మాసం తిథులు నక్షత్రాలు లగ్నాలు
చైత్రం పంచమి, అష్టమి అశ్విని, రోహిణి కుంభం
వైశాఖం ద్వాదశి చిత్త, స్వాతి మీనం
జ్యేష్టం బ.చతుర్దశి, శు. త్రయోదశి పుష్యమి, ఉత్తరాషాఢ వృషభం
ఆషాడం బ. షష్ఠీ, శు. సప్తమి పుబ్బ, ధనిష్ట మిథునం
శ్రావణం విదియ, తదియ శ్రవణం, ఉత్తరాషాఢ మేషం
భాద్రపదం పాడ్యమి, విదియ రేవతి, శతభిషం కన్య
ఆశ్వయుజం దశమి, ఏకాదశి పూర్వాభాద్ర వృశ్చికం
కార్తీకం బ.పంచమి, శు. చతుర్దశి కృత్తిక, మఘ తుల
మార్గశిరం సప్తమి, అష్టమి చిత్త, విశాఖ ధనుస్సు
పుష్యం చవితి, పంచమి ఆర్ర్ధ, ఆశ్విని, హస్త కర్కాటకం
మాఘం బ.పంచమి, శు. షష్ఠీ మూల, శ్రవణం మకరం
ఫాల్గుణం బ.చవితి, శు.విదియ భరణి, జ్యేష్ట సింహం
పై మాసాల్లో ఆయా తిథి నక్షత్ర లగ్నాదులు నూతన ఆరంభాలకు పనికిరావు. వంశ, ధన నాశనాన్నిస్తాయి. కావున సంతానోత్పత్తి (గర్భధారణ)కును పనికిరావని భావించబడుతున్నది.
తిథి శూన్య లగ్నాలు: పాడ్యమి - తులామకరాలు, తధియ- సింహ మకారాలు, పంచమి - మిథున కన్యలు, సప్తమి - ధనుః కర్కాటకాలు, నవమి - కర్కాటక సింహాలు, ఏకాదశి - ధనుర్మీనాలు - త్రయోదశి- వృషభ మీనాలు - శుభకార్యాలకు నిషిద్ధాలు.
పంగు లగ్నాలు: పగలు కుంభం, రాత్రి మీనం.
అంధ లగ్నాలు: పగలు మేష వృషభ సింహాలు, రాత్రి మిథున, కర్కాటక, కన్యలు.
బధిర లగ్నాలు: పగలు తూల వృశ్చికాలు, రాత్రి ధనుర్మకరాలు.
వంగు, అంధ, బాధిరాది లగ్నాలు శుభకార్యాలకు నిషిద్ధాలు.