ఇది చంద్రునికి ప్రతీకగా చెప్పబడినది. ముత్యములు ఎక్కువగా ముత్యపు చిప్పల నుండి లభిస్తాయి. షెల్ ఫిష్ అనబడే నత్తజాతికి చెందిన డిప్పలు కలిగిన ఒక రకం చేప నుండి లభిస్తాయి. స్వాతిముత్యములు అని మనవాళ్ళు చెప్పుతుంటారు. స్వాతి కార్తెలో ఆ ముత్యపు చిప్పలు విచ్చుకొని సముద్రం మీద తేలియాడుతున్నప్పుడు ఆకాశం నుండి రాలే వాన చినుకు చిప్పలో పడి కొద్ది రోజులకు ముత్యంగా మారుతుందని మనకి చాలా మంది చెబుతుంటారు. నిజానికి ఆకాశం నుండి జారిపడే స్వాతి చినుకులు ముత్యంగా మారవు. సముద్రంలో 'పెరల్ ఆయెస్టర్స్' అని పిలువబడే ఓ రకమైన గుల్ల చేప వుంటుంది. ఇసుక, పెంకుముక్కలు, రాళ్ళు తన మీద వాలినప్పుడు ఆ జలచరానికి జలదరింపు కలుగుతుంది. దాంతో ఆయెస్టర్ ఆ ఆబ్జక్ట్ (పదార్ధం)ని వదిలించుకోవడానికి ఒక విధమైన ద్రవాన్ని ఆ ప్రాంతంలో విడుదల చేస్తుంది. కాల్షియం కార్బొనేట్ తో కూడిన ఆ ద్రవాన్ని 'నేకర్' అంటారు. ఈ విధంగా విసర్జింపబడిన ద్రవాలు కొద్ది సంవత్సరాకు "ముత్యాలు'గా రూపుదిద్దుకుంటాయి. ఐతే ప్రస్తుతం ఇలా దొరికే సహజ సిద్ద ముత్యాలకన్నా, పంటగా పండించబడే ముత్యాలే ఎక్కువగా దొరుకుతున్నాయి. జపనీయులు ఈ ముత్యాల పంటకు ఆద్యులు. సుమారుగా వంద సంవత్సరాల నుండి ముత్యాలపంట మొదలైంది. 'అకోయా' అయోస్టర్ అనే జపాన్ తీర ప్రాంతంలో దొరుకుతాయి. ముత్యాల పంటకోసం ముత్యాల రైతులు ఈ అయోస్టర్ పట్టుకుని 'ఆబ్జెక్ట్' తాకిస్తారు. దాంతో ఆ అయోస్టర్ ఎప్పటిలాగా 'నేకర్' ని విడుదల చేయడం దాంతో ముత్యం తయారుకావడం మొదలవుతుంది. పిన్ టాడా అనే అతను బాగా ప్రాచ్యుర్యం చేశాడు. ఉప్పు నీటిలో సహజంగా ఉత్పత్తి అయ్యేవాటిలోనే మంచి 'గ్లో' వుంటుంది.
జపాన్ లో మొదలైన ముత్యాలపంట ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ముత్యాలు క్రీమ్, తెలుపు, సిల్వర్, గోల్డ్, బ్లూ షేడ్స్, గులాబీ రంగుల్లో దొరుకుతాయి. నలుపు, ఎరుపు, ముత్యాలు కూడా దొరుకుతాయి. 'తహితి' ప్రదేశంలో ప్రత్యేకించి నలుపు రంగు ముత్యాలు దొరకడం విశేషం. వ్యవసాయం ద్వారా పండించబడే ముత్యాల కన్నా సహజంగా దొరికే ముత్యాలు పదిరెట్లు ఎక్కువ ఖరీదును కలిగి ఉంటాయి. దాని సైజు, షేప్, కలర్, షేడ్స్ ను బట్టి ముత్యాల ధరను నిర్ణయిస్తారు. పర్ఫెక్ట్ రౌండ్ వున్న ముత్యం విలువైన షేప్ గా పరిగణించబడగా, సిమెంట్రి కర్ డాప్ర్, పియర్ షేప్, బరున్ షేప్ లు కూడా మంచి అకారంగానే చెప్పుకుంటారు. ముత్యములు వివిధ చోట్ల దొరుకుతాయి.
“జలధర ఫణిఫణ కీచక
జలచర కరి మస్తకేక్షు శంఖ వరాహో
జ్జ్వల దంష్ట్ర శుక్తు లుదరం
బుల ముత్యము లొదవు వర్ణములు వివిధములై"
తా: ముత్యములు మేఘములందును, పాముల యొక్క పడగల యుండును, వెదురు బొంగులందును, మత్స్యమూలా శిరస్సులందును చెరుకు గడల యందును, శంఖములందును, అడవిపంది కోరలయందును లభిస్తాయి. ముత్యపు చిప్పలందు మాత్రమే మంచి ముత్యములు లభించును.
ముత్యములకు ఆకార విశేషంబులను బట్టి అణియనియు, సుతారమనియు, సుపాణియనియు మూడు విధములగు భేదములు జన్మలక్షణంబును బట్టి గలవు.
