితే, వినాయకుని విగ్రహాన్ని నెలకొల్పుతాను’ అని మొక్కుకున్నాడట కాచి. ఇది జరిగిన ఏడాదికే వారికి సంతానం కలిగింది.

తాను మొక్కుకున్న విధంగానే పూనేలోని మండైలో శారదామాతతో పాటు కొలువై ఉన్న గణేశుని విగ్రహాన్ని స్థాపించాడు కాచి. సాక్షాత్తూ బాలగంగాధర తిలక్‌ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. పూర్తిగా పేపరు గుజ్జుతో రూపొందించడం ఈ విగ్రహంలోని ప్రత్యేకత. అప్పట్లోని పాత వార్తాపత్రికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. అంటే ఈ విగ్రహాన్ని తొలినాటి రీసైకిల్డ్ వినాయకునిగా భావించవచ్చన్నమాట! దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శారద, గణపతి ప్రతిమలకు వివాహాన్ని జరిపిస్తారు. శారదాదేవిని, గణేశునికి భార్యగా భావించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే జ్ఞానానికి ప్రతిరూపాలైన వారిరువురినీ ఒకేచోట కొలవడం వల్ల సర్వకార్యాలూ సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.

వినాయకచవితికి జరిగే నవరాత్రులకు చుట్టుపక్కల వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. ఈ గణేశుని విగ్రహానికి తొండం కుడివైపున ఉండటం మరో ప్రత్యేకత. ఇలాంటి వినాయకులను ‘సిద్ధి వినాయకుడు’ అంటారు. వీరిని పూజిస్తే కోరికలు త్వరగా ఈడేరుతాయట. ‘అఖిల మండై గణపతి ట్రస్టు’ పేరుతో ఉన్న సంస్థ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. అయితే ఇతర గణపతి ఉత్సవాలలాగా ఇక్కడ ఎవరినీ ప్రత్యేకించి చందాలు అడగరు. ఆ వినాయకుడే తన ఉత్సవాల కోసం కావల్సిన నిధులను రాబట్టుకుంటాడనీ, ఆ నిధుల భారాన్ని కూడా తానే చూసుకుంటాడని నిర్వాహకుల నమ్మకం. ఈ ఏడాది జులైలో ఈ ఆలయంలో ఉన్న 40 లక్షలకు పైగా విలువైన నగలను ఒక దొంగ దోచుకుపోయాడు. కానీ వారం తిరిగేసరికల్లా అతను పట్టుబడక తప్పలేదు. గణేశుని మహాత్మ్యానికి ఇదే నిదర్శనమంటున్నారు భక్తులు.

- నిర్జర.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.