ఈ రత్నం "రాహు" గ్రహానికి సంబంధించినది. ఇది ఇన్ ఆర్గానిక్ జెమ్ స్టోన్. ఇవి మంచి తేనె రంగులో మెరిసిపోతుంటాయి. మంచి గోమేధికాలకు శ్రీలంక ప్రసిద్ది. బంగారు రంగులలోనూ గోమేధికాలు దొరుకుతాయి. గోమేధికాన్ని ఇంగ్లీషులో 'హెసోనైట్' అంటారు.
“గోమేధిక మణి నిర్మల
గోమూత్ర ఛాయ జాల కొమరై మేనన్
బ్రేమ ధరింపగ నురుజయ
దామంబగు నిఖిల సౌఖ్యదాయక మగుచున్"
తా: గోమేధికము పరిశుభ్రమగు గోమూత్రచ్ఛాయతో విరాజిల్లు చుండును. దీనిని ధరించిన వారలకు మిక్కిలి జయమును, సర్వ సౌభాగ్యములును కలుగుచుండును.
గోమేధికమునకు అధికమగు వేడిమిని తాకినప్పుడు భారము తగ్గిపోవును. బ్రూస్టన్ అనే శాస్త్రవేత్త సూక్ష్మదర్శినితో పరిశీలించి చిన్న చిన్న గుంటలు ఒక విధమైన ద్రవ పదార్ధాల వలన ఏర్పడినవని, ఇవి కాలువలుగా ఏర్పడు కాంతిని ప్రకాశింపజేస్తున్నాయని కనుగొన్నారు.
గోమేధికములలో తెలుపు కాంతి గలది బ్రాహ్మణ జాతి, ఎరుపు రంగు కలది క్షత్రియ జాతి, ఆకుపచ్చరంగు గలది వైశ్య జాతి, నలుపు రంగు గలది శూద్రజాతి.
గోమేధికంలో దోషాలు:
మల: కాంతిలేకుండా మలినాలుగా వున్నవి
బిందు: లోపల మచ్చలు వున్నవి
రేఖ: చారల మచ్చలు వున్నవి
త్రాశ: బీటలు వుండి ముక్కలుగా విరిగిపోయి వున్నవి
కాకపదము: కాకి పదము వంటి నల్లని గీతాలు వున్నవి.
భారతదేశంలో ఒరిస్సా, గయా ప్రాంతాలలో ఇవి దొరుకుతున్నాయి. పరిమితం గానేనైనా హిమాలయ ప్రాంతం లోనూ ఇవి లభిస్తాయి. అల్యూమినియం, కాల్షియం, సిలికేట్ లను ఉపయోగించి డూప్లికేట్ రత్నాలను తయారు చేసే కర్మాగారాలలో అత్యధిక పీడనంలో వీటిని తయారు చేస్తున్నారు.
గోమేధికం ఇతర నామాలు:
గోమేధికం, గోమేధము, గోమేదము, గోమేదమణి. గోమేధికాన్ని ధరించడం వలన సంపద, విజయం, సంతోషం, అభివృద్ధి, సంతానం, కీర్తి ఆరోగ్యం, మంచి స్థితి, పొడగ్తలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెపుతుంది. గోమేధికం ధరించడం వలన శత్రువులను జయించగలుగుతామని, శత్రుత్వం నాశం అవుతుందని ఎక్కువగా నమ్ముతారు. అందువల్లే పూర్వకాలంలో మహారాజులు యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు గోమేధికం ధరించేవారట.
అల్ట్రావయిలెట్ అనేది అతి చల్లని కలర్. రే జ్వరం, అజీర్ణం, విపరీతమైన వేడి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తదితర అనారోగ్యాలకు ఈ రంగు కిరణాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.
లక్షణాలు:
జాతి - గార్నెట్; రకాలు - గ్రాన్యులర్, గోమేధికం, సావోరైట్; వ్యాపారనామం - సినమన్ స్టోన్, గోమేధికం; దేశీయనామం - గార్నెట్.
రసాయన సమ్మేళనం:
Ca3Al2(SiO4)3 అల్యూమినియం సిలికేట్; స్పటిక ఆకారం - క్యూబిక్; స్పటిక లక్షణం - డొడెకా హైడ్రల్ , వర్ణం -బ్రౌనిష్ ఎల్లో, పసుపు, ఆకుపచ్చ; వర్ణమునకు కారణం - క్రొమియం, వెనేడియం, మాంగనీస్; మెరుపు - విట్రియన్; కఠినత్వము --7.25 ధృడత్వము - గుడ్; సాంద్రత S.G – 3.36 – 3.57, 3.65, 3.57, -3.65 ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-SR; పగులు -శంకు ఆకారం; అంతర్గతమూలకాలు - చిన్న స్పటికాల గుత్తి, దీని వల్ల ,మనకు వేడి తరంగాలు కనిపిస్తాయి, ఫైబర్స్, నీడిల్స్, స్పటికాలు కనిపిస్తాయి. కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.70 – 1.73, 1.74- 1.748, 1.739-1.744; UV light – జడం; సాదృశ్యాలు -స్పినల్ జిర్కాన్, అపటైట్, టుర్ములిన్, ఎమరాల్డ్.