Home » » పగలే వెన్నెల - 1
Home » » పగలే వెన్నెల - 2
Home » » పగలే వెన్నెల - 3
Home » » పగలే వెన్నెల - 4
Home » » పగలే వెన్నెల - 5
Home » » ఖజురహో - 1
Home » » పగలే వెన్నెల - 6
Home » » ఖజురహో - 2
Home » » ప్రేమ పిలుస్తోంది రా - 6
Home » » పగలే వెన్నెల - 7
Home » » ప్రేమ పిలుస్తోంది రా - 7
Home » » ఖజురహో - 3
Home » » ఖజురహో - 4
Home » » ప్రేమ పిలుస్తోంది రా - 8
Home » » పగలే వెన్నెల - 9
Home » » ఖజురహో - 5
Home » » పగలే వెన్నెల - 10
Home » » ఖజురాహో - 7
Home » » ఇట్లు నీ చిలుక - 87
Home » » బెడ్ మీద ...
పగలే వెన్నెల - 1

అక్కడెక్కడో దూరంగా వున్న లోకాల నుంచి ఆకాశపుటొడ్డుకు కొట్టుకొచ్చిన గవ్వలా వున్నాడు చంద్రుడు. ఎండకు భయపడి అప్పటి వరకు కాలు బయటపెట్టని గాలి అప్పుడే షికారుకు బయల్దేరినట్టు చల్లగా తగుల్తోంది. మల్లెపూలు వేసుకున్న పైటను ఎవరో ఆకతాయి లాగేసినట్టు ఆ ప్రదేశమంతా సువాసనలు చుట్టుమడుతున్నాయి.

అక్కడక్కడా విసిరేసినట్టున్న పెంకుటిళ్లు భూదేవి తన పాదాలకు రాసుకున్న గోరింటాకు లతల్లా వున్నాయి. ఇళ్లమధ్య వున్న రహదారి వెన్నెల్లో వెండిపట్టీలా మెరుస్తోంది. సురేష్ వర్మ మెల్లగా ఆ దారంట నడుస్తున్నాడు. క్ర్గీగంట పరిసరాల్ని గమనిస్తున్నాడు. ఆ వాకిట్లో నిలబడి వుందెవరు?

జయంతనుకుంటా - వెన్నెల్లో గోధుమ చేలమధ్యన నిలబడ్డట్టుంది ఆమెను చూస్తుంటే. బాగా మరగకాచిన పాలరంగు ఆమెది. ఒడ్డూపొడుగుతో మగాడి కేదో సవాల్ విసిరినట్టుంటుంది. అంత భారీమనిషితో పడకటింట్లో యుద్దం చేయడానికి ఆమె భర్త వెంకటేశ్వర్లు ఎంత కష్టపడుతున్నాడో? ఆత్మవిశ్వాసం కాబోలు రోజూ సాయంకాలమైతే కల్లుకొట్టు దగ్గరుంటాడు.

అయినా చదువు అంతంత మాత్రమే వచ్చిన వాడికి జేమ్స్ జాయిస్ యులిసిస్ గ్రంథం ఇచ్చినట్టు పిట్టలా వుండే వెంకటేశ్వర్లుకు జయంతితో పెళ్లేమిటి? అందుకే పెళ్లి చేసేప్పుడూ ముఖ్యంగా ఈడూ జోడూ చూడాలనేది -

"దండాలండి" అన్నారెవరో.

"ఆఁ" అంటూ తలవూపాడు సురేష్ వర్మ. నీ ఆరోగ్యం ఎలా వుంది అని అడగాలనిపించీ వూరకుండిపోయాను. పాపం రాముడికి సంవత్సరంనుంచీ ఏదో నరాల జబ్బు. నిద్ర లేచేటప్పటికి కాళ్లలోని నరాలన్నీ ఉబ్బిపోతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ వ్యాధేమిటో కూడా తెల్సుకోలేని పేదరికం. అప్పుడెప్పుడో తన దగ్గరికొచ్చి వెయ్యో రెండువేలో తీసుకున్నట్టు గుర్తు.

పాపం - రోజూ కష్టపడ్డా పూటకే గడవని స్థితి. మరి మందులకీ మాకులకీ ఎలా వస్తుంది? ఏ పనీ చేయని పెద్ద పెద్ద రైతులు జ్వరం వచ్చినా 'త్రీస్టార్' నర్సింగ్ హోమ్ లకి వెళతారు. ఎంత దారుణం? మార్క్స్ చాలా కరెక్టు. పనిచేసేవాడికి తిండి. గోర్బచేవ్ పెరిస్త్రోయికా సాక్షిగా మార్క్సిజమ్ కు దహనసంస్కారాలయిపోయాయి. ఇంకా ఎక్కడున్నాం మనం? ఆ వస్తున్నది ఎవరు?

పద్మ - భర్తనొదిలి పుట్టింటికి వచ్చేసిందని బాబు చెప్పాడు. వాడి ద్వారానే విశేషాలు తెలిసేది. వాడే తనకి ఏకైక టీ.వీ. ఛానెల్. కళ్లకు కట్టినట్టు అన్నీ చెబుతుంటాడు. అయినా ఆ పిల్లేమిటి తనని చూసి అలా సిగ్గుపడింది. తన వయసెక్కడ? ఆ పిల్లవయసెక్కడ? తనకి ముప్పై - ఆ పిల్లకంటే బహుశా పద్దెనిమిది వుంటాయోమో ఆ పిల్ల తత్వమే అంతేనని బాబూ చెప్పాడు.

మగాడైతే చాలు అన్నట్టు ప్రవర్తిస్తుందట. కారణం ఏమైవుంటుంది? కొందరంతే - సంసార చట్రంలో ఇమడలేరు. హార్మోన్ల సమతుల్యం లోపమా? లేకుంటే డాన్ జ్యూక్ లాంటి మనస్తత్వమా? తన స్త్రీతనాన్ని ఎప్పటికప్పుడు లోకానికి చాటటానికి నచ్చిన మగాడితో రాత్రయితే ఏ గడ్డి వానము చాటునో, ఏ కాశి రాయిమీదనో - ఆ ఐదునిముషాలు మనసులో కాకరపువ్వొత్తుల్ని వెలిగించుకుంటుంది కాబోలు.

ఏమో - లోగుట్టు పైనున్న ఫ్రాయిడ్ కెరుక. సాయంకాలమయితే చాలు పెళ్లికూతురిలా తయారయి పోతుంది. తనెప్పుడు చూసినా ఫుల్ మేకప్ లో కనిపించేది. దట్టంగా, మసక చీకట్లో అయినా తెల్లగా తెలిసేటట్టు పౌడర్ రాసుకుంటుంది. చీకట్లతో పోటీపడే విధంగా కాటుక రాసుకుంటుంది. నుదుటను గుండ్రటి ఎర్రటి స్టిక్కర్ - తలలో లూజుగా కిందకు వదిలేసిన మల్లెపూల దండ -

వేళ కాగానే 'భోజనం తయార్' అన్న బోర్డును హోటల్ వాళ్లు వీధిలో పెట్టినట్టు - ఆమెను చూసినప్పుడంతా ఆ బోర్డే గుర్తుకొచ్చేది తనకు. "బాబయ్యా! టైమెంతయిందయ్యా?" సురేష్ వర్మ ఈ లోకంలోకి జారిపడ్డాడు. ఎవరో ఈ ఊరు మనిషి కాడు- పరాయి ఊరు. టైమ్ చూసి చెప్పాడు - "ఎనిమిదిన్నర." ఆ మనిషి వెళ్లిపోయాడు.

సురేష్ వర్మ తిరిగి బయల్దేరాడు. అబ్బ ఏమిటంత వెలుగు? కృష్ణారెడ్డి ఇంటి వరండాలో బల్బు కరెంటునంతా తాగి బలిసినట్టుంది. వెన్నెలంతా మేసి ఏరు నిదురోయింది అన్నది మనసులో ఇంకిపోవడంవల్ల ఇలా అనుకున్నానా? ఏమో ఈ ఆలోచనా స్రవంతికి ఏది మూలం? ఏదికాదు? ఎప్పుడు దేనిమీద మనసు పోతుంది? బోర్ ఎందుకు కొడుతుంది? ఒక్కోసారి ఎందుకంత ఉత్సాహంగా? మరొక్కప్పుడు ఎందుకంత దిగులుగా? ఏదీ అర్దంకాదు సాల్వకార్ డాలీ చిత్రంలాగా, ఏదీ ఒక పట్టాన బోధపడదు .

అంతా తికమకే - మకతికే.


పగలే వెన్నెల - 2

కృష్ణారెడ్డి పరమ భక్తుడు. అంత దరిద్రంలో కూడా పూజలకీ, పునస్కారాలకీ లోటు రానివ్వడు. దేవుడు వున్నాడని చెబితే చాలదు. ఆ దేవుడు మెచ్చుకునే విధంగా ప్రవర్తించాలని కందుకూరి వీరేశలింగం కాబోలు అన్నాడు. ఇప్పుడవన్నీ తిరగబడిపోతున్నాయి. కొంతమంది సుఖం కోసం కోట్లమంది కష్టాలు పడుతున్నారు.

వోల్టేర్ నుంచి మహా మేధావులంతా చెప్పింది అదేకదా. కృష్ణారెడ్డి పక్కనున్నది ఎవరూ? వసంత - దామోదరరెడ్డి భార్య. రాత్రయినా పగలయినా ఎప్పుడూ బంగారాన్ని ఒంటి్నిండా దిగేసుకుని కనపడుతుంది. నగల పిచ్చేమో - మెడనుంచి పాదాలవరకు బంగారునగలే. అవన్నీ విప్పేలోపే దామోదర్ రెడ్డి చల్లబడిపోతాడేమో.

అంతేకదా - శరీరాన్ని తాకుతూ నగలని విప్పడం అంటే తమాషానా? ఉద్రేకం వేళ్లకొసల్లో చిట్లి చల్లబడిపోదూ - దామోదర్ రెడ్డి ఎలా భరిస్తున్నాడో ఏమోగాని తనకైతే నగలన్నీ వేసుకున్న స్త్రీలు నచ్చరుగాక నచ్చరు. తనకి స్త్రీ ఎంత సింపుల్ గా వుంటే తనకు అంత ఇష్టం కలుగుతుంది. తను శాలీనుడు కాబోలు - మరి సుగాత్రి ఎవరు?

కళాపూర్ణోదయంలో శాలీనుడికి స్త్రీలలో అలంకారాలు, ఆడంబరాలు, డంబాలు నచ్చవు. అతడి భార్య సుగాత్రి. ఆమెకి అలంకారాలమీద ఓ వీసమెత్తు మోజు. అందుకనే అతనికి భార్యంటే ఇష్టం వుండదు. సహజసిద్దంగా వున్నదానిని ప్రేమిస్తాడతను. ఓ రోజు సుగాత్రి తోటలో వుంటుంది. వర్షానికి తడవడంవల్ల అలంకారాలంతా మాసిపోయి సహజ సౌందర్యంతో మెరిసిపోతూ వుంటుంది. ఆ క్షణంలో ఆమెను చూసిన శాలీనుడు మరులుకొంటాడు. భార్యను కౌగిలించుకుంటాడు - ఎంత మంచి కథ.

మిఠాయికొట్టులో అన్నీ తీపిపదార్దాలే వుంటాయి. వాటిలో వెరైటీ లుంటాయిగానీ అన్నీ స్వీట్లే. అట్లానే ప్రబంధాలు కూడా మిఠాయికొట్లు లాంటివి. కామన్ అయినది శృంగారం. కథలు వేరైనా శృంగారం ఒకటే. వరూధినీ ప్రవరాఖ్యం నుంచి అన్నీ శృంగారప్రధానమే. ఎవరో తన దగ్గరికి వస్తున్నట్టు అన్పించడంతో సురేష్ కళ్లు మరింత సాగదీశాడు. వస్తోంది అతని దగ్గిర పనిచేసే బాబు.

"ఏమిట్రా? నా కోసమేనా?" "ఆఁ అయ్యోరొచ్చాడు - మీకోసం చూస్తున్నాడు."

"నాకోసం ఎందుకురా - మామూలుగా చేసే తతంగం అంతా పూర్తి చేసేయమని చెప్పు."

"మీరు రావాల్సిందేనంట." బాబు ముందుకు వెళుతుంటే అతనూ వెనకే అడుగులేశాడు. అప్పటి వరకు గోలగోలగా వున్న ఆ ప్రాంతం అతన్ని చూడగానే కాస్తంత సద్దుమణిగింది. "పూజ ప్రారంభిస్తాను" అయ్యవారు వినయవిధేయతలతో అడిగాడు. "ఆఁ ఒక్కమాట" అంటూ వెళుతున్న ఆయన్ని పిలిచాడు సురేష్ వర్మ.

"చెప్పండి."

"పూజ పూర్తికావాలంటే ఎంతసేపు పడుతుంది?"

"సుమారు గంట"

"అంత సేపొద్దు - పూజ మొత్తం ఓ అరగంటలో ముగించెయ్ - దక్షిణ రెట్టింపు ఇస్తాను" అన్నాడు.

అయ్యవారి ముఖంలో ఆనందం చిమ్మింది. "అలాగే - మీరు కోరినట్టే." అయ్యవారు గదిలోపలికి వెళ్లాడు.

అంతలో సురేష్ కూర్చోవడానికి ఎదురింట్లోంచి ఓ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేశాడు బాబు. పందిట్లో ఓ మూలకు దాన్ని జరిపించి, కూర్చున్నాడు సురేష్ వర్మ. ఆ రోజు శ్రీరామనవమి. దేవుళ్లూ, దెయ్యాల మీద నమ్మకం లేకపోయినా అతను గత ఐదేళ్ళనుంచి ఈ వేడుకను జరిపిస్తున్నాడు.

వేసవికాలం ఊరుఊరంతా నవమిరోజున గుడి దగ్గరికి రావడం - వెన్నెల్లో అందరూ కలిసి ఆనందంగా గడపడం, చివరికి గుగ్గుళ్లు పెట్టించుకుని తింటూ యింటికెళ్లడం, యివన్నీ బావుంటాయి గనుకే అతనూ తాత ముత్తాతల నుంచి వస్తున్న నవమి ఉత్సవాలను జరిపిస్తున్నాడు. మొదటిరోజు ఉభయదాత అతనే. ఆ రోజు దేవుడి అలంకరణ మొదలుకొని గుగ్గుళ్లు, పందారం వరకు ఖర్చంతా అతని కుటుంబానిదే.

మొత్తం పద్నాలుగు రోజులు నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. చివరి రోజు దేవుడి ఊరేగింపు. రోజుకొకరు ఉభయదాత. తొలిరోజు ఉత్సవం తనది కాబట్టి సురేష్ వర్మ దేవాలయ పరిసరాలన్నిట్నీ శుభ్రంచేయించాడు. గుడికి వెల్ల చేయించాడు. పోయిన బల్బుల స్థానే కొత్తవి ఏర్పాటు చేశాడు. టేప్ రికార్డర్, స్పీకర్లనూ రిపేరు చేయించాడు. కొత్తకొత్తగా కన్పిస్తున్న ఆ దేవాలయం వెన్నెల్లో దంతంతో చేసిన రథంలా వుంది.

అందులోని శ్రీరాముడు రథంలో ఊరేగుతున్న రాజకుమారుడిలా వున్నాడు. తొలిరోజు కాబట్టి ఊర్లోని జనం బాగానే వస్తున్నారు. పోగాపోగా గుగ్గుళ్ల పందారానికి తప్ప ముందు జరిగే భజనలకి ఒక్కరు కూడా రారు. ప్రసాదం పెడుతున్నారని తెలిసినప్పుడే పరుగు పరుగున దూకుతారు. అందులోనూ తొలి ఉభయం సురేష్ వర్మది. కాబట్టి, వెళ్లకుంటే బావుండదన్న ఉద్దేశ్యంతో కూడా అందరూ విధిగా దేవాలయం దగ్గరికి వస్తున్నారు.


పగలే వెన్నెల - 3

ప్రస్తుతానికి సురేష్ వర్మ, కుటుంబం ఆర్దికంగా వెనకపడినప్పటికీ పేరు ప్రతిష్టల్లో మాత్రం ఆ మండలంలో నెంబర్ వన్. అతని తాత సుబ్బరాయవర్మ. అప్పట్లోనే కుబేరుడు. ఆ తర్వాత అతని కొడుకు నారాయణవర్మ స్వాతంత్ర్య సమరంలో ప్రముఖపాత్ర వహించాడు. స్వంత ఆస్థుల్ని సైతం ధారబోశాడు. ఆ తర్వాత కూడా ఆయన నీతి నియమాలకి కట్టుబడ్డాడుగానీ ఆస్థుల్ని సంపాదించడానికి కాదు.

ఆయనకి ముగ్గురు పిల్లలు. పెద్దవాళ్లు ఇద్దరూ కూతుర్లు, మూడో వాడు సురేష్. అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడానికి చాలా ఆస్థుల్నే అమ్మాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ ఆ ఊర్లో భూస్వాములు వాళ్లే. అయితే భూములే ఆధారం కావడంవల్ల ఆదాయం పెద్దగా రాదు.

భూములున్నాయన్న మాటేగాని వాటివల్ల పొంగిపొర్లిపోయే రాబడి మాత్రం లేదు. సురేష్ వర్మకు వ్యవసాయమంటే ఇష్టం. యూనివర్శిటీలో ఎమ్. ఏ. చదివాక యింటికొచ్చి వ్యవసాయం చూసుకునేవాడు. "వాడొక్కడు. ఉద్యోగం సద్యోగం అంటూ వాడ్ని నా కళ్ల ముందునుంచి మాయంచేయకండి" అని అతని తల్లి అనసూయమ్మ కూడా వంతపాడడంతో నారాయణవర్మ కూడా మరోమాట చెప్పలేకపోయాడు.

