ఉద్దేశ్యం
వ్యక్తి నిత్య జీవితంలో జరిగే శుభాశుభాలు ప్రకృతి, దైవాధీనాలు తప్ప తన చేతిలోనివి కాదని గ్రహించగలిగినాడు. ఆ విషయాల్లో తనకు జాతకం కొంతవరకు మార్గనిర్దేశం చేయడాన్ని గమనించినాడు. జాతకంలోని వేరు వేరు గ్రహ, భావ, రాశి స్థితులు ఆ వ్యక్తి యొక్క జీవితంపై చూపించే ప్రభావాలను పరిశీలించినాడు. జననం తన చేతిలోనిది కాదు కాబట్టి జరుగుతున్న సంఘటనలకు దశలను గమనిస్తూ జాగ్రత్త పడటం ప్రారంభించినాడు. అటువంటి సందర్భంలో ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే అవే జాతక సంబంధమైన గ్రహ, రాశి, భావ యోగాలలో మంచివి ఉన్న సమయాన్ని ఎంచుకోవడం మొదలైంది. ప్రకృతి అనుకూలంగా స్పందించే విధానం, ఒక ప్రత్యకమైన జాతకునికి అనుకూలంగా కనిపించే సమయాన్ని ఎన్నుకొని కార్యక్రమాలను ప్రారంభించడమే 'ముహూర్తం'గా పరిగణించడానికి ఈ పాఠం ఉద్దేశించబడింది.