ముత్యంలో దోషాలు:
దృశ్యం - త్రికోణాకారంలో వున్నవి
పార్శ్వకము - గుంటలు వున్నవి
త్రివృత్తము - మూడు పొరలుగా వున్నవి
కాకపాణి - నలుపు రంగులో వున్నవి
వికటపీఠము - చిన్న చిన్న బోడిపలతో వున్నవి
విద్రుమము - ఎరుపు రంగులో వున్నవి
జఠరము - కాంతి వంతము లేకుండా వున్నవి
ధూమ్రాంకం - మబ్బు రంగులో వున్నవి
మత్స్యాక్షి - చేప కన్నువలె ఉన్నవి
శుర్తికా స్పర్శము - ఇసుక రేణువులతో వున్నవి
ముత్యములను పరీక్షించుట:
ఉప్పును గోమూత్రంలో కలిపి అందు ముత్యములను నానబెట్టి వరి ఊకతో చక్కగా తోమినప్పుడు పగిలిపోయినచో అవి కృత్రిమ ముత్యములనియు, పగులకుండ మెరుపు మొలకల వలె క్రొత్తఛాయతో ప్రకాశించునని. సహజ ముత్యములని పిలువబడును.
ముత్యాలు దొరుకు ప్రదేశం:
వర్షియన్ గల్ఫ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, వియత్నాం, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్, మలేషియా, చైనా, వెనిజులా, పనామా, దక్షిణ భారతదేశంలో ముత్యాలు దొరుకుతాయి. జాపాన్ ముత్యాలు ఉత్పత్తి ప్రారంభించిన మొదటి దేశంగా గుర్తింపు పొందినా, ఆస్ట్రేలియా ముత్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వుంది.
సహజ సిద్ధమైన ముత్యాలను, ఇమిటేషన్ ముత్యాలను కొంతవరకు సులభంగానే గుర్తించవచ్చు, సహజమైన ముత్యాలు మృదువుగా వుంటాయి. అదే కృత్రిమ ముత్యాలు గట్టిగా, పంటి మీద రుద్దితే ఇసుకలాంటి పొడిని రాలుస్తాయి. పంటల ద్వారా పండించే ముత్యాల మీద సహజముత్యాలకుండే స్థాయిలో నేకర్ లేయర్ వుండదు. పంట ముత్యాలలో ఆఫ్ మిల్లీ మీటర్ కన్నా తక్కువగా ఈ లేయర్ వుంటుంది. కాబట్టి ఈ పంట ముత్యాలు జ్యోతిషపరంగా తక్కువ ఫలితాలు ఇస్తాయని అంటారు.
ముత్యాలు మనిషి మానసిక స్థితిని, జ్ఞాపక శక్తిని పెంచి, కోపాన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే అవి మనిషిలోని ఆధ్యాత్మిక, ధ్యానశక్తిని పెంచి పోషిస్తాయి. మంచి ముత్యాలు ధరించడం వల్ల మనిషికి సంపద, సంతానభాగ్యం, పేరు ప్రఖ్యాతులు, అదృష్టం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. ముత్యాలను వెండిలో పొదిగి సోమవారం ధరించడం మంచిది. ముత్యాన్ని చేతి ఉంగరపు వ్రేలుకి ధరించాలి.
ముత్యాలకు వివిధ నామాలు:
వ్యాపారనామం - పెరల్, దేశీయనామం - పెరల్, మోతి
ఇతర నామాలు - మౌలికం, కటశర్కర, కువలము, క్షీరాబ్దిజము, గాంగేప్తి, భౌతికం, ముక్త ముత్తియము, ముత్తెము, హురుముంజి అనే పేర్లు గలవు.
ముత్యం లక్షణాలు:
రసాయన సమ్మేళనం - CaCO3, H2O (82 – 86% CaCO3 ఆర్గోనైట్, 10 – 14% కన్ బి లైన్, 2-4 నీరు), వర్ణం - తెలుపు, నలుపు, ఉతర వర్ణాలు, వర్ణమునకు కారణం - లెడ్, జింక్, పోరోఫెథైన్స్ , మోటాలో పోలోఫెరైన్స్, మెరుపు - పొలి కఠినత్వము, - 3.5 నుండి 40, ధృడత్వము - గుడ్, సాంద్రత (S.G) – 2.65 to 2.85, ఏకలేక ద్వికిరణ ప్రసారము (SR/DR). SR/Agg, పగులు - అసమానం, అంతర్గత మూలకాలు లేవు, కాంతి పరావర్తన పట్టిక (RI) 1.530 1.685 అతినీలలోహిత కిరణాల పరీక్ష (U.V.Light) జడం నుండి బలంగా, సాదృశ్యాలు - ప్లాస్టిక్, గాజు.దీనిలో బసారాముత్యాలకు బరువును చావ్ లలో కోలుస్తాటు. ఇది 1.259 క్యారెట్ లు ఇది కల్చర్ కూడా చేస్తారు.