తన అక్కయ్యల పెళ్లిళ్లు చేయడం దగ్గర్నుంచి రోజువారీ వ్యవసాయం పనుల వరకు నారాయణ వర్మకి సురేష్ చేదోడు వాదోడుగా వుండేవాడు. అయిదేళ్ళక్రితం ఆయన కాలం చేశాక మొత్తం భారమంతా సురేష్ వర్మపైనే పడింది. అతను నిజంగానే చాలా డిఫరెంట్ మనిషి. అప్పటి తన సహచరుల్లాగా బోళామనిషి కాదు. ఏదైనాసరే గాఢంగా కోరుకునే వ్యక్తి. పైపై మెరుగులు కాక లోతుల్ని తరచిచూసేవాడు. కాబట్టి ఏ విషయంలోనైనా అతని అభిప్రాయాలూ, అభిరుచులూ విభిన్నంగా వుండేవి.

తండ్రిపోయిన తరువాత అప్పులన్నిటినీ తీర్చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కయ్యల పెళ్ళిళ్ళ నిమిత్తం చాలనే ఖర్చయింది. 'మోసం - దగాలేని వృత్తి వ్యవసాయం ఒక్కటే అనిపించింది' అని వ్యవసాయం ప్రారంభించాడు. తండ్రి అమ్మెయ్యగా మిగిలింది అప్పటికి దాదాపు ముప్పై ఎకరాలు. అదిగాక ఐదెకరాల మామిడితోటుంది. ఆ ముప్పై ఎకరాల్లో రకానికి ఒకటిచొప్పున పంటలు వేయడం ప్రారంభించాడు.

కూరగాయల తోటలు, పూలతోటల్ని వేశాడు. మొదటి మూడు సంవత్సరాలకే అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ఆ తరువాత వచ్చే రాబడినంతా భూముల అభివృద్దికి ఖర్చు పెట్టాడు. కష్టాల్లో వున్నవాళ్లకి వీలైనంతగా సహాయం చేస్తుంటాడు. అందుకే ఆ వూర్లో అతనికి మంచి పేరుంది. ఆ పల్లెటూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ టౌన్ వుంది. రోజూ సాయంకాలం బాబును తీసుకుని టౌన్ కి వెళుతూంటాడు.

అతనికి ఇష్టమైనవి రెండే విషయాలు. ఒకటి చదవటం, రెండు సిగరెట్లు కాల్చడం. టౌన్ కి వెళ్ళి కొత్తగా వచ్చిన మ్యాగజైన్లు, నవలలు కొనుక్కుని తిరిగి వస్తూంటాడు. తీరిక దొరికినప్పుడు పుస్తకం పట్టుకుని చదవటం తప్ప మరొకటి చేయడు. అనసూయమ్మ కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి తనలో తనే మురిసిపోతుంటుంది. ముప్పై ఏళ్లొచ్చినా అతను ఇంకా పెళ్ళి చేసుకోలేదన్న బాధ తప్ప, కొడుకు మీద ఆమెకు ఎటువంటి అసంతృప్తి లేదు.

"చేసుకుంటానులేవే - ఏ అమ్మాయిని చూసినా యింత వరకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కలగలేదు. నేనేం చేయను చెప్పు" అని అతను తల్లికి సర్దిచెపుతుంటాడు. నిజంగానే అతన్ని స్పందనకు గురిచేసే అమ్మాయి ఎక్కడా ఇంతవరకు తారసపడలేదు. అయ్యవారు పూజ అంతా అయిన తర్వాత చివరగా మంగళ హారతి పట్టుకొచ్చాడు.

"టైమ్ తొమ్మిదయింది. మరి గుగ్గుళ్ళు పందారం ప్రారంభించమంటారా?"బాబు తన అయ్యవారి ముందు వినయంగా వంగి అన్నాడు.

"అప్పుడేనా.. భజన చేయనివ్వండి" సుబ్బారావు అక్కడికి వస్తూ అన్నాడు. ఆయనవైపు చూస్తూ పలకరింపుగా నవ్వి "భజనచేసే ఆ అయిదుమందీ అలిసిపోయినట్టున్నారు" అన్నాడు సురేష్ వర్మ.

"మీ ఉభయం కాబట్టి ఆ అయిదుమందయినా భజన చేస్తున్నారు. రేపట్నుంచీ చూడండి గుగ్గుళ్ళకు తప్ప ఒక్కరు రారు" అని ఆపి ఆ తరువాత తను గడిపిన పాత రోజుల్ని గుర్తుకుతెచ్చుకుంటూ "మా కాలంలో అయితే శ్రీరామనవమి ఉత్సవాలంటే పండగస్థాయిలో జరిగేవి. భజన ఏ అర్దరాత్రో ముగిసేది. ఇప్పుడు చూస్తున్నారు కదా భజనకన్నా ముఖ్యం చాలా విషయాలయిపోయాయి" అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు.

"పెట్టమను - అంతా ప్రారంభమయ్యేసరికి ఎలా లేదన్నా మరో అరగంట పడుతుంది." అయ్యగారి ఆజ్ఞ కావటంతో ఆ ముక్కను గుడి ఆలనాపాలనా చూసే కాంతమ్మతో చెప్పాడు బాబు.

"అప్పుడేనా! సరేలే - ఈ ఊరు ఈ జన్మకు బాగుపడదు" అని శపించి, మరోసారి గుడిని ఊడ్చడంలో నిమగ్నమైంది.

ఆమెది వింత మనస్తత్వం. ఎప్పుడూ మడిగట్టుకుని వున్నట్టు మనుషుల్ని, ముఖ్యంగా మగవాళ్లని చూస్తే దూరం దూరంగా జరుగుతుంటుంది. ఆమెది ఏవూరో ఏవాడో తెలియదు. ఏభై యేళ్లుంటాయి. సరయిన తిండి లేకపోవడంవల్ల కాబోలు ఆ వయసుకే ముసల్దానిలా కనిపిస్తుంది.

గుగ్గుళ్లు పందారం పెట్టడానికి అనువైనవాళ్లు ఎవరున్నారా అని చూస్తున్నాడు బాబు. గుగ్గుళ్ళు పందారం పెట్టాలంటే కూడా దానికీ స్పెషలిస్టులు కావాలి. ప్రతిఏటా ప్రతిఒక్కరి ఉభయానికి ప్రసాదం పంచే పరంధామయ్య ఈమధ్యే కాలం చేశాడు. దాంతో కొత్తవాళ్లని వెతుక్కోవావల్సి వస్తోంది. నారయుడ్ని పందారం పెట్టడానికి పిలుద్దామని అటు వెళ్లాడు బాబు.


పగలే వెన్నెల - 4

పూజ అయిపోవడంతో అయ్యవారు సురేష్ దగ్గరికి వచ్చాడు. ఆయనకు ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చి పంపించేశాడు. ఇంకా ఎందుకు గుగ్గుళ్లు పందారం ప్రారంభించలేదో కనుక్కోవడానికి కుర్చీలోంచి లేచి గుడి మెట్ల దగ్గరికి వచ్చాడు. నారాయుడు ఓ పళ్లెం ఎత్తుకుని పందారం ప్రారంభించాడు. ఇక మనం ఉండక్కర్లేదనుకుని ఇంటికి బయల్దేరబోతూ పందిట్లో గందరగోళంగా వుంటే చూపు అటువేపు తిప్పాడు సురేష్ వర్మ.

పిల్లలు నారాయుడి మీద పడిపోతున్నారు. జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. రద్దీ ఎక్కువైంది. నారాయుడు తట్టుకోలేకపోతున్నాడు. అప్పటికీ తన శక్తిమేర ఎవరు పెట్టించుకున్నారో లేదో చూస్తూ పెడుతున్నాడు. జనాన్నంతా పరిశీలిస్తున్న సురేష్ వర్మ ఓ దగ్గర ఠక్కున ఆగిపోయాడు.

విస్మయం లాంటిది ఒంటినంతా జిలకొట్టినట్లయిపోయాడు. అటు నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. బావిగట్టును ఆనుకుని వున్న ఓ స్త్రీ అతన్ని అలాగేకట్టిపడేసింది. ఆమెను ఇంతకు ముందెన్నడూ చూళ్ళేదు. వెన్నెల్లో ఆమె అచ్చు కాళిదాసు శకుంతలలా లేదు. మను చరిత్ర వరూధిని అంతకంటే కాదు. పోనీ వసు చరిత్ర గిరిక, విజయ విలాసంలోని ఉలూచి అంతకన్నా కాదు. వీళ్లందర్నీ కలిపి ఓ స్త్రీని చేస్తే ఎలా వుంటుందో అలా వుంది ఆమె.

అందం, అంత హుందాతనం, అంత విలాసం ఒక్కరిలో వుండడం అసంభవం. ఆమె ప్రసదానికి కాకుండా ఏదో పంజరంలోంచి తప్పించుకుని జనం మధ్యలోకి వచ్చినట్టు ఆ పరిసరాల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తల తిప్పుకోలేక పోతున్నాడు సురేష్ వర్మ. ఆమెకి పాతికేళ్ల పైమాటే. సువాసన బరువుకి విచ్చుకున్న మొగలిపువ్వులా వుంది. ఛామనఛాయ ఆమె అందానికి మరింత ఆకర్షణ ఇచ్చిందేతప్ప రంగు తక్కువున్న భావనను కలగనివ్వడంలేదు.

చాలా దూరానికైనా విశాలంగా కన్పిస్తున్న కళ్లు, అంత పెద్దముఖంలోనూ కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్న ముక్కు, మసకవెన్నెల్లో కూడా ఎర్రషేడ్ ను ప్రతిఫలిస్తున్న పెదవులు, మనిషి భారీగా వున్నా తమ ఉనికిని తెలియజేయటానికే మరింత బరువుగా, బలంగా ఎదిగిన పొంగులు, బావిగట్టు నీడలో అదృశ్యమైపోయిన నడుము - అతను కళ్లార్పడం మరిచిపోయాడు. నీలం పూవులున్న తెల్లటి కాటన్ చీరలో దృశ్యాదృశ్యంగా కన్పిస్తున్న బొడ్డుకూడా అదోరకం కొత్తపువ్వులా వుంది. ఆమెది ఈ లోకంకాదు.

"ఆమె నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుషమా సుధాగానమంజు వాటి" అనిపించింది అతనికి. ఆమెమీదే మొహం పెంచుకుని ఆమె కోసమే బ్రతుకై కృష్ణశాస్త్రి అన్నట్లు 'సగము వాడి విరహతోరణమ్మునై' కృశించిపోవాలనిపించింది. ఆమెను మరింత దగ్గరగా చూడాలనిపించి అతను అటువేపు కదిలాడు. జనమంతా గుగ్గుళ్ల మీద పడ్డారు తప్ప అతన్ని ఎవరూ గమనించడం లేదు.

అతను గుడి ముందు వేసున్న పందిట్లోంచి నడిచి, ఎర్రగన్నేరు చెట్లకు చుట్టుకుని మాధవయ్య ఇంటి పెరట్లో వున్న సన్నజాజుల చెట్టుకింద కెళ్లి నిలుచున్నాడు. గాలి తన సహస్ర చేతుల్తో సన్నజాజుల్ని చెరబట్టినట్టు గుప్పున వాసనలు చుట్టుముట్టాయి. ఇప్పుడామె మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె దగ్గరగావెళ్లి 'ఆరిపేయవే వెన్నెల దీపాన్ని' అని చెప్పాలన్న గాఢమైన కోరిక అతనికి కలిగింది.

ఆమె అందం, ఆకర్షణ అతనిలో మోహావేశాన్ని కలిగించాయి. ఆ క్షణంలో అందరూ ఠక్కున అదృశ్యమైపోయి తను మాత్రమే ఆమెలో లీనమైపోవాలన్నంత బలంగా కౌగిలించుకోవాలనిపించింది. "ఏమిటయ్యా సురేషూ - అలా చూస్తున్నావ్ - ఎవర్ని?" అతను తల తిప్పి పక్కకి చూశాడు. తన తత్తరపాటునంతా కప్పి పుచ్చుకోవడానికి నవ్వును ముఖమంతా పూసుకున్నాడు. దొంగను పట్టుకున్నట్లు నవ్వుతోంది చింతామణి.

ఆమె అతని పక్కగా వచ్చి "ఆ జామచెట్టు దగ్గర నిలుచున్న ఆమెనా చూస్తోంది. అంతగా ఆకర్షించిందా నిన్ను" అంది బావిగట్టువైపే చూస్తూ. చింతామణితో అబద్దం చెప్పడం కష్టం. అరవయ్యేళ్ల వయసులో జీవితాన్ని కాచివడబోసిన ఆమె అంటే ఊరికంతకీ భయమే. ఎటువంటి వ్యక్తినయినా క్షణకాలంలో అంచనావేసే తెలివితేటలూ, అవతల వ్యక్తిని తన బుట్టలో వేసుకునే వాక్చాతుర్యం, ఎక్కడా చిక్కుకు పోని లౌక్యం. ఎవరికైనా సహాయం చేసే ఆమె గుణాలు.

అందుకే అందరికీ ఆమె అంటే భయమూ భక్తీ వున్నాయి. సురేష్ వర్మను సైతం ఏకవచనంతో సంబోధించి అంత క్లోజ్ గా మాట్లాడే ధైర్యం ఆమెకు తప్ప, ఆ ఊర్లో మరెవ్వరికీ లేదు తను చూస్తున్నది ఎవర్నో అంత కరెక్టుగా కనిపెట్టేసేటప్పటికి అతను ఖంగుతిన్నాడు. ఆ సమయంలో ఏం చెప్పాలో నోట మాట రాలేదు.

"వాలుచూపుకో, వలపు మాటకో ఒళ్లోవచ్చి వాలిపోవడానికి ఆమె కన్నెపిల్లేంకాదు. వివాహిత - మరొకరి భార్య" అంది నవ్వుతూనే హెచ్చరిస్తున్న ధోరణిలో.

"పెళ్లయిందా?" నమ్మశక్యంగాలేక మరోసారి అడిగాడు సురేష్ వర్మ.

"ఆ. మూడేళ్ళయింది పెళ్లి జరిగి - మనూరికి కొత్త."

"ఇంతకీ ఎవరామె?" రహస్యంగా అర్దిస్తున్నట్లడిగాడు.

"పేరు మాత్రమే చెప్పగలను. ప్రస్తుతానికింతే" అని ఓ క్షణం ఆగి "పేరు శశిరేఖ" అంది.

వెన్నెలంతా తన గుండెల్లో పరుచుకున్నట్లు అతను అనుభూతికి లోనయ్యాడు 'శశిరేఖ' - ఆ అక్షరాలను మనసులో రాసుకుంటున్నట్లు పెదవులను ఆడించాడు. ఇదంతా దొంగచాటుగా గమనిస్తున్న మరో వ్యక్తి కూడా అటువేపు కదిలింది.

శశిరేఖను రక్షించుకోవడం కోసం ఆ వ్యక్తి ఆమె దగ్గరికి త్వర త్వరగా అడుగులేసింది.


పగలే వెన్నెల - 5

సురేష్ వర్మకు నిద్రరావడం లేదు.

మామూలుగా అయితే ఓ పుస్తకం చదువుతూ అలా నిద్రలోకి జారిపోయేవాడు. కానీ ఎందుకనో ఆరోజు పుస్తకం మీదకి దృష్టిపోవడంలేదు. కళ్ల ముందునుంచి శశిరేఖ రూపం చెదిరిపోవడంలేదు. శ్రీశ్రీ గేయం గుర్తుకొస్తోంది. వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలలో, దారికాని దారులలో, కానరాని కాంక్షలలో దేనికొరకు, దేనికొరకు దేవులాడుతావ్? ఏం కావాలి తనకు? ఆమె నుంచి ఏం కోరుకుంటున్నాడతను?

కానీ విషాదమేమిటంటే, మనం ఎదుటివ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నామో తెలియకపోవడమే. తనకూ అంతే. ఏమిటో దానికి తన దగ్గరా జవాబులేదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడాలని వుంది. తనతో గడపాలని వుంది. ఎండ, వానా, పగలూ, రాత్రీ, చలీ, ఇలా ప్రకృతి మార్పులన్నీ తనతో పంచుకోవాలనుంది. గ్రీష్మం నుంచి వసంతం వరకు ప్రతి ఋతువునూ తనతో అనుభవించాలనుంది.

తనతో నవ్వాలనుంది. తనతో కలిసి ఏడ్వాలనుంది. తనతో కవిత్వం చెప్పించుకోవాలనుంది. కవిత్వం చెప్పాలనుంది. తనతో ప్రపంచమంతా రివ్వుమని చుట్టి రావాలనుంది. అదేసమయంలో తనతో ఏ అడవిలోనో చిన్న కుటీరంలో జీవితాంతం ఉండిపోవాలనుంది. ఇలా అనిపించడాన్ని ఏమంటారు? ప్రేమా? ఆకర్షణా, మోహమా, శృంగారమా? ఏమని పిలవాలీ దీన్ని. మొత్తానికి తనకి ఆమె ధ్యాస తప్ప మరొకటి లేకుండా బతకాలనుంది. కానీ అదెలాసాధ్యం? ఆమెకు పెళ్లయింది. మరి పిల్లలున్నారో లేదో తెలియడంలేదు.

ఆమెమీద తన అధికారం ఏమిటి? అతనికా సమయంలో ఏమీ తెలియడం లేదు. తనమీద తనకే జాలి లాంటిది కలుగుతోంది. అతనికి ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ గుర్తొచ్చింది. నాలుగో తరగతి, అయిదో తరగతి చదివేరోజుల్లో ఎవరైనా కథలు చెబుతుంటే అవి నిజంగా జరుగుతున్నాయని భావించి వాటికి కలిగిన కష్టం గురించి ఏడ్చేశాడు. పులీ ఆవు కథ విన్నప్పుడైతే అతని బాధ వర్ణనాతీతం. ...

