ముగింపు
జాతక దోషాలను తెలుసుకుని, జాతకంలోని శుభుడైన బలహీన గ్రహాన్ని నిర్ణయం చేసి ఆ గ్రహ సంబంధమైన రత్నాన్ని సూచించడం ద్వారా ఆ గ్రహకాంతికి అనుకూలమైన సూక్ష్మీకృత కాంతిని అందించినట్లు అవుతుందని రత్నశాస్త్రవేత్తలు చెపుతుంటారు. రత్నధారణ విధానంలో అనారోగ్యాదుల కొరకు ధరించే రత్నాలను ఎడమ చేతికి ధరించాలని, అభివృద్ధి కోసం ధరించే రత్నాలను కుడిచేతికి ధరించాలని మరి కొందరి భావన. రత్నాలను గూర్చిన పరిశోధనలు ఇంకా అధికంగా జరిగి, ప్రకృతిలోని కాంతుల కనుగుణమైన రత్నాలను, జాతక దోషాలను నివృత్తి చేయగలిగిన రత్నాలను తేలియజేసే సాధికారికమైన వివరాలను జ్యోతిష విద్యార్థులు తేలియజేయాల్సిన అవసరం ఉన్నది.