ఈ రత్నం కేతు గ్రహానికి సమంధించింది. వైడూర్యాన్ని ఇంగ్లిషులో 'క్యాట్స్ ఐ' (Cats eye) అంటారు. రాత్రివేళ పిల్లి కళ్ళలో హెడ్ లైట్స్ వెలుగు పడినప్పుడు ఆ కళ్ళలో ప్రతిఫలిచే రంగులు 'వైడూర్యం' లోనూ మనకు కనిపిస్తాయి. పల్చని హనీబ్రౌన్ మరియు యాపిల్ గ్రీన్ రంగుల్లో వైడూర్యం వుంటుంది.
'క్యాట్స్ ఐ' క్రెసోబెరిల్ ప్యామిలీకి చెందినది. క్రెసోబెరిల్ అనేది అల్యూమినేట్ బెరీలియం. ఈ రత్నానికి దాని తాలూకు లస్టర్, రంగులోని రిచ్నెస్, ఐ తాలుకూ షార్ప్ నెస్, క్లారిటీలతో షేప్ ని అనుసరించి విలువ నిర్ణయించడం జరుగుతుంది. ఇన్ సైడ్ బ్యాండ్ బ్రిలియంట్ గా, స్త్రెయిట్ గా వుంటే వైడూర్యం సుపీరియర్ క్వాలిటీగా చెప్పబడుతుంది. అలాగే కొన్ని వైడూర్యాలు 'మిల్క్ అండ్ హనీ' ఎఫెక్ట్ వ్ ని ప్రతిఫలిస్తాయి. అంటే ఈ వైడూర్యం మీద ప్లాష్ లైట్ వేసినప్పుడు సగభాగం తెల్లగా, మిగిలిన సగభాగం తేనె రంగులో కనిపిస్తాయి. ఇది అంత విలువైన వైడూర్యంగా చెప్పరు. ప్లాష్ లైట్ వేసినపుడు పసుపు, తేనెరంగుల్లో కనిపించేది బెస్ట్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు.
వైడూర్యంలో దోషాలు:
కర్కరము: రాయి వలె కనిపించునవి
కర్కశము: గరుకుగా వున్నవి
త్రాసము: ముక్కలు ముక్కలుగా కనిపించునవి
దేహము: కాంతి లేకుండా వున్నవి.
కళంకము: నల్లని రంగులో వున్నవి
వైడూర్యం అమర్చబడిన ఈజిప్టు దేశము ఆభరణములను బట్టి ఈ రత్నము ఆదేశపు చక్రవర్తులయిన ఫెరోల కాలము నుండియు ఆ దేశమున వాడుకలో ఉన్నవని స్పష్టమగుచున్నది.
నలుపు, తెలుపు, కలిసినది విప్రజాతి, వైడూర్యం, తెలుపు, ఎరుపు గలది క్షత్రియజాతి, ఆకుపచ్చ, నలుపు కలిగినది వైశ్యజాతి, నలుపురంగు కలది శూద్రజాతి.
వైడూర్యమునాకు సుతారము, ధనం అత్యచ్చము, కలిలము, వ్యంగ్యము అనే అయిదు శ్రేష్ఠ గుణములు ఉన్నాయి. కాంతిని అధికంగా వెలువరించే దాని వలె నున్నది సుతారము, ఎక్కువ బరువుగాను చూచుటకుచిన్నదిగాను ఉన్నది ధనము, కళంకము లేనిది అత్యచ్చము, బ్రహ్మాస్త్ర కళాస్వరూపము గల్గి కనిపించునది కలిలము, స్పస్టముగా వేరుగా కాన్పించు అవయవములు కలది వ్యంగ్యము అని చెప్పుదురు.
వైడూర్యమునకు ఇతర నామాలు:
ఏకసూత్రము, కేతుప్రియము, కైతనము, ఖరాబ్జాంకురము, వైడూర్యము, పిల్లి కన్నురాయి అనే పేర్లున్నాయి.
లక్షణాలు:
జాతి - క్రైసోబెరిల్; రకాలు - సైమోఫెన్, క్రైసోబెరిల్, కాట్స్ ఐ, వ్యాపారనామం - క్రైసోబెరిల్, క్యాట్స్ ఐ, దేశీయనామం - లసనియ, వైడూర్యం, కెత్తు, జిడారక్స్, క్రైసోబెరిన్
రసాయన సమ్మేళనం:
Be, Al2O3 బెరీలియం ఆక్సైడ్; స్పటిక ఆకారం - ఆర్థోరాంబిక్; స్పటిక లక్షణం - ట్యూబ్యులార్, సైక్లిన్ ట్విన్నింగ్: వర్ణం -పసుపు, ఆకుపచ్చ, బ్రౌన్ లేదా వీటి సమ్మేళనం వర్ణం; కారణం - ఐరన్; మెరుపు - విట్రియన్; కఠినత్వము -8.5; ధృడత్వము - ఎక్సలెంట్; సాంద్రత S.G – 3.71 నుండి 3.72; క్లీవేజ్ - అస్పష్టంగా ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR; పగులు - శంకు ఆకృతి; అంతర్గత మూలకాలు -నీడిల్స్, కెనాల్, చిన్నట్యూబ్లు, సమాంతరంగా మరియు నిలువు అక్షాలలో ఉంటాయి. కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.745-1.754; UV light – జడం; సాదృశ్యాలు -క్వార్జ్, క్రోసిడోలైట్, అపటైట్,మరియు టుర్మలిన్, క్యాట్స్ ఐ.