ఎలాగైనా ఆవుతోపాటు అడవికివెళ్ళి ఆవును వదిలెయ్యమని, దానికో చిన్నదూడ వుందని చెప్పాలని తెగ తాపత్రయపడిపోయేవాడు. అది కథ అని, అలాంటి ఆవుకానీ, పులీకానీ లేవనీ తల్లి ఎంత చెప్పినా వినలేదు. కొంచెం పెద్దయ్యాక అంత అమాయకత్వంలేదు గానీ, ఆ పాత్రలు నిజమని నమ్మినంత గాఢంగా ఫీలయ్యేవాడు. కథ విన్న చాలా రోజులవరకు ఆ పాత్రలే కళ్లముంది మెదిలేవి. ఇప్పుడు తన స్థితిలాంటిదే గతంలో ఓ తిప్పడు ఎదుర్కొన్నాడు. ఆ కథ ఇప్పుడు గుర్తొస్తోంది.

ఓ రాజ్యాన్ని రాజు పాలిస్తుంటాడు. ఆయనకి పద్దెనిమిదిమంది భార్యలు. చిన్న భార్య చాలా సౌందర్యరాశి. రాజు అంతఃపురంలో బట్టలు ఉతికేందుకు తిప్పడు అనే వాడొకడుంటాడు. వాడు అనుకోకుండా ఓరోజు చిన్నరాణీని చూస్తాడు. ఆమె అందానికి దాసుడయి పోతాడు. అయినా ఇద్దరికీ ఎంత భేదం? మొహానికి అదంతా ఏం తెలుసు? ఇక తిప్పడు ఆమె మీది కోరికతో సన్నగా అయిపోతాడు.

ఆ తరువాత కథ చాలానే వుంది. ప్రస్తుతం తను కూడా వాడిలాగా అయిపోయాడు. లేకుంటే ఇంతమంది అమ్మాయిలుండగా, తనకు ఆమెమీద కోరిక కలగడమేమిటి? పాపం మానస - తనకోసమే యవ్వనాన్నంతా అలా దాచి పెట్టుకుని కూర్చుంది. కానీ అదేమిటో ఈ మనసు? ఆమెమీదకి పోవడంలేదు. తను ఇప్పుడంటే ఇప్పుడు శ్రీనివాసరావు, మానసతో ఘనంగా పెళ్లి జరిపించేస్తాడు.

కానీ మానసను చూస్తే తనకెందుకో ఏ ఫీలింగూ కలగదు. పోనీ మానసకు ఏం తక్కువంటే తన దగ్గర సమాధానమేమీలేదు. ఈ రేఖను చూస్తూనే స్పందించినంత హృదయం మానస దగ్గర అలా ముడుచుకుపోతుందేమిటి? యాడ్లర్ గానీ, యూంగ్ గానీ ఎవరూ జవాబు చెప్పలేదు. తన మనస్సు గురించి తనకే తెలియనప్పుడు వాళ్లకెలా తెలుస్తుంది?

శశిరేఖ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికన్నట్లు డాబామీద కొచ్చాడు. పిండారబోసినట్లు వెన్నెల. నూర్పిళ్లు అయిపోవడంతో పొలాలన్నీ బీడుగా వెన్నెల్లో ముగ్గుపిండి గాలికి రేగుతున్నట్లు కన్పిస్తున్నాయి. ఈ వెన్నెల్లో దూరంగా పొలాలమధ్య శశిరేఖతో వెన్నెల కుప్పలాట లాడితే ఎలా వుంటుంది? మళ్లీ శశిరేఖ కిందనుంచి పైకొచ్చినా వీడని తలుపులు. ఎలా భరించడం?


ఖజురహో - 1

వాన చినుకులతో తడితడిగా వుంది ఆకాశంటూరిస్ట్ బంగారాలో దిగిన లిన్ దార్టన్ కిటికీ తలుపులు తీసాడు. “ఖజురహో’’ ఇలాకా అంతా చినుగులు పడుతూనే వున్నాయి. వాన చినుకులతో అభ్యంగన స్నానం చేసిన ఖజురహో శిల్పాలు ముసిముసిగా నవ్వుకుంటున్నట్టు అస్పష్టంగా అగుపిస్తున్నాయి. తనింక శిల్పాల దగ్గరకెళ్ళలేదు, స్పర్శించలేదు, పలుకరించలేదు. అప్పటి ప్రధాన శిల్పాచార్యుడు శీలభద్రుడు, అపురూప సౌదర్యరాషి భవాని – వీరిద్దరి శిల్పాలు ఇక్కడే ఎక్కడో కొలువు తీరి వుంటాయి.

“నాకు కూడా తెలియదు గాలించాల’’న్నాడు గైడు. తను డాక్ బంగళాలో దిగగానే గైడుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం పిళ్ళై తనకు తానుగా పరిచయం చేసుకుని ఖజురహో పరిసరాల గురించి చక్కగా వర్ణించాడు.

కల్లాకపటం తెలియని వ్యక్తిగా కనిపించాడు. తల్లిదండ్రులతో పోట్లాడి చిన్నతనంలోనే మద్రాసు నుండి పారిపోయి వచ్చాడు. తనకు చారిత్రిక ప్రదేశాలంటే ఇష్టమంటాడు. ఢిల్లీ లోని ఎర్రకోట, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ. గ్వాలియర్ కోటల్లాంటి చోట్ల గైడ్ గా పనిచేస్తూ ఇక్కడ స్థిరపడ్డాడు. దాదాపు 30 సంవత్సరాల నుండి ఇక్కడే వుంటున్నాడు. చెప్పి చెప్పి బాగా పందిపోయాడు.

యాభయ్యేళ్లుంటాయి. పొట్టిగా, సంనకల్లు, లావు పెదాలు, నల్లని దేహచాయ, బట్టతలతో విచిత్రంగా అగుపిస్తాడు పిళ్ళై. గైడ్ గా పనిచేస్తూ చాలా భాషలు నేర్చుకున్నాడు. ‘మద్రాస్ టీ స్టాల్’ దగ్గర పర్యాటకులు చాలా మంది ఉంటారు. అది పిళ్ళైదే. మద్రాసు నుండి ఆండాళ్ అనే అమ్మాయి, ఆవిడ తమ్ముడు నల్లతంబిని వెంటబెట్టుకు వచ్చాడు. వారే టిఫిన్, టీ ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అక్కడ చారిత్రిక విశేషాలను గురించి కథలుగా అల్లి చెప్పడం పిళ్ళై విశిష్టత. ఎంత ఇస్తే అంత, ఎక్కువ ఇవ్వమని అడగడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు.

మద్రాసు టీ స్టాల్లోని ఇడ్లీ, టీ అక్కడ చాలా ప్రసిద్ధి. తను అక్కడ ఉండేంతవరకూ ఎక్కడికీ వెళ్ళవద్దని లిం దార్టన్ పిల్లిని కోరగా సరేనన్నాడు. “మీ గురించి చెప్పండ’’ని మాటిమాటికీ అడిగేవాడు. ఒకరోజు లిన్ దార్టన్ యిలా చెప్పాడు.

“నేను పుటింది ఒకటికి, పెరిగింది మరొకరి ఒడిలో. ఊపిరి పీల్చుకుంది అమెరికాలు, చెప్పుకోవడానికి చాలామంది వున్నా ఎవరి దారి వారిదేనన్న నిజం తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. తీరికలేని పనులతో డాడి బిజీ, తీరని కోరికతో మమ్మి బిజీ. వారిద్దరి మధ్య మిగిలిపోయిన ఒంటరి జీవితం నాది. తెగిన గాలిపటం ఏ కొమ్మకు తగులుకుంటుందో చెప్పలేం. ప్రస్తుతం నీ చేతికి చిక్కాను’’ అంటూ నవ్వాడు లిన్ దార్టన్.

“దొరవారు నిండా నల్లమైండ్వారుగా ఉండారు. మీ ప్రోగ్రాం చెప్పండి. నాను బై ఆల్ మీన్స్ నిండా కో ఆపరేషన్ ఇచ్చి తోడుగా ఉంటా’’ తమలపాకుకు నున్నం పట్టించి దాన్ని నోటిలో ఓ ప్రక్కకు తోసేశాడు పిళ్ళై.

“చూడు పిళ్ళై! ఖజురహో శిల్పాలంటే మా విదేశీయులకు చాలా ఇష్టం. ఈ శిల్పాలు నిజంగా ఫెంటాస్టిక్. నీరవతను కప్పుకున్న ఈ అందమైన శిల్పాల వెనుక ఏదో విషాదం, మరేదో అర్థంకాని రహస్యం దాగుందని నా మనసు చెబుతోంది. నీవు చాలా ఏళ్లుగా ఇక్కడ వుంటున్నావు. ఇక్కడ వింత సంఘటన ఏదైనా జరిగిందా?’’

“విచిత్రమా అంటారా? ఈ కోయిల్ నిండా రహస్యందా ఉంది. శీలభద్ర, కుట్టి భవానీ రెండు పెరియమూర్తులు ఎక్కడో ఉండాలి, వెదికిదా పట్టుకోవాలి. నాన్ తప్పకుండా దానిని పట్టుకునిదా నిద్రపోను’’

“అది సరే ముందు వారిద్దరి కథ చెప్పవా?’’

“ఒందు ఫారిన్ సిగరెట్ ఇచ్చుకోండి. కథ మొదలుపెట్టుతా. దొరవారు మంచిగా వినండి.’’

అంటూ ఖజురహో శిల్పాల వెనుక దాగిన విచిత్ర కథను పిళ్ళై ప్రారంభించాడు. భాష మారింది-కథయిలా మొదలైంది.


పగలే వెన్నెల - 6

బాబు కిందనుంచి పరుపుతెచ్చి వేశాడు. మళ్లీవెళ్ళి ఈసారి దిళ్ళూ దుప్పట్లూ తెచ్చి పరిచాడు! ఇక మిగిలింది బాబుతో మాట్లాడటం. అలా అయినా శశిరేఖ ఆలోచనలనుంచి తప్పించుకోవచ్చని బాబుని పిలిచాడు.

"ఇలా కూర్చోరా కాసేపూ"

"అలాగే" నంటూ వాడు కూర్చున్నాడు.

"ఏరా! నువ్వో నిజం చెప్పాల్రా" పరుపుమీద కూర్చుంటూ అడిగాడు. "ఏమిటండీ?"

"నువ్వెవరినైనా ప్రేమించావురా?" వాడు ఓ మారు ఉలిక్కిపడ్డాడు. అలాంటి ప్రశ్నలడుగుతాడని వూహించలేదు.

" ఎందుకలా అడిగారు. కారణమేమైనా వుందా......?" అన్నాడు.

"అదంతా నీకెందుకురా - ముందు జవాబు చెప్పు" అన్నాడు సురేష్ వర్మ.

"లేదు. ప్రేమంటే ఎలా వుంటుందో కూడా తెలియదు. పోనీ ప్రేమంటే అందరికంటే ఎక్కువ ఇష్టమనుకుంటే అలాంటి యిష్టం ఎవరి మీదా కలగలేదయ్యా."

'మరి నీ భార్యంటే?'

"అలాంటివేమీ లేవు. కలిసి కాపురం చేస్తున్నాం. అంతే - అసలు మాకా ఆలోచనే రాకుండా పెళ్లి అయిపోయింది. నాకిప్పుడు ముప్పైదాకా వుంటాయనుకుంటాను. ఎనిమిది సంవత్సరాలక్రితం అంటే నాకు ఇరవై రెండున్నప్పుడు మా నాయన ఓరోజు పిలిచి 'ఒరేయ్ నీకు పెళ్లిరా' అన్నాడు. పక్కనున్న మా అమ్మ పెళ్లికూతురి వివరాలు చెప్పింది."

"అంటే - నువ్వు పెళ్లిచూపులక్కూడా వెళ్లలేదన్నమాట."

"ఉహూఁ! అమ్మానాయన చూడడమే. పెద్దవాళ్లకి తెలియదా అనుకుని సరేనంటూ తలాడించాను"

"పెళ్ళిపీటల మీదనేనా ఆమెను చూడడం" అని అడిగాడు సురేష్ వర్మ.

"ఆఁ! నుదుటున బాసికం, పెద్ద అంచుతో గాడీరంగులో వున్న పట్టుచీర, మెడనిండా నగలు - ముఖమే సరిగా కనిపించలేదు. బావుందిలే అనుకున్నాను."

"ఈ ఎనిమిదేళ్ళ సంసారం......?" బాబు అతని మాటలకు మధ్యలో అడ్డు తగిలాడు.

"బావుందా అని అడుగుతున్నారా? బావుందోలేదో కూడా నాకు తెలియదు. అంతమాట ఎప్పుడూ ఆలోచించలేదు కూడా" అన్నాడు. అందుకే వాడు హ్యాపీగా వుంటాడనిపించింది సురేష్ వర్మకి. వాడు దేన్నీ సీరియస్ గా తీసుకోడు. శరీరం ఎలా చెబితే అది చేస్తాడు. జీవితం జీవించడానికే. వాడే ఒక విధంగా కరెక్ట్! ఇలా సంఘర్షించుకోవడాలూ, సందేహించుకోడాలూ వుండవు.

"బాబుగారూ! నా మాట వినండి" బాబు కాసేపు మౌనం తరువాత అన్నాడు.

"ఏమిట్రా?"

"మానసమ్మ మీరంటే పడి చచ్చిపోతుంది. ఆమె మీమీద చూపించే ఇంట్రెస్ట్ చూసే బహుశా ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాను. మీరంటే ఆయమ్మకి ఎంత ఇష్టమో చెప్పలేను. ఆమెను పెళ్లిచేసుకోండి. అమ్మగారు కూడా ఎంతో సంతోషిస్తారు."

"నాకామెను చూస్తే ఏ భావనా కలగడంలేదురా" అన్నాడు సురేష్.

"మాకంతా కలిగిందా? పెళ్లి చేసుకుంటే అదే కలుగుతుంది" వాడు మధ్యలోనే దూరి అతను చెప్పేదాన్ని ఖండించాడు. వాడు చెప్పింది నిజమేననిపించింది సురేష్ వర్మకి. అయినా తనమీద ప్రేమ కలగకుండా, తనతో గడపాలన్న గాఢమైన కోరిక లేకుండా ఎలా పెళ్లి చేసుకోవడం? సాయంకాలం ఓ పూట సరదాగా గడపడానికే మనం మనకు నచ్చిన స్నేహితుడి దగ్గరకు వెళతాం తప్ప, ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళతామా?

"సరేలేరా! ఇది ఇప్పుడు ఈ క్షణాన మనిద్దరిమధ్య తెగే విషయంకాదు గానీ వెళ్లిరా. రేపు నేరుగా మావిడితోటకే వెళ్లిపో. నేను నిదానంగా వస్తాను."

"అలాగే!" వాడు వెళ్ళిపోయాడు.

రాత్రి అలస్యంగా పడుకోవడంతో మరుసటిరోజు ఉదయం పది గంటలకి నిద్ర లేచాడు. నిద్ర లేస్తూనే శశిరేఖ గుర్తొచ్చింది. కలల్లో కూడా అమే. కల అంతా ఏదో జీవపదార్దం సాగినట్టు స్పష్టత లేకుండా సాగింది. కానీ తనమీద అమె ఎంత ప్రభావం చూపుతుందో తెలిసింది. అమెను తలుచుకోగానే కొత్త ఉత్సాహం వచ్చింది. అమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.

తనకున్న స్టార్ ప్లస్ మరియు స్టార్ మూవిస్ ఛానల్ బాబు ఒక్కడే. వాడు ఈపాటికి మామిడితోటకు మందు కొట్టిస్తూ వుంటాడు. తనూ అక్కడికే వెళితే, కాలక్షేపంతోపాటు వివరాలు కూడా తెలుస్తాయి. ఈ ఊహతోనే కొత్త ఉత్సాహం వచ్చింది. నిద్రపడక మీదనుంచి లేచి తయారయ్యాడు. టిఫిన్ తిన్నాక మామిడితోటకు బయల్దేరాడు.

"మధ్యాహ్నంకూడా రాను, నాకూ బాబుకూ క్యారియర్ పంపించు" అని చెప్పాడు తల్లితో.


ఖజురహో - 2

“అదిగో రావిచెట్టు. దాని కిందే శిల్పం చెక్కుతున్న అర్థనగ్నుడు. కొండకోనల నుండి బండ్లమీద మోసుకొచ్చిన పాషాణాల్ని ఎన్నో రోజులనుండి చెక్కుతున్నాడు.

ఛన్, ఛన్, ఫట్, చిట్, టప్, చట్ – రాతి ముక్కలు శబ్దం చేస్తూ గాలిలోకి ఎగిరి భూమ్మీద పడుతున్నాయి. శిల్పి చేతిలోని ఉలి నర్తిస్తోంది. దాని అన్వేషణ దేనికోసమో!

మరో శిల్పి సదాశివ అటువైపు వెళ్తూ శీలభద్రుడి దగ్గర ఆగి చూడసాగాడు. “ఏంటి శీలభద్రా! నీ దేహమంతా స్వేద బిందువులు చిందుతున్నా లెక్కచేయక పాషాణాన్ని ముక్కలు చేస్తున్నావు. నాకు ఎటువంటి ఆకారము అగుపించడం లేదు. అందులో ఏముందని శ్రమ పడుతున్నావు?’’

“ఈ రాతి లోపల నాతి దాగివుంది. పైపోరాలు తొలగిస్తే ఆ దివ్య సుందరి దర్శనమిస్తుంది’’

“ఎవరో ఆ దివ్య సుందరి?’’

