వారప్రభావం దోష పరిమితులు
నవార దోషాః ప్రభవంతి రాత్రౌ దైవేజ్య దివాకరాణః
దివాశశాంకార్కజ భూసుతానాం సర్వత్ర నింద్యో బుదవార దోషః
సోమ, బుధ, గురు, శుక్ర, వారాలు సౌమ్యాలు. ఆది. మంగళ, శనివారాలు క్రూరాలు. ఆది, గురు, శుక్ర వారాలు ప్రభావం రాత్రి వేళ, సోమ, మంగళ, శని వారాల దోష ప్రభావం పగటి వేళ దోషం కాదు. బుదవార దోషం రాత్రి పగలు కూడా ఉంటుంది. కొందరు 'న వార దోషాః ప్రభవన్తి రాత్రౌ' అనే మొదటి పాదాన్ని ప్రమాణ వాక్యంగా భావించి తక్కిన పాదాలను పరిగణనలోకి తీసుకోకుండా అన్ని వారాలకు సంబంధించిన దోషాలు రాత్రికాలంలో ఉండవని అభిప్రాయపడుతున్నారు. అది సరికాదు.