ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక, పుష్యరాగాలు భూఖనిజ సంపదగా మనకు లభిస్తాయి. పుష్యరాగాలు అనేక రంగుల్లో దొరుకుతాయి. మిశ్రమ రంగుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. ఏ రంగులేని శ్వేత పుష్యరాగమూ మనకు అందుబాటులో ఉంది, ఏ పుష్యరాగమైతే బంగారు రంగులో ఉంటుందో దానినే 'కనక పుష్యరాగం' అంటున్నాం. పుష్యరాగానికి సమాంతరంగా టోపాజ్ అనే రత్నాలను కొందరు తెలియక పుష్యరాగాలుగా చలామణి చేస్తున్నారు, నిజానికి కనక పుష్యరాగాలకు, టోపాజ్ కు ఎలాంటి సంబంధం లేదు. వాటిలో కేవలం రంగులో మాత్రమే ఏకత్వం కనిపిస్తుంది.
కనక పుష్యరాగాలకు '4సి' ఆధారంగానే ధర నిర్ణయిస్తారు., కనకపుష్యరాగాన్ని తాకినప్పుడు ఇసుకలా తగిలితే అది మంచి రత్నం కాదు. కనక పుష్యరాగంలో నల్లగా, చుక్కల్లాంటి మచ్చలున్నప్పుడు అలాంటి రత్నాన్ని తీసుకోక పోవడమే మంచింది.
“మకరందబిందు సమరుచిం
ప్రకటంబుగం ఋష్యరాగ రత్నము బృందా
రక నికరాచార్య ప్రియ
సుకృత శ్రీ యొసంగి నరులంజూచు ధరిత్రిన్"
తా|| పుష్యరాగము తానే చుక్క వలె ప్రకాశించుచుండును. దీనిని ధరించిన వారికి యీ రత్నాధిపతి మహా సుకృతములను ఇచ్చి కాపాడును.
రంగుల ఆధారముగా పుష్యరాగాలను 4 రకాలైన జాతులుగా నిర్ణయించబడినట్లు చెప్పబడినది. తెలుపురంగులో కనిపించేవి బ్రాహ్మణజాతి, ఎర్రని ఛాయతో కనిపించేది క్షత్రియ జాతి. పసుపు పచ్చని వర్ణంతో కనిపించేది వైశ్యజాతి, నలుపు, నీలం రంగులతో కనిపించేవి శూద్రజాతివిగా చెప్పియున్నారు.
పుష్యరాగములో దోషాలు:
మలినము: నల్లటిమచ్చలు వున్నవి
కర్కశం: కఠినముగా గరుకుగా వున్నవి
రెండు రంగులలో ఉండేది దోషం. కాంతి, బరువు తక్కువగా ఉన్న పుష్యరాగాలు మంచివికావు.
కనక పుష్యరాగాన్ని తాకినప్పుడు ఇసుకలా తగిలినా అది మంచి రత్నం కాదు, కనక పుష్యరాగం నల్లగా, చుక్కల్లాంటి మచ్చులున్నప్పుడు అలాంటి రత్నాన్ని ఉపయోగించకపోవడం మంచిది.
కనకపుష్యరాగాలు దొరుకు ప్రదేశాలు:
బ్రెజిల్. శ్రీలంక, థాయ్ లాండ్ , మయన్మార్, కంబోడియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, జపాన్, మెక్సికోల నుండి మనకు అందుతున్నాయి, ఐతే శ్రీలంక, ఇండియాలలో సహజమైన, మంచి నాణ్యత కలిగిన కనకపుష్యరాగాలుదొరుకుతాయి.
కనక పుష్యరాగాన్ని ధరించడం వలన, ఆ వ్యక్తికీ గౌరవాలు, సంతోషాలు, ఆనందం వస్తాయి. సంతాన సమస్యలు తగ్గుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్ధిక ఇబ్బందులు తగ్గుతాయి, వివాహ సమస్యల నుండి బయటపడవచ్చు.
ఆరోగ్య సమస్యలలో గ్లాండ్స్, లివర్, ఎండోక్రైన్ గ్రంథుల మీద ప్రభావం చూపి ఆరోగ్య పరిస్థుతులను మెరుగుపరుస్తుంది. మరియు జాండిస్, పాంక్రియస్ సమస్యలు స్థూలకాయ సమస్యలు తగ్గుతాయి.
కనక పుష్యరాగాలు ఇతర నామాలు:
పుక్ రాజ్, గురు, పుష్యరాగం, ఎల్లోసఫైర్, కురువింద, శ్వేతమణి, గురుప్రియము, గురురత్నం, పుష్యము అనే పేర్లున్నాయి.
లక్షణాలు:
జాతి - కొరండమ్, రకాలు - ఎల్లో సఫైర్, వ్యాపారనామము - ఎల్లోసఫైర్, దేశీయనామము - పుష్యరాగం, రసాయన సమ్మేళనం - Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, స్ఫటికాకారం ట్రైగోనల్, స్ఫటిక లక్షణం - ప్రిస్మోటిక్, వర్ణం - ఐరన్, మెరుపు - విట్రియస్, కఠినత్వము - 9, ధృడత్వము - 3.99 నుండి 4.00. అంతర్గత మూలకాలు - స్పటికాలు, ద్రవపు తెరలు, ఫెదర్స్, జోనల్ నిర్మాణాలు, సీల్స్, రెండు మూలక సమ్మేళనాలు, క్రాంతి పరావర్తన పట్టిక 1.760 – 1.768 నుండి 1.770 - 1.779, U.V.Light అప్రికాట్, పసుపు.