“తినబోతూ రుచి అడగటమెండుకూ? వారం రోజుల తరువాత వచ్చి చూడు. నీవు చూడదలుచుకున్నది కనిపిస్తుంది’’

అందం బండరాతిలో ఉందా? ఉలి, సమ్మెటలో వుంటుందా? లేక శిల్పి కల్పనలో వుంటుందా? అనుకుంటూ సదాశివ ఉత్తరీయాన్ని సవరించుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈలోగా శీలభద్రుడి ప్రాణస్నేహితుడు ఆదిత్య వచ్చి మరో రాతిమీద కూర్చున్నాడు. అంగవస్త్రంతో కప్పబడిన మరో శిల్పాన్ని చూస్తూ అడిగాడు ఆదిత్య- “తెరవెనుక బొమ్మెవరిది?’’

“ఒక మగువది’’

“చూడవచ్చా?’’

“నిరభ్యంతరంగా!’’ ఆదిత్య లేచి అంగవస్త్రాన్ని తొలగించాడు. ఆ ప్రతిమను చూసి ఆదిత్య ఆశ్చర్యపోయాడు. “ఎంత దివ్యంగా వుందీ ప్రతిమ! ఇంత అపురూపంగా చెక్కగలవని నేను కలలో కూడా ఊహించలేదు. నీ చేతుల్నే కాదు, ఉలి, సమ్మెటల్ని కూడా ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అది సరే ఎవరీ సుందరి?’’

“నా ఊహా సుందరి ...’’ నవ్వుతూ అన్నాడు శీలభద్రుడు.

“బుకాయించకు, నిజం చెప్పు ... ఎవరా ఊహాసుదరి?’’

“నీకు కూడా శిల్పివే కదా! అంత స్పష్టమైన ఆకృతి నీ ముందుండగా తెలిసి కూడా తెలియనట్టడుగుతావెందుకు?’’

“భావానీదా?’’

“భవానీ ఎవరూ ? ఆవిడెవరో నాకు తెలియదు’’

“నిజంగానే తెలియదా?’’

“ఒట్టు తెలియదు’’

“భవానీకున్న అంగసౌష్టవం మరే మగువకూ లేదు. నీ శిల్పంలో ప్రాణం లేకపోయినా ‘నేను భవానీనే’ అంటూ ఆ శిల్పం సిగ్గుపడుతూ చెబుతున్నట్టుగా వుంది. అది సరేగాని ఈ శిల్పాన్ని ఎవరు చూసినా అది భవానీదేనని ఖచ్చితంగా చెబుతారు. ఇంత ప్రమాదకరమైన పని ఎందుకు చేశావు?’’

“అంటే?’’

“పరాయి ఆడపడుచుల ప్రతిమల్ని ఇంత స్పష్టంగా చెక్కడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే! నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు’’

“భవానీ గురించి వినడమేగాని నేనెప్పుడూ చూడలేడు. ఈ ప్రతిమ భవానీదేనని నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?’’

“నీవు ఆమెను చూడకపోవచ్చు. కానీ ఖజురహో నగరంలో భవానీని మించిన అందగత్తె లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యెక సందర్భాల్లో తప్ప మరెక్కడా భవానీని చూడలేము. ఎప్పుడు ఏ ప్రమాడ్డం జరుగుతుందేమోనని ఆమె తండ్రి ఎప్పుడూ కాపలా కాస్తుంటాడు. ఎప్పటినుంచీ నీ ప్రమాయణం?’’

“ప్రేమా? ఎవరితో?’’

“ఇంకెవరూ? భవానీతోనే!’’

“చెప్పానుగా ఆదిత్యా! భవానీ ఎవరో నాకు తెలియదు. చూడకుండా ప్రేమించడం వీలవుతుందా?’’

“ఎందుకు వీలుపడదూ? స్వప్న సుందరీమణుల కథలెన్నో విన్నాం. ఒకరి గురించి వింటూ ఆలోచిస్తూ ఆ రూపాన్ని తలచుకుంటూ వుంటే ఏదో ఒకరోజు ఆ రూపం కలలోకి రాకపోతుందా? కల్పన నిజాలకంటే చాలా పదునైనది. ఎంతటి దూరాలనైనా దగ్గరికి చేరుస్తుంది. వాస్తవానికి మించిన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది.’’

“అంటే నీవనేదేమిటి? నాకు ఈ ప్రతిమవల్ల ప్రమాదముందంటావు. అంతే కదా నీవుండగా నాకు ప్రమాదమేమిటి?’’

“అది సరేగాని నేనడిగింది సూటిగా జవాబు చెప్పు. భవానీని నీవు ప్రేమిస్తున్నావా లేదా?’’ శీలభద్రుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆదిత్య.

“ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. కానీ ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేని మాట వాస్తవం’’ దిగులుగా అన్నాడు శీలభద్రుడు.

“మామూలుగానే ఆడవారికి ‘అహం’ ఎక్కువ. అందునా అందమైన వాళ్ళల్లో అది ఎంత మోతాదులో వుంటుందో చెప్పనక్కర్లేదు. ప్రాణంలేని పాషాణంలో కోమల హృదయాన్ని శిల్పి చెక్కగలదేమో గాని అదే ప్రాణమున్న పడతిలో దాన్ని పొందడం చాలా మందికి వీలుకాని పని. అదిసరేగాని నీ ఊహాసుందరి నీకు దక్కకపోతే ఏం చేస్తావు?’’

“ఈ ప్రతిమను చూసుకుంటూ శేష జీవితం గడిపేస్తాను’’

“ఏ ముహూర్తంలో పుట్టావో! అసలు నీవెట్లా బతుకుతావు రా? అంత మాయకండా వుంటే నిన్ను ఏ పిల్లా కట్టుకోదు. ఎప్పుడైనా భవానీని చూట్టానికి ప్రయత్నించావా?’’

“అదెలా సంభవం?’’

“కృషితో నాస్తి దుర్భిక్షమ్! అన్నారు పెద్దలు. ప్రయత్నం మనది, తర్వాత దైవేచ్చ. అదిసరే నీకు భవానీని చూడాలని లేదా?’’

“అదెలా వీలవుతుంది?’’

“నేను వీలు కల్పిస్తాను. దానికో నాటకం ఆడాలి. సరే నేను వెళుతున్నాను. నీవు సిద్ధంగా వుండు. వీలయితే భవానీతో మాట్లాడు. వనితలు తమంతట తామే వలచిరారు. వస్తా’’నంటూ ఆదిత్య వెళ్ళిపోయాడు.


ప్రేమ పిలుస్తోంది రా - 6

ఆమె తెల్లకాగితాలను తీసుకుని రెడీ అయింది. అతను చెబుతున్నాడు, ఆమె రాస్తోంది. గోవిందరెడ్డి కుర్చీలోంచి లేచాడు. ఛాంబర్లో అటూ-ఇటూ తిరుగుతూ చెబుతున్నాడు. ఆమె రాస్తోంది.

”మీరు లంచ్ తెచ్చుకున్నారా?”

”లంచ్ బాక్సా! తేలేదు సార్” అంది.

”అటెండర్ ని రమ్మని చెప్పాల్సింది” అన్నాడు.

వెధవ వేషాలు వేయడానికి సిద్ధపడి వచ్చినవాడు అటెండర్ ని రమ్మని చెప్పాడని స్వప్నకి తెలుసు.

”ఫ్లాస్క్ లొ టీ తీసుకొచ్చాను” అన్నాడు. అతనే రెండు కప్పుల్లో పోసి ఓ కప్పుని స్వప్నకి అందించాడు. ఆమె టీ తాగుతోంది. గోవిందరెడ్డి గుమ్మం వరకూ వెళ్ళి అటూ ఇటూ చూశాడు. టీ తాగి కప్పు పక్కన పెట్టింది.అతను వచ్చి ఆమె వెనక నించున్నాడు.

”చెప్పండి సార్.”

అతను చెబుతూనే ఆమెని శల్య పరీక్ష చేస్తున్నాడు. అతని కళ్ళు ఆమె శరీరంలోని భాగాలని చూడ్డానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అతనికి పాదాల కిందనించి వేడి పుట్టుకొస్తోంది. అది శరీరంలోని నరాల ద్వారా ఎగబాకుతోంది. నాలుకతో పెదాలని తడి చేసుకున్నాడు గోవిందరెడ్డి.

ఆమె మెడడమీదుగా చూశాడు. లోనెక్ బ్లౌజ్ లోంచి ఎత్తైన రెండు శిఖరాగ్రాలు. వాటి మధ్య లోయలా సన్నని చారిక. ఆ లోయలో ఒంటిపేట బంగారు గొలుసు మెరిసిపోతూ వేలాడుతోంది.అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

అతను విడుస్తోన్న ఊపిరి వెచ్చగా ఆమె మెడకి తగులుతోంది.

స్వప్న తల తిప్పి చూసింది. అతను ఏం చూస్తున్నాడో గమనించగానే తల కొట్టేసి నట్లయింది. పవిటని కంగారుగా సర్దుకుంది. ఒక్క క్షణం అజాగ్రత్తగా వున్నా అరక్షణం పరిసరాలను మరిచినా మగాడు ఎంత హద్దుదాటుతాడో అప్పుడే ఆమెకు అర్ధమైంది. ఆమె లేచి నిలుచుంది. అతని వేపు తిరిగి ఎదురుగా నించుంది. ఏ చెయ్యి తిరిగిన శిల్పో నిద్రాహారాలు మాని చేక్కినట్టున్న మనోహరమైన శరీర సౌష్టవం. ఎత్తులు… వంపులు… సొంపులు…. అతను గమనిస్తున్నాడు….

”నేను వెళతాను” అంది ముక్తసరిగా.

గోవిందరెడ్డి నవ్వాడు. ”ఇంత సేపయింది ఒక్క లెటర్ కూడ పూర్తికాలేదు. ఇది రేపు డిస్పాచ్ కావాలి. కూర్చో!” ఆమె భుజాలను గుచ్చి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు.

ఉద్యోగం చేసే ఆడవాళ్ళని మంచితనంతోనో, బెదిరింపులతోనో, అధికారంతోనో లొంగదీసుకోవడానికి, లైంగికవేధింపులకి గురిచేసే వాళ్ళు చాలామంది వుంటారు. కానీ పరువుకోసం, కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఆడవాళ్ళు కంటినించి కన్నీటినీ, గుండెల్లోని దుఃఖాన్ని బయటికి కనిపించనివ్వారు. మనసులో ఏవో చెడు ఉద్దేశం పెట్టుకునే తనని ఆరోజు ఆఫీసుకుకి పిలిచాడని స్వప్న అర్థంచేసుకుంది.

”టేక్ డిక్టేషన్ స్వప్నా! భయపడకు. ఇవన్నీ మామూలే!” అన్నాడు చాలా కాజువల్ గా.

ఆమె కింద పెదవిని పంటితో కొరుక్కుంది.


పగలే వెన్నెల - 7

 

 

అతను మామిడితోటకు చేరుకునేటప్పటికి పదకొండు గంటలైంది. ఎండ ఎక్కువైపోయి, కళ్ళను చీలుస్తున్నట్లు ఎండమావులు దారాలు దారాలుగా కనిపిస్తున్నాయి. బంగారాన్ని కాలుస్తున్న కొలిమిలా వుంది అకాశం. పక్షులు ప్రాణాల్ని రెక్కల్లో పెట్టుకొని చల్లని ప్రదేశంకోసం సాగుతున్నాయి. జోరిగల రొద మొత్తం మామిడితోటనంతా ఓ స్పికర్ కింద మార్చేశాయి.

సురేష్ ను చూడగానే బాబు పరుగున ఎదురొచ్చాడు

"పనెలా జరుగుతోందిరా?"

"కంచెపని జరుగుతోంది. దాంతో పాటు రంగడు, శీను చెట్లకి మందు కొడ్తున్నారు.

ఇద్దరూ నడుచుకుంటూ పని జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కొంత సేపు అక్కడే వుండి తిరిగి బయల్దేరారు. తోట మొదట్లో ఓ చిన్న పెంకుటిల్లు వుంది. చాలా ఏళ్ళనాటిది. కాలం అంచున నిలబడి ఎప్పుడో పడిపోయేటట్లుగా వుంటుంది. లోపల మంచం, దానిమీద దుప్పట్లూ, దిళ్ళూ వుంటాయి. తినడానికి ప్లేట్లూ, గ్లాస్ లు లాంటివి మరికొన్ని వున్నాయి. ఆ ఇంటి ముందున్న ఓ చెట్టు నీడలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు సురేష్ వర్మ.

"నువ్వూ కూర్చోరా. పని జరగడం ఇక్కడ్నుంచి కనిపిస్తోందికదా?"

"సరేలెండి." అంటూ వాడు ఎదురుగా టవల్ పరుచుకుని కూర్చున్నాడు.

"ఏమిట్రా విశేషాలు?" బాబుని మెల్లగా ముగ్గులోకి దింపాలి. డైరెక్టుగా శశిరేఖ గురించి అడిగితే వాడు కనిపెట్టేసే ప్రమాదం వుంది. అందుకే మాటల్ని ప్రారంభించాడు సురేష్ వర్మ.

"విశేషాలా? విశేషాలంటే చాలానే వున్నాయండి. బ్రాందీ సీసాలు ఊర్లలో అమ్మకూడదని ఈ మధ్య అందరూ నిర్ణయించిన విషయం దగ్గర నుంచి, చంద్రయ్యది మామూలు చావుకాదని రంగంలో చెప్పిన విషయం వరకు చాలానే వున్నాయయ్యా"

"మామూలు చావు కాదంటే?"

"చంపేశారటండి"

" అంటే హత్యా?"

"అదేనటండి! రంగంలో చెప్పారు"

"రంగమా? అదేమిట్రా?" సురేష్ వర్మకు దాని గురించి తెలియదు.

"రంగమంటే తెలియకపోవడమేమిటి?" మన వూర్లో ఎవరు చచ్చిపోయినా రంగానికి పోతారుకదా"

"నిజంగా నాకు తెలియదురా"

"అయితే వినండి" అంటూ ప్రారంభించాడు బాబు.

"చంద్రయ్య మీకు తెలుసుగా?" మధ్యలో బ్రేక్ వేసినట్టు కాసేపు ఆగాడు.

"చంద్రయ్య అంటే కాటన్ మిల్లులో పనిచేసేవాడు కదా?" అని అడిగాడు సురేష్ వర్మ.

"ఆ అతనే! ఈ మధ్య ఓ రోజు మిల్లు నుంచి తిరిగివస్తూ దారిలోనే చనిపోయాడు."

"ముందేమో సైకిల్ తో వస్తూ మధ్యలో గుండెల్లోనొప్పి వచ్చిందని , అలా కిందపడిపోయాడని ప్రాణం పోయిందని చెప్పాడు. రోడ్డు పక్కన ఆ సమయంలో ఓ పాప గేదెల్ని మేపుతూ వుంది. అమే ఈ కథంతా చెప్పింది. మొదట్లో అందరూ దీన్ని నమ్మారు కూడా. కర్మక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ తరువాతే మొదలయ్యాయి గుసగుసలు."

"గుసగుసలా?" అన్నాడు సురేష్.

"ఆ చంద్రయ్య భార్య జయలలిత వుంది కదా! అమె మీదే అందరి డౌట్. చంద్రయ్యకు బహు డబ్బుపిచ్చి. జీతాన్ని వడ్డీలకు తిప్పి, బాగానే సంపాదించాడు. వడ్డీ ఇస్తానంటే భార్యనైనా ఇచ్చేస్తాడని అనేవారు. అంత లోభి ప్రపంచంలో వుండడనుకో. ఇలాంటివారితో ఏ భార్య అయినా మనస్పూర్తిగా కాపురం చేస్తుందా? అమె మీద చాలా అభాండాలున్నాయి. నిజమెంతో ఆ భగవంతుడికి తెలియాలి."

"తరువాత" అడిగాడు సురేష్ వర్మ.

"రంగం పెట్టెవాళ్ళు మన ప్రాంతంలో బుచ్చినాయుడు కండ్రికలో వున్నారు. తొలుత చంద్రయ్య అన్న గురవయ్య వెళ్ళి తన తమ్ముడి చావు మీద రంగం పెట్టాలన్నాడు. ఆ రంగం పెట్టే ఆయన పేరు వెంకటేశ్వర్లు. సరేనని ఆయన ఒప్పుకుని వారం రోజుల తరువాత కరెక్టుగా అదివారం రమ్మన్నాడు"

"అడిగిన రోజే చెప్పరన్నమాట" సందేహంగా అడిగాడు సురేష్.

"ఖాళీ వుండద్దూ! డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతోనే చూస్తాడా? ఫలానా రోజు రమ్మంటాడు గదా. లేదా టోకెన్ తీసుకుని వేచి చూడద్దూ. ఇదీ అంతే. ఆ ఏం చెబుతున్నాను?" అడిగాడు బాబు.

"అదేరా- అదివారం రమ్మన్నాడు.''

"అదివారం ఉదయం అందరూ బయలుదేరారు. చంద్రయ్య తల్లితండ్రులు, గురవయ్య, ఆయన భార్య కళావతి, చంద్రయ్య చిన్నాన్న, పిన్నమ్మ, తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు మొత్తం పదిహేనుమంది దాకా తేలారు. గురవయ్యకు, నాకు స్నేహం గదా- నన్నూ రమ్మంటే నేనూ వాళ్ళతోపాటే వెళ్ళాను." మధ్యహ్నానికి బుచ్చినాయుడు కండ్రికకు చేరాం. స్కూల్లో బస. ఎత్తుకెళ్ళిన పచ్చిపులుసన్నం తిన్నాం.

ఏం పనిలేదు గదా కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రలేచాం. నేనూ , గురవయ్య రంగం చెప్పే వెంకటేశ్వర్లు దగ్గరికి వెళ్ళాం. పెద్ద బోదిల్లు. దానిచుట్టూ సొరపాదులు, గుమ్మడి పాదులు, ఊరికి దూరంగా బయలు ప్రదేశంలో మొత్తం పదిళ్ళు వున్నాయి. అందరూ ఒకే కులంవాళ్ళు. వెంకటేశ్వర్లు తప్ప మిగతవాళ్ళంతా వెదురుబుట్టలు అల్లుతారు అదే జీవనాధారం.

