Home » Muhurtam Pratyekamshalu » పరిచయం
పరిచయం

జాతకునిపై జనన కాల గ్రహస్థితి ప్రభావం ఉన్నట్లుగానే ప్రతి పనికి ఆరంభించిన కాలంలోని గ్రహస్థితి ప్రభావం ఉంటుంది. అందువల్ల జాతకం పరిశీలించినట్లే ముహూర్త కాలానికి కూడా గ్రహస్థితి. దశలు, అష్టకవర్గు, షోడశవర్గు మొదలైన గుణదోష పరిశీలన అవసరం.

 

ప్రతి శుభకార్యానికి వర్షశుద్ధి, మాసశుద్ధి, దినశుద్ధి, లగ్నశుద్ది, ఆ కార్యానికి చెప్పబడిన ప్రత్యేక భావ శుద్ధి (ఉదా: వివాహానికి జామిత్ర శుద్ధి, అష్టమ శుద్ధి మొ||) మొదలైనఅంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి కార్యానికి ప్రత్యేకించి చెప్పబడిన మాసం, తిథి నక్షత్రం మొదలైన వాటిని మాత్రమే స్వీకరిచాల్సి ఉంటుంది. విశేషించి జాతకాన్ని అనుసరించి చంద్రబలం, తారాబలం, లగ్నచంద్ర లగ్నాలనుండి ముహూర్తలగ్నం, అష్టమరాశి, ద్వాదశరాశి కాకుండా ఉండడం మొదలైన అంశాలను పరిశీలించాలి.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.