స్కాందపురాణంలో నవరత్నాలకు ఏ విధంగా ప్రభావం వచ్చినదో ఒక కథ చెప్పబడింది. పద్మాసురుడును రాక్షాసరాజును సంహరించడానికి దేవతలు పరమేశ్వరుని ప్రార్ధించారు. వారి ప్రార్థనలకు పరమేశ్వరుడు మూడవకన్ను తెరిచాడు. ఆ కంటి నుండి మహాగ్నిజ్వాలలు బయలు దేరగా, ఆ వేడిమిని భరించలేక పార్వతీదేవి పరిగెత్తింది. అప్పుడు ఆయమ్మ కాలి అందె బ్రద్దలై అందులోని నవరత్నాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఒక్కొక్క రత్నంలో పార్వతీదేవి యొక్క ప్రతిబింబం ఒక్కొక్కకళతో ప్రకాశిస్తూ వుండటం చూసి పరమేశ్వరుడు శాంతమూర్తి అయ్యాడు. ఆయన ప్రతీ రత్నానికి ఒక ప్రత్యేక గుణాన్ని ఆపాదించాడు. ఇవే నవశక్తులై పద్మాసురునితో యుద్ధం చేసే కుమారస్వామి సహాయపడ్డాడని స్కాందపురాణంలో వివరణ ఉన్నది.
నవరత్నాలు ఏ ఏ దిశలో ఉండాలి:
“మాణిక్యం తరణేన్మధ్యే ప్రాచ్యం వజ్రం భృగోర్విధోః
ఆగ్నేయం మౌక్తికం యామ్యాం ప్రవాళం మంగళస్యచ
గోమేధికం రాక్షసో రాహూః పశ్చిమే నీలకం శనేః
వాయువ్యాం వైదూర్యకం కేతోరుదీచ్యాం పుష్యకం గురోః
గారుత్మకం తదైశాన్యం సోమపుత్రస్య తుష్టయే
ముద్రికాంచ నరైర్ధార్యం గ్రహాణాం ప్రియతే సదా"(సం|| పే|| 9)
తా: సూర్యుడు ప్రీతికి మధ్యన కెంపును, చంద్రుడు ప్రీతికి ఆగ్నేయ మూలను ముత్యమును, కుజుని ప్రీతికి దక్షిణ భాగమందు పగడమును, బుధుని ప్రీతికై ఈశాన్య భాగమున గరుడు పచ్చయు, గురు ప్రీతికై ఉత్తర భాగమున పుష్యరాగమును, శుక్రప్రీతికై తూర్పున వజ్రమును, శని ప్రీతికై పశ్చిమమున నీలమును, రాహు ప్రీతికై నైరుతి దిశను గోమేధికమును, కేతు ప్రితీకై వాయువ్యమున వైడూర్యమును, ఈ ప్రకారం అంగుళ్యాభారనమును నిర్మించి, నవగ్రహ అనుగ్రహం కోసం మానవులు ధరిస్తే పీడా పరిహారమై శుభాలు కలుగుతాయి.
ధారణావిధానం:
నవగ్రహ జపం అనుభవజ్ఞులయిన వారిచే శాస్త్రోక్తంగా చేయించి, పంచాంగశుద్ధి గల దినములలో శుభనక్షత్ర, శుభతిథులతో కూడిన రోజున అన్నశాంతి చేసి ధరించాలి.
ఉపయోగాలు:
సమస్త గ్రహ దోషాలు తొలగుతాయి. ఉత్సాహం, తేజస్సు కలుగుతుంది. అన్ని విషయాలమీ అనుకూలంగా ఉంటుంది. సమశ్య పరిష్కార శక్తి పెరుగుతుంది.