మేము వెళ్ళి మాతోపాటు తెచ్చిన అయిదు కేజీల బియ్యం, యాభై రూపాయలు దక్షిణా పెట్టాం. క్వార్టర్ బాటిల్ చీఫ్ కి మరో ముఫ్పై రూపాయలు ఎగ్ స్ట్రా. వెంకటేశ్వర్లుకు ఓ అసిస్టెంట్ వున్నాడు. వాడికి చీఫ్ తో కలిసి నూర్రూపాయలు ఇచ్చాం. "ఎనిమిదింటికంతా వచ్చేయండి" అన్నాడు వెంకటేశ్వర్లు.

మేము తిరిగొచ్చేశాం. చీకట్లుపడ్డాయి. తాగేవాళ్ళమంతా చేరి చెరో క్వార్టర్ చీఫ్ తాగాం. తిరిగి అదే పచ్చిపులుసన్నం తిని చేతులు కడుక్కునేటప్పటికి టైమ్ ఏడున్నర అయింది


ప్రేమ పిలుస్తోంది రా - 7

టీ తాగి సెక్షన్ లొ కొచ్చి కూర్చున్నాడు సంతోష్. అతని స్నేహితులు రామారావు, పాండు, లోకనాథం వచ్చి అతని కెదురుగా కూర్చున్నారు. ”ఏమంటున్నదిరా నీ ఫోన్ సుందరీ!” అడిగాడు పాండు.

”రంభలా వుంది కదూ!” రామారావు ఛలోక్తి విసిరాడు.

”రంభలా వున్నా, ఊర్వశిలా వున్నా వీడి కుంచెరంగు పడాల్సిందేగా?” అన్నాడు పాండు.

సంతోష్ కి ముందు అర్థంకాలేదు. వాళ్ళు తనని పోగుడుతున్నారా? లేక గాలితీసి పారేస్తున్నారా అన్న సంగతి.

”నేను చూశానురా! రంభలా లేదు, ఊర్వశిలా లేదు, తిలోత్తమలా వుంది” నవ్వాడు పాండు.

”ఏంటిరా! నీకు వాళ్ళందరూ తెలుసా?” ఎగతాళిగా అడిగాడు రామారావు.

”వాళ్ళెం ఖర్మరా! వాళ్ళ అమ్మమ్మలు కూడా తెలుసు నాకు” చెప్పాడు పాండు. సంతోష్ సిగరెట్ వెలిగించి సీరియస్ గా చూశాడు.

”నువ్వెప్పుడు చూశావు?” అడిగాడు.

”నిన్న… నీతోనే!” చెప్పాడు పాండు.

”నాతోనా?” సంతోష్ కనుబొమలు ముడిపడ్డాయి.

”అవున్రా! ఆమె ఎలా వుంటుందో చూడాలన్న ఆతృత అణచుకోలేక దూరంగా వుండి చూస్తూనే వున్నాను.

”ఏం చూశావు?” కళ్ళు తిప్పకుండా గుచ్చి గుచ్చి అడిగాడు సంతోష్.

”నువ్వు మాకు చెప్పినట్టుగానే ఆరుగంటలకి ఆటోలో ఆ అమ్మాయి దిగడం… ఆమెతో నువ్వు మాట్లాడటం, అటు తర్వాత ఆమె మోటార్ సైకిల్ పై మరో వెధవతో వెళ్లిపోవడం…” పాండు మాటలకి సంతోష్ జవాబు ఇవ్వలేదు. మరో సిగరెట్ వెలిగించాడు. ‘సంథింగ్ ఫిషీ’ మనసులోనే అనుకున్నాడు.

”ఇలా జరిగిందన్న మాట కథ” నీరసంగా అన్నాడు రామారావు.

”బాగుందిరా అబ్బాయి. నేనింకా దాన్ని తీసికెళ్ళి కుంచె రంగు వేశావనుకున్నాను” లోకనాథం నిట్టూర్చాడు.

”ఆమె రోషిణి కాదు” అన్నాడు సంతోష్.

ఆశ్చర్యంగా చూశారు మిత్రులు. ”మరి?” పాండు గొంతులో ఆత్రం.

”ఎవరో పోచమ్మ. అది మన కేసు కాదు.”

”రోషిణి చేయ్యిచ్చింది” సంతోష్ ఒక్కోమాట చెబుతుంటే మిత్రుల మొహాలలోకి పరీక్షగా చూస్తున్నాడు.

”ఏంటి మాకేసి అలా చూస్తావ్?” అన్నాడు పాండు.

”నాకు మీమీదే అనుమానంగా వుంది. నన్ను ఆట పట్టించడానికి ఇది మీరు ఆడిన నాటకం అని నాకు సందేహంగా వుంది.” సంతోష్ మాటలు కటువుగా వున్నాయి,

”ఒరేయ్! ఇంతకాలంనించీ ఒకేచోట పనిచేస్తున్నా ఒక ఆడమనిషి మాతో కాసేపు ముచ్చటగా మాటాడిన పాపాన పోలేదు. నువ్వు పాపులర్ ఫిగర్ వి, నీకు అభిమానులున్నారు. అన్నాడు పాండు నిన్ను చూడ్డానికి ఎవరన్న వచ్చినా, ఏ అమ్మాయితోనన్నా నువ్వు సరదాగా కాలక్షేపం చేస్తుంటే విషయాలు విని శ్రవణానందం, చూసి నయనానందం పొందడం తప్ప మాకు ఒరిగి చచ్చింది ఏమీ లేదు” అన్నాడు రామారావు.

”సారీ! నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. సిల్లీగా ఆటపట్టించారేమోనని అడిగానంతే! ఈ రోషిణి కాకపొతే మరో రోషిణి! లేకపోతె ఇంకో రేణుక నాకేం వర్రీలేదు” ఈజీగా అన్నాడు సంతోష్.

”గురూ! అసలు… అమ్మాయిని పట్టాలంటే ఏం చేయాలి?” అనడిగాడు పాండు.

”గుండు కొట్టించుకోవాలి. అద్దంలో చూసుకుంటే నీ మొహం చూసుకుని నువ్వే భయపడతావు! నీకు అమ్మాయిలు ఎందుకురా?” ఎద్దేవా చేశాడు లోకనాథం. సంతోష్ నవ్వాడు.

”ఆడవాళ్ళని ఆకట్టుకునే పనులు కొన్నుంటాయి. వాళ్ళు చూస్తుండగా వాళ్ళకి నచ్చేపనులు మనం చేస్తుండాలి. తరచుగా వాళ్ళ దృష్టిలో మనం పడాలి. కానీ వాళ్ళని మనం పట్టించుకోనట్లు నటించాలి అంతే. మనం వాళ్ళ కోసం వెర్రెక్కి ఛస్తున్నాం అని తెలిస్తే మనకేసి కూడా చూడరు వాళ్ళు” చెప్పాడు సంతోష్.

”అలాంటి టాలెంట్ నీకుంది. దీనికి తోడు అందం, బొమ్మలువేసే ప్రతిభ వుంది. మాకేం వుందిరా ఫేస్ వాల్యూ! ఇంటినించి ఆఫీస్ కి, ఆఫీస్ నించి ఇంటికెళ్ళి, తిని తొంగోడం… ఇంకేం వుందిరా ఎంటర్ టైన్ మెంట్?” పాండు నిస్సహాయతని వ్యక్తం చేశాడు.

సంతోష్ నవ్వాడు. ”దీనికి చింత పడకూడదురా పాండు. ముందు నువ్వు ఉన్న లెవల్ నించీ ప్రయత్నం చెయ్యి. ''

”అంటే?”

”నువ్వు సెక్షన్ హెడ్ వి. నీ లేడీ అటెండర్ తొ మొదలుపెట్టు. సక్సెస్ అయితే ఒక్కో మెట్టు పైకెక్కవచ్చు!”

గొల్లున నవ్వారు లోకనాథం, రామారావులు.


ఖజురహో - 3

శీలభద్రుడి గుండె వేగంగా కొట్టుకుంది.

ఆదిత్య మొండివాడు అనుకున్నది దుస్సాధ్యమైనా సాధించి తీరుతాడు. తెలివైనవాడు కూడా. ఎంతటి నాటకమాడతాడో? భవానీ తండ్రి రవివర్మ ఆవేశపరుడు, ముక్కోపి, అతడి అనుమతి లేనిదే భవానీ బయటికి రాదు. తగిన వరుడు దొరికితే భవానీ పెళ్ళి త్వరగా జరిపించాలని రవివర్మ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. భవానీని ఆదిత్య తన దగ్గరికి ఎలా తీసుకురాగలడు? ఏమిటి అతడి ధీమా? ఆదిత్యకు రవివర్మ బంధువే, ఐనా ... అంటూ ఆలోచిస్తున్న శీలభద్రుడి చూపు తనవైపు వడివడిగా నడిచి వస్తున్న రవివర్మ మీద పడింది.

ఏం జరుగుతుందో? శీలభద్రుడి గుండె వేగంగా కొట్టుకుంది. రవివర్మ చేతిలో గండ్రగొడ్డలి కూడా వుంది. మళ్ళీ అంగవస్త్రంతో భవానీ ప్రతిమను కప్పివేశాడు. ఆదిత్య బదులు రవివర్మ ఎందుకు వస్తున్నట్టు? రవివర్మను చూసి శీలభద్రుడు లేచి నిలుచున్నాడు. రవి వర్మ నగర ప్రముఖుడు. రాజు దగ్గర కూడా బాగా పరపతి వుందతనికి.

“వర్మగారికి నమస్సులు ...’’ లేని నవ్వును తెచ్చి పెట్టుకుంటూ ముకుళిత హస్తాలతో స్వాగతం పలికాడు శీలభద్రుడు.

“అతి వినయం ధూర్త లక్షణం. నీవు సార్థక నామధేయుడవనుకున్నాను. పచ్చి మోసగాదివని తేలిపోయింది. శీలభద్రుడని పేరు పెట్టుకున్నావు. అసలు నీవు శీలమంటూ ఉందా అని? గౌరవంగా బ్రతికే ఆడపడుచుల్ని అల్లరిపారు చేస్తావా? అంగవస్త్రంతో కప్పిన ఆ ప్రతిమ ఎవరిది?’’

“శాంతించండి, అంగవస్త్రం తొలగిస్తాను. మీరే చూసి చెప్పండి’’ అంటూ శీలభద్రుడు వస్త్రాన్ని ప్రతిమ నుండి వేరు చేశాడు.

“ఈ ప్రతిమను చెక్కింది నీవేనా?’’

“అవును’’

“ఇది నా కూతురు భవానీదే! ఆ విషయం తెలుసా నీకు?’’

“ఎవరి ప్రతిమో నాకు తెలియదు. మీ అమ్మాయిని నేనెప్పుడూ చూడలేడు. చూడకుండా ప్రతిమలో ప్రతిబింభాన్ని మలచడం సాధ్యం కాదు. ఆ ప్రతిమ భవానీదేనని ఏమిటి మీ నమ్మకం? వేరొకరిది ఎందుకు కాకూడదు?’’

“నోర్ముయ్ వాచాలుడా! నిజం చెప్పుకునే ధైర్యం కూడా నీలోలేదు. నా కూతుర్ని వలలో వేసుకోవడానికి నీవు పన్నిన పన్నాగామిది. నీవు భవానీని పొందలేవు. నా గురించి నీకు తెలియదు. నా కూతుర్ని ఎవరైనా కన్నెత్తి చూసినా వాడికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. లే ప్రక్కకు జరుగు’’

“దేనికి?’’

“నీ ప్రతిమను ముక్కలు ముక్కలు చేస్తాను. ఎవరైనా ఆ ప్రతిమను చూస్తే ఏమనుకుంటారో ఆలోచించావా?’’ అంటూ రవివర్మ తన చేతిలోని గండ్రగొడ్డల్ని పైకి ఎత్తి “తప్పుకో ...’’ అంటూ గట్టిగా అరిచాడు.

శీలభద్రుడు ఆ ప్రతిమకు అడ్డంగా నిల్చుని ఇలా అన్నాడు. “ప్రతిమను చెక్కింది నేను. దోషం ప్రతిమది కాదు. నాది. నన్ను చెయ్యండి ముక్కలుచెక్కలు. ఆదిత్య చాడీలేవో చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి పంపినట్లుంది. నేను మీరనుకున్నంత నీచుడిని కాను. ఆ ప్రతిమ మీ అమ్మాయిదేనని మీరు దృఢంగా నమ్మితే నన్ను నరికేయండి. కానీయండి ...’’ అంటూ శీలభద్రుడు తల వంచాడు.

రవివర్మ ఎత్తిన చేయి ఎత్తినట్టుగానే వుండిపోయింది. “ఛీ ... ఛీ ... పిరికిపందను చంపానన్న అప్రదిష్ట నాకెందుకు? కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నేను బ్రతికున్నంతవరకూ నీ ఆటలు సాగానివ్వను. నీ గుండెల్లో నిద్రపోతాను. ఆ ప్రతిమను మరుగులో వుంచుకో!’’ అంటూ వెళ్ళబోయి అకస్మాత్తుగా ఆగిపోయాడు రవివర్మ.

ఎదుటి దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు.

ఆదిత్యతో పాటు భవానీ కూడా అక్కడకు వచ్చింది.

మొదటిసారిగా, మొదటిచూపుగా శీలభద్రుడు రెప్పవాల్చకుండా కొన్ని క్షణాలు భవానీని చూస్తూ ఉండిపోయాడు. ఆమె సౌందర్యం ముందు తను ఎంతో శ్రమపడి చెక్కిన శిలాఖండం వెలవెలపోయింది. ప్రపంచంలోని సౌందర్యమంతా రూపుదిద్దుకుని తన ముందుకొచ్చినట్లనిపించింది. భూతల స్వర్గాన్ని సైతం మైమరిపించే భవానీ సౌదర్యం అద్భుతమనుకున్నాడు శీలభద్రుడు.

కమలాలను సైతం మైమరిపించే తన కళ్ళను ప్రతిమవైపు తిప్పి కొన్ని క్షణాల వ్యవధిలో భవానీ ముందున్న ప్రతిబింబాన్ని దాన్ని చెక్కిన శిల్పిని ఒక్క క్షణం ఓరగా చూసింది.

అంతే ప్రకృతంతా స్తంభించినట్టయింది శీలభద్రకు.

మెరుపుతీగ లాంటి చూపు అది. తన లేత గుండెలో పిడిబాకులా గుచ్చుకుంది. గాయమెక్కడైందో తెలియదుగానీ కనుపాపల చుట్టూ కన్నీరెందుకో పొంగి పొరలింది. ఎక్కడో మేఘాలు లేకుండానే పిడుగు పడినట్టనిపించింది.


ఖజురహో - 4

పూరిపాకలాంటి ఇంటి దగ్గర ఇరుగుపొరుగు జనం గుమిగూడారు. ఆ పూరిల్లు శీలభద్రుడిదే. దానిచుట్టూ అసంపూర్తిగా చెక్కిన శిల్పాలు, బండరాళ్ళు చెల్లాచెదురుగా పడివున్నాయి. చూస్తుండగానే చాలామంది జనం పరుగు పరుగున అక్కడికి వచ్చారు.

వీరి పోట్లాట చూసి కాదు, భవాని అందాన్ని చూట్టానికి స్త్రీలు కూడా చకచకా వచ్చారు. అందరూ తనను కళ్ళార్పకుండా చూట్టం భవాని గమనించి తల వంచుకుంది.

“నువ్వెందుకు వచ్చావిక్కడికి? నీకేమైనా బుద్ధుందా? ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారన్న సిగ్గూ లజ్జా కూడా లేకుండా ... ఛీ ... ఛీ .. నిన్నేం చేసినా పాపం లేదే. నీవసలు ఎందుకు వచ్చావిక్కడికి ... చెప్పూ!’’ సింహంలా గద్దించాడు రవివర్మ.

భవానీకి తన తండ్రి కోపిష్టితనం బాగా తెలుసు. కోపంతో రెచ్చిపోయినప్పుడు ఏమి జవాబు చెప్పినా ప్రమాదమే. చెమటలు పట్టిన ముఖంతో, తప్పుచేసిన దానిలా తల వంచుకుని కొన్ని క్షణాలు మౌనం వహించింది. భవానీ అంటే రవివర్మకు పంచ ప్రాణాలని, ఆదిత్యకు తెలుసు.

ఇంత మంది జనం ముందు తానేమి మాట్లాడినా అసందర్భంగా వుంటుందేమోనని తన మిత్రుడు శీలభద్రుడి వైపు చూసి, భవానీని జాగ్రత్తగా చూడమని కనుసైగ చేశాడు. కొన్ని క్షణాలు అంతా నిశ్శబ్దం రాజ్యమేలింది. తన కూతుర్ని జనం అలా నోరు తెరుచుకుని చూట్టం రవివర్మకు చిరాకనిపించింది.

“నేను మీ కోసమే వచ్చాను నాన్నా! అమ్మకు ఒంట్లో బాగోలేదు. మిమ్మల్ని వున్నఫలంగా వెంటనే తీసుకురమ్మంది పదండి’’

“ఏమైంది?’’

“అవన్నీ అక్కడకెళ్ళి మాట్లాడుకుందాం. ముందు పదండి నాన్న! ఎంతమంది జనం గుమిగూడారో చూడండి!’’ అందరివైపు ఒక్కక్షణం కలగలపి చూస్తూ భవాని – శీలభాద్రుడివైపు కూడా అదోలా చూసింది.

