పరిచయం
వ్యక్తి జన్మించిన సమయానికి గల గ్రహముల స్థితి ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి, జయాపజయాలు జన్యసమయ గ్రహస్థితిపై ఆధారపడి ఉంటాయి.
అదేవిధంగా ఒక పని మొదలు పెట్టిన సమయానికి గల గ్రహస్థితి ఆ పనియొక్క జయాపజయాలను, భవిష్యత్తును సూచిస్తాయి. జననం అనేది వ్యక్తి అధీనంలో ఉండదు. అది దైవలిఖితం, కానీ ఒక పని మొదలుపెట్టే సమయం, ఆ వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. శుభసమయంలో మొదలు పెట్టిన దిగ్విజయంగా నెరవేరుతుంది. అలా ఎంచుకొనిన శుభాసమయాన్ని "ముహూర్తం" అని అంటారు.
జననం అనేది దైవప్రేరితమైన "దీర్ఘకాలిక ప్రణాళిక" అయితే, ముహూర్తం మానవ కృతమైన స్వల్పకాలిక ప్రణాళిక, ఈ దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాలికలను సమన్వయ పరచకుంటే వ్యక్తి అభివృద్ధి విజయాలను పొందగలడు.