క్రకఛ యోగం: తిథి వార సంఖ్యలను కలిపినపుడు 13 సంఖ్య వస్తే అది క్రకచ యోగం. శుభకార్యాలకు నింద్యం.
ఉదా: శనివారం + షష్టి =13, శుక్రవారం + సప్తమి=13, గురువారం_అష్టమి=13, బుధవారం + నవమి =13, మంగళవారం +దశమి=13, సోమవారం +ఏకాదశి = 13, ఆదివారం +ద్వాదశి=13
సంపర్త యోగం: సప్తమి ఆదివారం, పాడ్యమి బుధవారం, సంపర్త యోగం. శుభకార్యాలకు నింద్యం.
దగ్ధ యోగాలు: (తిథివార యోగాలు) ద్వాదశీ ఆదివారం, ఏకాదశీ సోమవారం, పంచమీ మంగళవారం, తదియా బుధవారం, షష్ఠీ గురువారం, అష్టమీ శుక్రవారం, నవమీ శనివారం - దగ్ధయోగాలు, శుభకార్యాలకు, యాత్రలకు నిషిద్ధాలు.
దగ్ధయోగాలు: (వార నక్షత్రయోగాలు) ఆదివారం భరణి, సోమవారం చిత్త మంగళవారం ఉత్తరాషాఢ, బుధవారం ధనిష్ట, గురువారం ఉత్తర ఫల్గుని, శుక్రవారం జ్యేష్ట, శనివారం రేవతి దగ్ధ యోగాలు, శుభకార్యాలకు నిషిద్దాలు.
విషయోగాలు: చవితి ఆదివారం, షష్ఠీ సోమవారం సప్తమీ మంగళవారం, విదియ బుధవారం, అష్టమీ గురువారం, నవమీ శుక్రవారం, సప్తమీ శనివారం -విషయోగాలు. శుభకార్యాలకు, యాత్రలకు నిషిద్ధాలు.
హుతాశన యోగాలు: ద్వాదశీ ఆదివారం, షష్ఠీ సోమవారం, సప్తమి మంగళవారం, అష్టమీ బుధవారం, నవమీ గురువారం దశమీ శుక్రవారం, ఏకాదశి శనివారం - హుతాశన యోగాలు. శుభకార్యాలకు, యాత్రలకు నిషిద్ధాలు .
యమకంటక యోగాలు: మఘ ఆదివారం, విశాఖా సోమవారం, ఆర్ర్ధ మంగళవారం, మూలా బుధవారం, కృత్తికా గురువారం, రోహిణి శుక్రవారం, హస్తా శనివారం - యమకంటక యోగాలు. శుభకార్యాలకు యాత్రలకు నిషిద్ధాలు.
నిషిద్ధ యోగాలు (సర్వకార్యాలకు): ద్వాదశి ఆశ్లేష, పాడ్యమి ఉత్తరాషాఢ, విదియ అనురాధ, పంచమి మఘ, తదియ ఉత్తరా త్రయం (ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర), ఏకాదశి రోహిణి, త్రయోదశి చిత్త, స్వాతి, సప్తమీ హస్త, మూల, నవమి కృత్తిక, అష్టమి, పూర్వాభాద్ర, షష్ఠీ రోహిణి - ఇవి నిషిద్ధ యోగాలు. ఇందు కార్యారంభం చేస్తే ఆరుమాసాల్లో మరణమని లల్లాచార్యుని మతం.