ఆ చూపు కత్తిలా అతని సుతిమెత్తని గుండెకు గుచ్చుకుంది. పాషాణాలు చేక్కేప్పుడు నిప్పురవ్వల్లా ఎగిరిపడే రాతి ముక్కలు తన దేహానికి గుచ్చుకున్నప్పుడు శీలభద్రుడికి ఏమీ అనిపించలేదు. కానీ ఆ మెత్తనిచూపు ... భవానీ చూపు! తన గుండెను తాకగానే ఓ బలమైన ఉల్క భూమిని డీకొన్నట్టయింది.

ఆ చూపులోని ఆంతర్యం, వాలుతనం, మెరుపులాంటి తెల్లదనం, ప్రేమామృతంలో మునిగితేలిన గులాబీ ముగ్ధత్వం – ఏ కవికీ అందని అ రూపం, తను చెక్కిన ప్రతిమలో రావాలంటే? ఎన్ని జన్మలు తపస్సు చేయాలి!?’’ అనుకున్నాడు శీలభద్రుడు”

“శీలభద్రా! నిన్ను వూరికే వదలను, మహారాజుకు నీవు చేసిన పని తెలిస్తే నీకు శిరచ్చేదం తప్పదు. ఈ రవివర్మంటే రాజుగారి దగ్గర కూడా ఎంత పరపతి వుందో ఈ ఖజురహో నగరానికంతా తెలుసు. నీ సంగతేమిటో తర్వాత తేలుస్తాను. పద~’’ శీలభద్రుడిని హెచ్చరించి కూతురు భవానీ చేతిని పుచ్చుకుని లాక్కుని వెళ్తున్నట్టుగా నడిచాడు రవివర్మ.

పోద్దుగూకింది భానుడి అంతిమ కిరణంలా చాలా దూరం వెళ్ళాక భవానీ శీలభద్రుడివైపు ఒక్కక్షణం తిరిగి చూసింది. అది పసిగట్టిన శీలభద్రుడు గుండెను ఒక చేత్తో గట్టిగా అదుముకున్నాడు. ఎవరో గుచ్చినట్టుగా వున్నా తియ్యగానే వుందెందుకో అనుకున్నాడు శీలభద్రుడు. భవానీ వెళ్ళిపోయినా తర్వాత అక్కడ గుమిగూడిన జనమంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.

“ఎంత పనిచేశావు ఆదిత్యా! ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే?’’ అన్నాడు శీల.

“అలా జరగకుండా ఉండాలనే, ఓ చిన్న అబద్ధం చెప్పి భవానీని లాక్కొచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను.’’

“నీ మొండితనం నాకు తెలుసు ఆదిత్యా! తెలివైనవడివి కూడా ...’’

“మునగచెట్టు ఎక్కించకు. రాబోయే ప్రమాదం గురించి ఆలోచించు’’ చెవి దగ్గర మెల్లగా అన్నాడు ఆదిత్య.

“ఎలాంటి ప్రమాదం?’’ ఆశ్చర్యంగా చూశాడు శీలభద్ర.

“రవివర్మ సంగతి నీకు తెలియదు. ఎవరైనా తనను అవమానపరిస్తే వాడి అంటు చూడందే నిడురపోడు. నీవు చెక్కిన భవానీ శిల్పాన్ని చూసిన వారంతా నీకూ, భవానీకి మధ్య ఏదో సంబంధం వుందని గుసగుసలు బయలుదేరి వుంటాయి. అలాంటప్పుడు భవానీకి పెళ్ళి సంబంధాలు ఎలా కుదురుతాయి? ముందు ఆ ప్రతిమను ఎవరికీ కనిపించకుండా దాచేయి. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో!’’

“రాజుగారితో నా గురించి రవివర్మ ఏమైనా చేబుతాడేమో! నాకు భయంగా వుంది ఆదిత్యా!’’

“కంగారుపడకు. భయపడినంత మాత్రాన వచ్చే ఆపదరాక మానదు. ప్రేమించేవారికి పిరికితనం పనికిరాడు. ఐనా నీ మతిలేనితనం కాకపొతే, భవానీలాంటి అపురూప లావణ్యవతి నిన్ను ఏం చూసి ప్రేమిస్తుందనుకున్నావు? మణులా, మాణిక్యాలా, మాగాణా లేక భూములా? కేవలం చిత్రకళను చూసి ప్రేమిస్తారనుకున్నావా?’’

“నీవన్నది నిజమే ఆదిత్యా, ప్రేమిచడానికి హృదయమొక్కటే చాలనుకున్నాను. కానీ స్త్రీ కోరుకునేది అదొక్కటే కాదంటున్నావు,

పోనీలే ... భవానీ ప్రతిబింబంగా వెలసిన ఆ ప్రతిమను చూసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తాను. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా ... (నిట్టూరుస్తూ) ఇంకేంటి, నగర విశేషాలేమిటి?’’

“ఏముందీ మన మహారాజు మళ్ళీ విజయం సాధించి తిరిగి వచ్చారు. నగరంలో వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ ఏం లాభం?’’

“అంటే?’’

“ఆయనకు సంతానం లేదుగా, వారసుడు లేడని మహారాణి కుమిలిపోతోంది. ఎన్ని రాజ్యాలు జయించినా, సంతానం లేకపోతే రాజులు పడే మానసిక బాధ అంతా ఇంతా కాదు. మన నగరానికి దూరంగా ఒక తాంత్రికుడు వచ్చి శ్మశానం దగ్గర కుటీరం వేసుకుని వున్నాడట. అతను శక్తిమంతుడా కాదా తెలుసుకురమ్మని నాకు మహారాజుగారు ఆదేశాలు పంపించారు. నేను ఆ తాంత్రికుడి దగ్గరవెళుతున్నాను. అతని దగ్గర ఏవో శక్తులున్నాయంటున్నారు. వస్తే నీవురా! భవానీని పొందే తాయత్తేదైనా ఇస్తాడేమో! వస్తావా?’’

“అలాగే .... ఎప్పుడు?’’

“అమావాస్య, ఆదివారం అర్థరాత్రి – తాంత్రికులకు చాలా ముఖ్యమైన రోజు! అది వారంరోజుల్లో రాబోతోంది’’

“శ్మాషణం దగ్గర ... తాంత్రికుడితో వ్యవహారం, ప్రమాదమేమీ వుండదా?’’

“మనం మహారాజు తరపున దూతలం మాత్రమే! తాంత్రికుడు మనల్నేమి చేస్తాడు?’’

“నేను సిద్ధంగా వుంటాను. నీవెప్పుడు రమ్మన్నా సరే!’’

*****


ప్రేమ పిలుస్తోంది రా - 8

టీ తాగి సెక్షన్ లొ కొచ్చి కూర్చున్నాడు సంతోష్.

అతని స్నేహితులు రామారావు, పాండు, లోకనాథం వచ్చి అతని కెదురుగా కూర్చున్నారు. ”ఏమంటున్నదిరా నీ ఫోన్ సుందరీ!” అడిగాడు పాండు.

”రంభలా వుంది కదూ!” రామారావు ఛలోక్తి విసిరాడు.

”రంభలా వున్నా, ఊర్వశిలా వున్నా వీడి కుంచెరంగు పడాల్సిందేగా?” అన్నాడు పాండు.

సంతోష్ కి ముందు అర్థంకాలేదు. వాళ్ళు తనని పోగుడుతున్నారా? లేక గాలితీసి పారేస్తున్నారా?” అన్న సంగతి.

”నేను చూశానురా! రంభలా లేదు, ఊర్వశిలా లేదు, తిలోత్తమలా వుంది” నవ్వాడు పాండు.

”ఏంటిరా! నీకు వాళ్ళందరూ తెలుసా?” ఎగతాళిగా అడిగాడు రామారావు.

”వాళ్ళెం ఖర్మరా! వాళ్ళ అమ్మమ్మలు కూడా తెలుసు నాకు” చెప్పాడు పాండు.

సంతోష్ సిగరెట్ వెలిగించి సీరియస్ గా చూశాడు. ”నువ్వెప్పుడు చూశావు?” అడిగాడు.

”నిన్న… నీతోనే!” చెప్పాడు పాండు.

”నాతోనా?” సంతోష్ కనుబొమలు ముడిపడ్డాయి.

”అవున్రా! ఆమె ఎలా వుంటుందో చూడాలన్న ఆతృత అణచుకోలేక దూరంగా వుండి చూస్తూనే వున్నాను.

”ఏం చూశావు?” కళ్ళు తిప్పకుండా గుచ్చి గుచ్చి అడిగాడు సంతోష్.

”నువ్వు మాకు చెప్పినట్టుగానే ఆరుగంటలకి ఆటోలో ఆ అమ్మాయి దిగడం… ఆమెతో నువ్వు మాట్లాడటం, అటు తర్వాత ఆమె మోటార్ సైకిల్ పై మరో వెధవతో వెళ్లిపోవడం…” పాండు మాటలకి సంతోష్ జవాబు ఇవ్వలేదు. మరో సిగరెట్ వెలిగించాడు. ‘సంథింగ్ ఫిషీ’ మనసులోనే అనుకున్నాడు.

”ఇలా జరిగిందన్న మాట కథ” నీరసంగా అన్నాడు రామారావు.

”బాగుందిరా అబ్బాయి. నేనింకా దాన్ని తీసికెళ్ళి కుంచె రంగు వేశావనుకున్నాను” లోకనాథం నిట్టూర్చాడు.

”ఆమె రోషిణి కాదు” అన్నాడు సంతోష్.

ఆశ్చర్యంగా చూశారు మిత్రులు. ”మరి?” పాండు గొంతులో ఆత్రం.

”ఎవరో పోచమ్మ. అది మన కేసు కాదు.”

”రోషిణి చేయ్యిచ్చింది” సంతోష్ ఒక్కోమాట చెబుతుంటే మిత్రుల మొహాలలోకి పరీక్షగా చూస్తున్నాడు.

”ఏంటి మాకేసి అలా చూస్తావ్?” అన్నాడు పాండు.

”నాకు మీమీదే అనుమానంగా వుంది. నన్ను ఆట పట్టించడానికి ఇది మీరు ఆడిన నాటకం అని నాకు సందేహంగా వుంది.” సంతోష్ మాటలు కటువుగా వున్నాయి,

”ఒరేయ్! ఇంతకాలంనించీ ఒకేచోట పనిచేస్తున్నా ఒక ఆడమనిషి మాతో కాసేపు ముచ్చటగా మాటాడిన పాపాన పోలేదు. నువ్వు పాపులర్ ఫిగర్ వి, నీకు అభిమానులున్నారు. అన్నాడు పాండు నిన్ను చూడ్డానికి ఎవరన్న వచ్చినా, ఏ అమ్మాయితోనన్నా నువ్వు సరదాగా కాలక్షేపం చేస్తుంటే విషయాలు విని శ్రవణానందం, చూసి నయనానందం పొందడం తప్ప మాకు ఒరిగి చచ్చింది ఏమీ లేదు” అన్నాడు రామారావు.

”సారీ! నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. సిల్లీగా ఆటపట్టించారేమోనని అడిగానంతే! ఈ రోషిణి కాకపొతే మరో రోషిణి! లేకపోతె ఇంకో రేణుక నాకేం వర్రీలేదు” ఈజీగా అన్నాడు సంతోష్.

”గురూ! అసలు… అమ్మాయిని పట్టాలంటే ఏం చేయాలి?” అనడిగాడు పాండు.

”గుండు కొట్టించుకోవాలి. అద్దంలో చూసుకుంటే నీ మొహం చూసుకుని నువ్వే భయపడతావు! నీకు అమ్మాయిలు ఎందుకురా?” ఎద్దేవా చేశాడు లోకనాథం.

సంతోష్ నవ్వాడు. ”ఆడవాళ్ళని ఆకట్టుకునే పనులు కొన్నుంటాయి. వాళ్ళు చూస్తుండగా వాళ్ళకి నచ్చేపనులు మనం చేస్తుండాలి. తరచుగా వాళ్ళ దృష్టిలో మనం పడాలి. కానీ వాళ్ళని మనం పట్టించుకోనట్లు నటించాలి అంతే. మనం వాళ్ళ కోసం వెర్రెక్కి ఛస్తున్నాం అని తెలిస్తే మనకేసి కూడా చూడరు వాళ్ళు” చెప్పాడు సంతోష్.

”అలాంటి టాలెంట్ నీకుంది. దీనికి తోడు అందం, బొమ్మలువేసే ప్రతిభ వుంది. మాకేం వుందిరా ఫేస్ వాల్యూ! ఇంటినించి ఆఫీస్ కి, ఆఫీస్ నించి ఇంటికెళ్ళి, తిని తొంగోడం… ఇంకేం వుందిరా ఎంటర్ టైన్ మెంట్?” పాండు నిస్సహాయతని వ్యక్తం చేశాడు.

సంతోష్ నవ్వాడు. ”దీనికి చింత పడకూడదురా పాండు. ముందు నువ్వు ఉన్న లెవల్ నించీ ప్రయత్నం చెయ్యి.

”అంటే?”

”నువ్వు సెక్షన్ హెడ్ వి. నీ లేడీ అటెండర్ తొ మొదలుపెట్టు. సక్సెస్ అయితే ఒక్కో మెట్టు పైకెక్కవచ్చు!”

గొల్లున నవ్వారు లోకనాథం, రామారావులు.


పగలే వెన్నెల - 9

రాత్రి ఉభయాల దగ్గరికెళ్ళి శశిరేఖను చూడాలనిపించింది. అయినా వెళ్ళకూడదనుకున్నాడు. కాని మనసు అతని మాట వినటంలేదు. ఇక లాభంలేదని దేవాలయం దగ్గిరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తయారయ్యేటప్పటికి పొద్దుపోయింది. వేసవికాలం సాయంకాలాలు బావుంటాయి. అంతవరకు ఎండతో వుడికిపోయిన ప్రపంచం ఒక్కసారిగా చల్లబడిపోతుంది.

అద్దం ముక్కలాగా నీలం అకాశం మెరుస్తుంటుంది. చెట్లు గాలిని మేస్తున్నట్టు కదులుతుంటాయి. అప్పటివరకు ఇళ్ళల్లో బిగుసుకుపోయిన జనం వీధుల్లోకి ప్రవహించడం మొదలుపెడతారు. ఎలాగయినా ప్రసాదం పెట్టే సమయానికి దేవాలయం దగ్గిరికి వెళితే శశిరేఖను చూడొచ్చని అతనికి తెలుసు.

బాబు వుంటే ఇబ్బందిగా వుంటుందని అతన్ని పంపించేశాడు. ఆ సాయంకాలం వేళ అమెనే తలుచుకుంటూ అటూ ఇటూ నడవటం మొదలుపెట్టాడు.

సినిమా పాటలైపోయి భజన ప్రారంభమైంది.

ఒకరి గొంతులు మరొకరి గొంతులతో కలపక భజన ఛండాలంగా వుంది. ఈ భజనకంటే ఆ సినిమా పాటలే కాస్తంత నయమనిపిస్తోంది. మరో గంటకు భజన ముగిసింది.

ఆరోజు ఉభయదాత వెంకటరెడ్డి హూంకరించి రాబట్టి ఆ మాత్రమైన భజన జరిగుంటుంది. లేదంటే అదీలేదని తెలుసు సురేష్ కి. భజన అయిపోవడంతో తొందరగా మిద్దెపైనుంచి దిగాడు. షర్ట్ వేసుకుని బయలుదేరాడు అప్పటికే కొందరు అరుబయట నిద్రపోతున్నారు. ఎండాకాలం కాబట్టి మొత్తం వీధంతా బెడ్ రూమ్. ఆకాశంలో చందమామ బెడ్ లైట్. అతను దేవాలయం దగ్గర్లోవున్న చిన్నస్వామి ఇంటి ముందున్న గోడదగ్గర నిలబడ్డాడు.

చిన్నస్వామి ఇల్లు చాలా పెద్దది. ముందుభాగంలో విశాలమైన వరండా.దానికి ఇరువైపులా పూర్వం కూర్చోవడానికి కట్టే పెద్ద అరుగులున్నాయి. ఆ అరుగుల్లో తూర్పువైపు ఉన్నది దేవాలయం. వెనక ఉంటుంది. అక్కడ నిలబడితే దేవాలయం ముందున్నవాళ్ళు మనకి స్ఫష్టంగా కనిపిస్తారుగానీ వాళ్ళకి మనం అంత స్పష్టంగా కనిపించం. ఆ ఉద్ధేశ్యంతోనే అతను అక్కడ నిలబడ్డాడు.

భజన అయిపోవడంతో గంధం పంచే కార్యక్రమం సాగుతోంది. దేవుడికి ప్రసాదంతోపాటు గంధం కూడా పంచుతారు. దాన్ని వచ్చిన వాళ్ళకంతా పంచుతారు. అందులో కొంత రాసుకుని మిగిలినదాన్ని పక్కవాళ్ళకి పూసి ఆట పట్టిస్తుంటారు కొందరు. జనం రావడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరూ వచ్చి గుంపులో చేరి ప్రసాదం కోసం చూస్తున్నారు. వెంకటరెడ్డి హడావుడి పడిపోతున్నాడు.

"హారతయ్యాక ముందు మర్యాదలు పంపు...." అని లోపలున్న వాళ్ళకి హెచ్చరించాడు.

ఆ ఊళ్ళో మొత్తం ముగ్గురికి దేవుడి హారతి తరువాత ప్రత్యేకంగా పళ్ళాలతో ప్రసాదాన్ని ఇళ్ళకు పంపుతారు. అందులో ఒక కుటుంబం సురేష్ వర్మది. రెండోది ఆ ఊళ్ళో గతంలో జమిందారుగా వున్న వెంకటరెడ్డిది. మూడవది ఓ కరణాల కుటుంబం. సురేష్ తన చేతుల్లోని గంధాన్ని అలానే వుంచుకున్నాడు. గుప్పెటను ఎంత మూస్తే అంత సువాసన పైకి లేస్తోంది.

