ఉద్దేశ్యం
తిథి వార నక్షత్ర యోగ కరణాలతోకూడుకున్న అంశాలను పంచాంగం తెలియజేస్తుంది. వానిలో శుభాశుభాలు గత పాఠంలో అధ్యయనం చేయడం జరిగింది. అయితే వేరు వేరు యోగాలు (కలయికలు) ఫలితాల విషయంలో మార్పులకు కారణం అవుతాయి. జీవనావనరాలకు అనుగుణంగా వేరు వేరు ముహూర్తాలను ఎంచుకునే సందర్భంలో ప్రత్యేకంగా కొన్ని అంశాలను గమనించడం అవసరం. ఎక్కువ దోషాలు కనిపిస్తున్నా, ఏదో ఒక ప్రత్యేక గ్రహం దృష్టి, యువత ద్వారా దోష పరిహారాలుంటాయి. కొన్ని ప్రత్యేక ముహుర్తాలలో అన్ని ముహూర్త నియమాలను కాక కొన్నింటిని ప్రత్యేకంగా గమనించవచ్చు. కొన్నింటికి ప్రదేశభేదం వల్ల మార్పులుంటాయి. వీటిని అధ్యయనం చేస్తే ముహూర్తం మరింత స్పష్టంగా నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఆయా అంశాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలను గమనించడానికి ఈ పాఠ్యాంశభాగం ఉద్దేశించబడింది.