"ఏమిటయ్యా గంధం అలా అరచేతిలో పెట్టుకున్నావ్? నీకు నచ్చిన వాళ్ళు లేరనా? లేదూ ఇంకా రాలేదనా?" అన్న మాటలు వినిపించాయి. అతను ఎవరని పక్కకి తిరిగాడు.

చింతామణి నవ్వుతోంది. పళ్ళు కనపడని అమె నోరు అచ్చం గంధం అయిపోయిన గిన్నెలా వుంది.

సురేష్ వర్మ ఏమీ మాట్లాడలేదు. చింతామణిలాంటి తెలివయిన దాని దగ్గర మౌనమే మంచిది. అందులోనూ ఇలాంటి విషయాల్లో చింతామణి ఘటికురాలన్న పేరుంది. ప్రేయసీ ప్రియుల్ని కలపడంలో అమె చాలా అందెవేసిన చేయి. అమెది బాల్యవివాహం. అమెకు ఊహ తెలిసేసరికి భర్త సన్యాసుల్లో కలిసిపోయాడు. అప్పట్నుంచి ఒంటరి జీవితం. కొన్నాళ్ళకు బతుకు మరీ దుర్భరమైపోయింది. ఆ సమయంలోనే మధ్యవర్తిత్వం నెరపేది. చింతామణి టాకిల్ చేసిందంటే విడిగా వున్నవాళ్ళు జంటలైపోవాల్సిందే.

"నా దృష్టిలో ఏదీ అక్రమసంబంధం కాదు. మనసుపడి చేసేది ఏదైనా సక్రమమే. మనసులేకుండా భర్తతో కాపురం చేసినా అది అక్రమ సంబందం కిందకి వస్తుంది. అందుకే ఇష్టంవుండీ కలవలేనివాళ్ళను సహాయం చేసేదాన్ని. నా దృష్టిలో ఏ ఇద్దరి పరిస్ధితులూ ఒకటివిగా వుండవు. కాబట్టే ఒకర్ని విమర్శించే హక్కు ఇతరులకు వుండదు" ఇదీ చింతామణి తత్వం.

అప్పట్లో ఎందరో జంటల్ని కలిపిన పేరుంది అమెకు. "అప్పుడు నేనున్న దరిద్రం అలాంటిది. ఒక లీటర్ కిరసనాయిల్ కోసం కూడా జంటల్ని కలిపిన సంధర్భాలున్నాయి. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. అందుకే అలాంటి వాటికి పుల్ స్ఠాప్ పెట్టేశాను" చింతామణిని ఏవరయినా పాతజీవితాన్ని గుర్తుచేస్తే చెప్పేదది. అవన్నీ నిజమే. అప్పుడెప్పుడో అలా తను మద్యవర్తిత్వం చేసేది. గాని చాలా ఏళ్ళుగా అలాంటివి మానేసింది.

అప్పట్లో ఎన్నో బాధలుపడి కొంత డబ్బు పోగెయ్యగలిగింది. దాన్ని వడ్డీకి తిప్పుకుంటుంది. అదీ ధర్మ వడ్డీ నూటికి నెలకు రూపాయి. ఎవరికి ఏ కష్టమొచ్చినా తన చేతనయిన సాయం చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడంలో చింతామణితో సమవుజ్జీగా నిలిచేది ఆ ఊళ్ళో ఎవరయినా వున్నారంటే అది గంగారత్నమే! అమెకీ చింతామణి వయసే వుంటుంది.

"అదిగో... వస్తోంది చూడు నీ సుందరి" అంది తల అటువైపు తిప్పుతూ.

అమె తలతిప్పిన వైపుకి అతను తన చూపును నిలబెట్టాడు.


ఖజురహో - 5

వారం రోజులయింది.

స్వంత పనిమీద మద్రాసు వెళ్ళి వస్తానని వెళ్ళిన పిళ్ళై ఇంతవరకూ రాలేదు. రోజూ ఒక్కో దేవాలయాన్ని పరీక్షగా చూస్తూ చీకటి పడ్డాక గెస్ట్ హౌస్ చేరుకుంటున్నాడు లిన్ దార్టన్.

తన స్వదేశాన్ని వదిలి చాలా సంవత్సరాలైనట్టని పించిందతనికి. తనకు వూహ వచ్చినప్పటి నుండీ తల్లిదండ్రులను వదిలి దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడు. దేశదేశాల వింతల్ని తిలకిస్తూ వాటిపై పరిశోధనా వ్యాసాల్ని వ్రాస్తున్నాడు. ఎంతో మంది నుండి తనకు ప్రశంసాపత్రాలు వస్తున్నాయి. పత్రికల వారు పంపించే చెక్కులు ఖజురాహో బ్యాంకులో జమ అవుతున్నాయి. డబ్బు చాలకపోతే తండ్రికి టెలిక్స్ మెసేజ్ పంపిస్తున్నాడు.

తండ్రి పక్కా వ్యాపారస్తుడు. ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడు. తల్లి మేరీకి విడాకులు ఇచ్చి చాలా రోజులైంది. తల్లితో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. తండ్రితో వీలకాదు. బిజినెస్ లో ఆయన బిజీగా వుంటాడు. ఎక్కడ తిరుగుతుంటాడో, ఏ టైమ్ లో ఏ మూడ్ లో వుంటాడో అన్ని లిన్ డైరీలో వ్రాసుకుని వుంచాడు.

మంచి మూడ్ లో వున్నప్పుడే తనకు డబ్బు పంపుతాడు. వేరే సమయాల్లో అయితే వీలుకాదని లిన్ కు బాగా తెలుసు. తల్లి మేరీ టీచరుగా లండన్ లో వుంటోంది. చెల్లెలు డయానా కూడా మేరీతో వుంటోంది. కాలేజిలో మెడిసిన్ చేస్తోంది. అప్పుడపుడు అక్కడి పరిస్థితుల గురించి డయానా ఉత్తరాలు రాస్తుంటుంది. ఏమీ తోచనప్పుడు లిన్ ఆ ఉత్తరాలను మంచంమీద పరుచుకుని చదువుకుంటూ ఉంటాడు.

అమెరికా ఆర్కియాలాజికల్ డిపార్ట్ మెంట్ వారు కూడా లిన్ పరిశోధనలకు గాను స్కాలర్ షిప్పు ఇస్తున్నారు. ఆ డిపార్ట్ మెంట్ కు లిన్ ఎప్పటికప్పుడు పరిశోధనా ఫలితాలను పంపిస్తూ ఉండాలి. భారత దేశ చారిత్రిక కట్టడాల గురించి అమెరికా ఆర్కియాలాజికల్ డిపార్ట్ మెంట్ వారు ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండికాలో ఆ విషయాలను ప్రచురించగలిగారు.

ప్రపంచపు ఎన్నో దేశాల గురించి అలా గ్రంధాలు ప్రచురించాలని వారి ఆశయం. దానికి లిన్ దార్టన్ సహకారం అందిస్తున్నాడు. చారిత్రిక పరిశోధకుడిగా లిన్ కు మంచి పేరు రావడంతో పాటు బాగా డబ్బుకూడా వతోంది. ఎన్నో రకాల మనుషులు, మనుగడలు, అలవాట్లు, భాషలు, సాంప్రదాయాలుంటాయి. లిన్ దార్టన్ చాలా కష్టపడి ఎన్నో భాషలు, వ్రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకున్నాడు.

మనుషులతో కలిసి బ్రతకాలంటే భాషల్ని నేర్చుకోవడం తప్పదు. అలాగే తెలుగు, హిందీ ఓ మాదిరిగా బాగానే నేర్చుకున్నాడు. అతడి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఒక్కచోట నిలకడగా వుండే మనిషికాదు. అతను పూర్తిగా నమ్మగలిగే వ్యక్తి ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఎక్కడ ఎన్నిరోజులు గడిపితే అక్కడి వ్యక్తులతో ఆ కొన్ని రోజులు పరిచయాల వరకే పరిమితం!

తనకు తోడుగా ఓ స్త్రీ ఉంటే బాగుంటుందను కుంటాడు. కానీ ప్రత్యేకంగా ఎవరి కోస్సమో తను అన్వేషించలేదు. తన జీవితమే ఓ అర్తకాని అడవి. అందులో ఎవరు కాలు పెట్టినా ఏదో ఒకటి వారికి గుచ్చుకోక తప్పదు. ఆ గాయాల్ని తట్టుకుని తనకు నీడగా వచ్చే వ్యక్తి ఎక్కడో పుట్టే వుంటుందనిపిస్తుందతనికి.

ఆ స్త్రీ కోసం అన్వేషించేందుకు తనకి తీరికా, ఓపికా రెండూ లేవు వచ్చిన వ్యక్తి అనుకూలవతి కాకపొతే ...? లిన్ విచిత్రమైన వ్యక్తి. ప్రేమాభిమానాలు అందరికీ పంచుకుంటూ పొతే బాగుంటుందనుకుంటాడు. గదిలో కూర్చుని తలుపులన్నీ మూసుకుంటే బయటి ప్రపంచపు అందాలు కనుమరుగైపోతాయి. కిటికీలు తెరచి చూట్టమే కాదు, గది నుండి మనిషి బయటకి నడవడం కూడా చాలా అవసరమన్న నిర్ణయానికి వచ్చిన లిన్ ఏ విషయాన్నీ, ఏ సమస్యనూ అంత సీరియస్ గా తీసుకోడు.

అమెరికాలాంటి దేశాల్లో తిరిగేటప్పుడు స్నేహం, ప్రేమ, మమత, మాసిచ్చి పుచ్చుకోవటం లాంటి సెంటిమెంట్స్ కు అర్థం లేదనుకునేవాడు. వ్యక్తిగత స్వేచ్ఛ బోలెడు. అందరూ దగ్గర దగ్గరగా తిరుగుతూ కనిపిస్తారు. కానీ అందరూ ఒంటరి మనుషులే. వాడిగా నడిచిపోతున్న బాటసారికి మారిపోతూ కనిపించే దృశ్యాల్లా అక్కడి నీతి నియమాలు మారుతూ వుంటాయి. కానీ భారతదేశంలో అడుగుపెట్టాక లిన్ లో చాలా మార్పు వచ్చింది.

మానవీయ విలువలు భారతదేశంలో ఇంకా వూపిరి పీల్చుకుంటున్నాయని, అవి లేకుండా జీవితాలు నీరసంగా తయారవుతాయని లిన్ అభిప్రాయం. ఇతరుల జీవితాల బరువుల్ని మోస్తూ మనిషి తన జీవిత బరువును మరచిపోవడానికి ప్రయత్నిస్తూ వుంటాడని లిన్ కు అనుభవం నేర్పింది. లిన్ దార్టన్ సుబ్రహ్మణ్యం కోసం ఎదురుచూస్తున్నాడు.

అదిగో సుబ్రహ్మణ్యం వస్తున్నాడు చేతిలో సంచి, సంచిలో ఏదో తినుబండారమే అయి వుంటుంది. మద్రాసు నుండి వచ్చినప్పుడల్లా తనకు ఏదో ఒక విచిత్రమైన తిండి పదార్ధం తెస్తూ వుంటాడు.

“వణక్కం దొరవాడికి. అంతా సౌఖ్యమే గదా?’’

“ఐయామ్ ఓకే పిళ్ళై! హౌ ఆయ్ యూ?’’ విష్ చేస్తూ అన్నాడు లిన్.

“అంతా నల్లగా వుంది. వారంరోజులు ... నిండా పనులు సర్! నాన్ ఒకడిదా చేసుకోవాలి. మురుగా!’’ అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

“ఏమిటా సంచిలో?’’ ఆశగా చూశాడు లిన్.

“మీకుదా తెస్తిని. ఇది తెలుగు స్పెషల్. బహుత్ అచ్చా, కంట్రీమేడ్, ప్రిపెర్డ్ బై షుగర్ కేన్, పేరు అరిసెలు. నిండా ఘీతో తయారు ...’’

“ఈజిట్! లెట్ మీ టెస్ట్ ఫస్ట్’’ అంటూ అరిటాకులో తెచ్చిన అరిసేల్ని ప్రేమగా తింటూ లిన్ “ఇట్స్ ఫెంటాస్టిక్, వండర్ ఫుల్ టెస్ట్. అది సరే నీవు చెప్పిన కథ ఎక్కడ ఆపావో గుర్తుందా?’’

“అంతా గుర్తుంది. ఇప్పుడు తాంత్రికుడి కథదా చెప్పాలి’’

“యస్! అది వినాలని వుంది. నేను అరిసె తింటూ వుంటాను. నీవు కథ ప్రారంభించు’’ లైట్లన్నీ వెలిగిస్తూ అన్నాడు లిన్.

*****


పగలే వెన్నెల - 10

 

శశిరేఖ మరో యిద్దరితో కలిసి వస్తోంది. చుట్టూ మానవకాంతలే కాదు. గంధర్వస్త్రీలు, అప్సరసలు, ప్రబంధనాయికలుగా వున్నా అమె అంటే ప్రత్యేకంగా కనబడుతుందనిపిస్తోంది. అమె బావిదగ్గరే ఆగిపోయింది.

అక్కడేదో అదృశ్యరేఖ ఉన్నట్టు, అది తను దాటరాదన్నట్టు ఆ వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుతోంది. అక్కడికి బార్ లైట్ షేడ్ మాత్రం వెళ్ళడంవల్ల అమె ఆ వెలుగుల్లో పాలరాతి దేవాలయంలో వున్న రాగిదీపపు స్ధంభంలా వుంది. అందులోని వత్తి వెలుగుతున్నట్టు అమె పెదవులమీద చిరునవ్వు కనబడుతోంది. వెన్నెల బ్యాక్ డ్రాప్ లో బావిగట్టున అమె నిలబడి వుండటం, అమె వెనక బావికున్న గిలక నిశ్చలంగా కనబడటం- అదేదో తైలవర్ణచిత్రంలా వుందే తప్ప కనబడుతున్న దృశ్యంలా లేదు.

అతను అమెను అలాంటి తన్మయత్వంలోనే కన్నార్పకుండా చూస్తున్నాడు. అతను ఆ లోకంలో లేడని గుర్తించిన చింతామణి తన ఉనికిని తెలియజేయడానికన్నట్టు పొడిగా దగ్గింది. అతను ఉలి్క్కిపడ్డట్టు కదిలాడు.

"మరి నేవెళతా" అంది అమె.

అమె వెళ్ళబోయేందుకు అతనికి ఏదో ప్లాష్ అయినట్టు ముఖం వెలిగింది. "ఒక్కమాట" అన్నాడు.

అమె ఆగి ''ఏంటయ్యా?" అని అడిగింది.

"రేపు పది గంటలకి రోడ్డులో వుంటే మా మామిడితోటకు ఓసారి వస్తావా? నీతో పనుంది" అన్నాడు.

"నాతోనా?" అమె అశ్చర్యపోతూ అడిగింది.

"అ" అన్నాడు సురేష్ వర్మ.

అమె ఆలోచనలో పడింది. పని ఏమిటని అమె అడగలేదు. రేపు పదిగంటలకల్లా తెలిసిపోయే విషయానికి ఇప్పట్నుంచే ఎందుకు ఏదేదో వూహించుకోవడం? అందుకే పనేమిటని రెట్టించకుండా "అట్లానే" అంది. "అరవయ్యేళ్ళ వయసుకదా ఈ మధ్య చూపు మందగిస్తోంది" అంటూ తిన్నె పట్టుకుని దిగింది.

శశిరేఖ తిరిగి ఇంటికి వెళ్ళేవరకు అక్కడేవుండి ఆ తరువాత ఇంటికి చేరుకున్నాడు. మరుసటిరోజు ఉదయం ఠంచనుగా పదిగంటలకల్లా మామిడితోటకు వెళ్ళాడు. ఓ చెట్టుకింద రెండు కుర్చీలు వేయించాడు. చింతామణి కోసం వెయిట్ చేస్తూ ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. అయినా చదువుమీద దృష్టిపోవడంలేదు. అలా లేచి తోటంతా తిరిగి వచ్చేటప్పటికి చింతామణి కనపడింది.

అమెను చూడగానే అతనికి గుండెంతా తెలియని భయం, జంకూ అవరించాయి. అమె అతన్ని చూడగానే లేచి నిలబడింది. "ఫరవాలేదు కూర్చో" అని తన కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. చింతామణి ఓపికగా వింటోంది తప్ప విషయం ఏమిటో అడగడం లేదు. చివరికి అతను తెగించాడు "నువ్వు నాకో సాయం చెయ్యాలి" అన్నాడు ఉపోద్గాతంగా.

"సహాయమా? నీలాంటివారికి నేను చేసే సాయం ఏముంటుంది?" అమెకు అర్దం కాలేదు.

"నువ్వు చేయాలి. నువ్వే చేయగలవు" అని ఓ క్షణం ఆగి "ఎప్పుడో బతుకుతెరువుకోసం చేసిన పనిని ఇప్పుడు నాకోసం చెయ్యాలి" అని చెప్పి అమె యాక్షన్ కోసం చూస్తుండిపోయాడు సురేష్ వర్మ. అమెకి కొద్దిగా అర్ధమౌతోంది. అయితే అతను బయటపడితేనే మంచిదనుకుంది. అమె అతనివైపు చూస్తోంది.

"అది మధ్యవర్తిత్వం" అని చెప్పి తల తిప్పుకున్నాడు.

ఇప్పుడు తేటగా అర్దమైంది అమెకి. తను ఓ జంటను కలపాలి. కానీ ఈ వయసులో ఎప్పుడో వదిలేసిన వృత్తిని తిరిగి చెపట్టాలా? తనకు దేనికి ఢోకాలేదు. ఇతను ఊరికంతా డబ్బున్న అసామి కావచ్చుగాక. ఏ అడపిల్లమీదో మనసు పెట్టి వుండవచ్చుగాక. తను ముందుండి ఆ ఇద్దర్ని కలపాల్సిన అగత్యం తనకు లేదు. అందుకే కుదరదని చెప్పేయ్యాలి. ఆ ఒక్క క్షణంలోనే అమె నిర్ణయం తీసుకుంది.

అతను తెలివైనవాడు. బాగా చదువుకున్నవాడు. ముఖ్యంగా సైకాలజి. అందుకే అమె ముఖంలో కలిగిన మార్పుల్ని మాటల్లోకి మార్చుకోగలిగాడు. "నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్లీజ్!" అని బ్రతిమలాడుతున్నాడు.

అమె షాక్ తింది. తన నిర్ణయం చెప్పకముందే అతను ఎలా కనిపెట్టేశాడు? "అది కాదు...." అమె ఏదో చెప్పబోతుంటే అడ్డు తగులుతూ "నిజమే- నువ్వు చెప్పే విషయాన్ని దేన్నీ నేను కాదనను. కాని అమెపట్ల కలిగిన ఇష్టం అంత బలమైంది. అమె లేని రోజున నేను ఏమైపోతానో తెలియదు. పిచ్చి పట్టడం అనేది కనీసం జరిగే పని. మరి నన్ను పిచ్చివాడి కింద మారిపోమ్మంటావో వద్దో చెప్పు" అతని గొంతులోని వణుకు చూసి అమె తగ్గింది.

"ఈ పనికి నువ్వు ఒప్పుకుంటే నేనెంత ఇస్తానో తెలుసా? ఈ మామిడితోటలో రెండెకరాలు . అంటే నగదు రూపంలో చెప్పాలంటే రెండు లక్షలు. అక్షరాలా రెండు లక్షల రూపాయలు. అయితే ఈ సొమ్ముతో నిన్ను ఒప్పించాలని కాదు. అమెపట్ల నేనెంత మోహం పెంచుకున్నానో నీకు చెప్పడం కోసం రెండెకరాల రాసిచ్చేస్తాను . సరేనా? సరేనను." అతను తొందరపెట్టాడు. అమె వెంటనే ఏమీ చెప్పలేకపోయింది. అతను అమెను ఎంతగా కోరుకుంటున్నాడో అర్థమౌతోంది. తనకు చేతనైన సాయం చేయాలి అంతేకదా.

లోలోపల అంతరాత్మ వద్దంటున్నా చివరికి ఒప్పుకుంది. "నేను ఒప్పుకుంటోంది నువ్విచ్చే రెండెకరాల కోసం కాదు. అమె మీదున్న నీ ప్రేమ చూసి. ఆ రెండెకరాలూ తీసుకుంటాను. అయితే నా కోసం కాదు. మన రైల్వే జంక్షన్ దగ్దరున్న వూరు. ఎంతోమంది స్త్రీలు- భర్తతో పోట్లాడి. ఇంట్లో వాళ్ళమీద తిరగబడి మగవాడికోక నీతి, అడదానికొక నీతి చెప్పే సంఘాన్ని ఎదిరించి ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తుంటారు.

తరువాత తమ మజిలీ ఏమిటో నింపాదిగా ఆలోచించడానికి ఎవరూ ఓ రెండు రోజుల అశ్రయం కూడా ఇవ్వరు. అలాంటి అశ్రయం ఇవ్వడం కోసం నువ్విచ్చే రెండెకరాల్లో అనాథ మహిళా సదన్ ను ప్రారంభిస్తాను. స్థలం కుదిరితే మిగిలిన వాటికోసం మళ్ళీ ఏదో ప్రయత్నం చేయవచ్చు" అతను అమె ఒప్పుకున్నదానికి తప్ప మిగిలినదానికి ప్రత్యేకించిన ఇంపార్టెన్స్ ఏమీ యివ్వలేదు.

కాని ఓ అమ్మాయిని కుదిర్చేందుకు ఓ మగాడు ఇస్తున్న రెండెకరాల్లో అనాథ మహిళ సదన్ కోసం కేటాయిస్తున్న అమెను చూస్తుంటే ఎనలేని గౌరవం కలిగింది. "మరినే వస్తాను. అయితే నేను చేయగలిగింది ఒక్కటే" అంటూ లేచింది చింతామణి. అది ఏమైవుంటుందోనన్న అలోచనలో పడ్డ అతను ఏమిటని అడగలేడు.

అమె చెప్పింది "కురుక్షేత్రంలో కృష్ణుడు యుద్దం చేయలేదు. కేవలం రథం మాత్రమే నడిపాడు. నేనూ అంతే. మద్యవర్తిత్వం అంటే చీటీలు మోయడం కాదు. రహస్య ప్రదేశాలు చూసిపెట్టడం కాదు. ఇలాంటివి చేసేవాళ్ళను మధ్యవర్తులని గౌరవంగా పిలవరు. హంసరాయ బారులని గొప్పగా పొగడరు. దానికి మరేదో పేరుంది. నేనలా కాదు. ఇదిగో ఇలాంటి సంబందం పెట్టుకోవడం అన్నది నీతోనే మొదలుకాలేదు. నీతోనే అఖరువదు. అంటూ అమెలో వున్న భయాన్ని పోగొడతానంతే. మిగిలినదంతా నీ ఇష్టమే."

"అంతే చాలు." చింతామణి గొప్ప ఏమిటో అతనికి తెలుసు. ఆ మేరకు చేయడమంటే చాలా ఎక్కువే. చింతామణి ఎఫెక్ట్ అంత గాఢంగా వుంటుంది మరి. అతను తలూపాడు.

అమె వెళ్ళబోయింది. "రేపే రెండెకరాలు అనాథ మహిళసదన్ పేరుమీద రిజిష్టర్ చేయిస్తాను" అన్నాడు.

''పనయ్యాక కదా- ఇంకా మొదలేపెట్టలేదు" అంది అమె అంత తొందరెందుకన్నట్టు చూస్తు.

"నువ్వొప్పుకున్నావంటేనే పని అయిపోయినట్టు లెక్క. నాకు తెలుసు.... నువ్వెంత ప్రతిభావంతురాలివో నాకు తెలియదా? రేపే పత్రాలిచ్చేస్తాను. అవును... అమ్మాయి ఎవరో అడగనేలేదు"

" ఆ మాత్రం ఊహించలేకపోతే నేను చింతామణినే కాదయ్యా.... శశిరేఖ" అని నవ్వింది.

* * *


ఖజురాహో - 7

మహారాజు గురుదేవుడు చందేలు వంశపు రాజుల్లో పరాక్రమంతుడేకాదు, మంచి శీలవంతుడిగా కూడా చరిత్ర ప్రసిద్ధిగాంచాడు. కళలపట్ల ఆసక్తి, ధార్మిక సంప్రదాయాల పట్ల ఆదరణ వున్నవాడు. భారతదేశానికి గుండెలాంటి మధ్యప్రదేశంలోని చాలా భూభాగాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకొని విస్తరింప చేశాడు. యుద్ధ కుశలత బాగా తెలిసినవాడు. అన్నింటితోపాటు రసికుడు కూడా.

తన పూర్వికులు కూడా భారతదేశం గర్వించదగ్గ మందిరాలను నిర్మించి వెళ్ళిపోయారు. గురుదేవుడు సింహాసనాన్ని అధిష్టించిన తరువాత ఎన్నో చిన్న పెద్ద రాజ్యాలను జయించాడు. రాజ ప్రసాదాలలో, తాపసీ, మునుల కుటీరాల్లో సాధువుల గోష్టుల్లో, ఆశిక్షిత, అసభ్య జాతుల సముదాయాల్లో, చౌరస్తాలో, దారులకూడళ్ళలో, కోమట్ల దుకాణాల్లో సర్వత్రా గండదేవుడి ప్రశంసలే వినబడసాగాయి.

మహారాజుగారి ఆకారం కూడా చూడముచ్చటగా వుంటుంది. భీమకాయం, బలపరాక్రమవంతుడు, చక్కని విగ్రహంలా వుంటాడు.

సర్వసంపన్నము, సుభిక్షమైన, పాడిపంటలతో అలరారుతున్న ‘ఖజురహో’ నగరం. అంగడిలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని వున్నట్లు మహారాజు గురుదేవుడికి ఓకే లోపం. ఓకే ఒక కొరత పీడిస్తోంది. అదే సంతానం లేకపోవడం. రాజుకు వారసుడు కావాలని రాజ్యమంతా ఎదురుచూస్తోంది. రాజు కోరుకుంటే రాణులకు కొరత వుండదు. కానీ గండదేవుడు ఏకపత్నీవ్రతుడు. శీలవంతుడు కావడంతో సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.

మహారాణి ఇందుమతి అంటే మహారాజుకు ఎంతో ప్రీతి. ఇందుమతి సౌందర్యవతి, పరి సేవా పరాయణురాలు. కానీ సంతానం లేకపోవడం వల్ల తన భర్త ప్రేమ, ఆదరాభిమానాలకు ఎక్కడ దూరమైపోతానోనని దిగులు పడసాగింది. విజయం సాధించి వచ్చిన రాజుకు అన్ని సపర్యలు చేసి హంసతూలికాతల్పం మీద కూర్చుని నవ్వుతున్న ఇందుమతి మదిలోని దిగులును కనిపెటిన గండదేవుడు-

“దిగులు పడకు రాణీ! దేనికైనా సమయం కలిసి రావాలి’’ అన్నాడు.

“అది సరేగాని మీ పూర్వికులు భాండవ యజ్ఞము చేసి సంతానాన్ని పొందారు. ఆ యజ్ఞాలకు బావుల్లో నేయిని నింపు చేశారట’’

“నిజమే, బావులేకాదు, సరోవరాల్లో నేతిని నింపి భాండవ యజ్ఞము జరిపించే శక్తి మనకుంది. కానీ అలాంటిదాన్ని నిర్వహించే వారు ఇప్పుడు లేరు. మన నగరానికి సమీపంలో శ్మశానవాటిక దగ్గర ఒక శక్తివంతుడైన తాంత్రికుడు నివశిస్తున్నట్టు తెలిసింది. ఆదిత్యను పంపించాను. ఈ పాటికి వివరాలు తెలుసుకుని వస్తుంటాడు. నీవు నిశ్చింతగా వుండు. ఏదో ఒక మార్గం దొరక్కపోదు. నీ మనోవాంఛితం త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అలసిపోయాను, కొంత విశ్రాంతి, ఏకాంతము కావాలి మహారాణీ!’’ అన్నాడు గండదేవుడు.

“చిత్తము, మీరు విశ్రమించండి. నేను మీ పాదాలు వత్తుతాను’’ అంటూ అక్కడున్న పరిచారికలను సైగచేసి పంపించివేసింది మహారాణి.

*****

ఆరోజు ఆదివారం అమావాస్య. తాంత్రికుడు భైరవానందస్వామి జరుపబోవు శవ సాధన గుర్తుపెట్టుకుని బయలుదేరారు ఆదిత్య, శీలభద్రుడు. తాంత్రికుడు ఆశించినట్టుగానే శనివారం మధ్యాహ్నం 40 సంవత్సరాలలోపు వయసున్న యువకుడు పాముకాటుతో చనిపోయాడు. శవాన్ని సాయంత్రం తీసుకెళ్ళి ఆ తాంత్రికుడికి అప్పచేప్పినట్టు సమాచారం అందింది.

తాంత్రికుడిలో మహిమలున్నాయా లేదా అన్న విషయం తెలుసుకోకుండా మహారాజు గండదేవర దగ్గరకు వెళ్ళే అవకాశమే లేదు. తాంత్రికుడితో పరిచయం పెట్టుకోవడం ఎందుకైనా మంచిది. శక్తి, యుక్తి వున్న మనిషి ఏమైనా చేయగలడు. ఇలా ఆలోచిస్తూ ఇద్దరు మిత్రులూ మళ్ళీ శ్మశానం వైపు నడిచి వెళ్ళారు.

ఇద్దరూ తాంత్రికుడి కుటీరం చేరుకునేసరికి మధ్యాహ్నం దాటింది. శనివారం పాముకాటుతో చనిపోయిన యువకుడి శవం కుటీరం దగ్గరలో పెట్టబడి వుంది. శవం తాజాగానే వుంది. ఆదిత్యకు కొంత లౌక్యం తెలుసు. ఎటువంటి వాడైనా పొగడ్తకు లొంగనివారుండరని అతని అభిమతం.

అదే ప్రశంసాస్త్రాన్ని ఆదిత్య మాంత్రికుడి మీద ప్రయోగించాడు. “మీ గురించి మా నగరంలో గొప్పగా అనుకుంటున్నారు. మా మహారాజుగారు కూడా మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఉబలాటపడుతున్నారు’’ అన్నాడు ఆదిత్య.

“నాకు అన్నీ తెలుసు. మీ మహారాజు సమస్య కూడా నాకు తెలుసు. నేను శక్తిమంతుడినా కాదా తెలుసుకురమ్మని మిమ్మల్ని పంపించాడు. నిజమా?’’

“అవును స్వామి. అక్షరాలా నిజం’’ వంత పలికారు ఇద్దరూ.

“రహస్యంగా చేసుకునే శవసాధన మీకు చూపిస్తానన్నది అందుకే. నా శక్తి ఏమిటో మీ రాజుకు చెప్పండి. మీకు మేలు జరుగుతుంది.’’

“చిత్తం మహాదేవా! మీ గురించి సంక్షిప్తంగా తెలిపితే, ఎవరైనా అడిగితే చెబుతాం’’ వినయాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు ఆదిత్య.

“అలాగే’’ అంటూ తాంత్రికుడు తన గురించి సంక్షిప్తంగా తెలిపాడు.

*****


ఇట్లు నీ చిలుక - 87

శోభనం మొదలు పెట్టడానికి అంతా సిద్ధమైంది. కానీ పురుహితుడే రాలేదు. పెళ్ళికొడుకు అసహనంగా అటూ ఇటూ తిరగడం కనిపెట్టాను. అంతకు ముందు సరిగా చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం పరిశీలనగా చూశాను. గడ్డానికి బదులు సీరియస్ నెస్ ముఖం గంభీరంగా వుంది. ఎప్పుడూ నవ్వు ముఖం ఎరగని వాడిలా అనిపించాడు. అందులోనూ నాకంటే వయసులో బాగా పెద్దవాడిలా అనిపించాడు. నాకంటే దాదాపు పదిపన్నెండేళ్లు పెద్దగా తోచాడు. ఆ కారణం వల్ల కాబోలు నాకు సహచరుడిలా అనిపించలేదు. ఆ కారణం వల్ల కాబోలు నాకు సహచారుడిలా అనిపించలేదు. పైపెచ్చు ఏదో భయంలాంటిది కూడా కలిగింది.

బహుశా అతను క్లోజ్ గా వున్నా నేను తనతో వుండలేనని అనిపించింది. నేను ఇలా ఆలోచిస్తూ వుండగానే పురోహితుడు వచ్చాడు. అప్పటికే నేన రెడీగా వున్నాను. పెళ్ళిలో కలిగిన అలసటనంతటినీ కదిగేసుకున్నట్టనిపించింది. స్నానం చేస్తూనే పలచటి తెల్లటి కాటన్ చీర గరుగ్గా శరీరాన్ని పట్టుకున్నట్టుంది. టైలర్ చిన్నదిగా కుట్టాడో లేకుంటే నా శరీరం పొంగిందో తెలియదు గానీ జాకెట్టు నూలు బట్టలా అనిపించలేదు. గట్టిగా వత్తేస్తున్న ఇనుప కవచంలా వుంది. మెడలోకి వచ్చిన కొత్త మంగళసూత్రాలు అటూ ఇటూ కదులుతూ నేను వివాహితనన్న విషయం గుర్తుచేస్తోంది. బాగా ఆలస్యం కావటం వల్ల చిన్న పిల్లలంతా నిద్రపోయారు. దాంతో ఇంట్లో గలాభా తగ్గింది.

ఇది ఆడవాళ్ళ వ్యవహారం అన్నట్టు మగవాళ్ళు తమకి నచ్చిన కాలక్షేపాలు వెతుక్కున్నారు. పెళ్ళికొడుకు, సులోచన షామియానాలో ఓమూల కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే తీరూ, మధ్య మధ్యలో నవ్వుకోవడాలూ, అభిముఖంగా ఒకరికళ్ళల్లోకి ఒకరు చూసుకోవదాలు బట్టి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అన్న విషయం అర్థమైంది. మరి నా మీద ఆమెకేందుకు అకారణ ద్వేషం? అదే నాకు తెలియడం లేదు.

ఎప్పుడైనా వాళ్ళను నేను చూస్తున్నట్టు అనిపించగానే ఆమె నా వైపు అదో విధముగా చూసేది. అలాంటి సమయాల్లో అతనితో మరింత సాన్నిహిత్యాన్ని ప్రదర్శించేది. పురుహితుడు రమ్మంటూనే నేను వెళ్ళాను. భార్యాభార్తలిద్దర్నీ నిలబెట్టి ఏవో కొన్ని మంత్రాలు చదివి ముగించాడు. ఆ తరువాత అమ్మ నా చేతిలో పాలగ్లాసు పట్టింది. పక్కనున్న మా వదినలు ఏవో జోక్ లు వేస్తూనే వున్నారు. ఎందుకనో తెలియదు గానీ సులోచన ముఖం మాడిపోయింది.

చెప్పలేని దిగులు కళ్ళల్లో మైదానాల్లా పరుచుకుంది. ఏమైంది ఆమెకి? అయితే ఆమె అలా అయిపోవడం మాత్రం నాకు ఆనందాన్ని ఇచ్చింది. నావైపు ద్వేషంతో చూడడం వల్ల కాబోలు నాకూ ఆమె అంత ఇష్టం లేకుండా పోయింది. కాళ్ళు వణికాయి ... కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి.


బెడ్ మీద ...


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.