జాతిపచ్చ బుధగ్రహానికి సంబంధించినది. జాతిపచ్చను ఇంగ్లీష్ లో 'ఎమరాల్డ్' అంటారు. ఎమరాల్డ్ బైరేల్ కుటుంబంలో గ్రీన్ వెరైటీ, అల్యూమినియం, బెరిలియం తాలుకూ సిలికేట్ తో ఉంటుంది. దీర్ఘచతురస్రాకారం (Rectangle), స్టెప్ కట్ అనేదాన్ని ఎమరాల్డ్ కి సాధారణంగా ఉపయోగిస్తారు. కటింగ్ ఆవిధంగా ఉన్నప్పుడే ఎమరాల్డ్ క్రిస్టల్ తాలూకు లోతు, అందమైన రంగు, ఫోకస్ చేయబడుతుంది. 1934 నుండి సింథటిక్ ఎమరాల్డ్ కూడా తయారు చేస్తున్నారు. పచ్చను మరకతను అని కూడా అంటారు.
మరకతము సుందర యౌవనముగల నెమలిపిట్ట రంగును, నాచువలెను, గాజువలెను ప్రకాశించే గరికమొలక రీతిగాను, కోమలమగు పాలచెట్టు యొక్క కొమ్మరంగునను, మంచి కాంతి గల రామ చిలుక రెక్కల చాయను, సుందరమియన్ దిరిశిన పువ్వురంగువలెను ఈ ఎనిమిది రంగులలో ప్రకాశించును.
పచ్చలో దోషాలు:
పుప్పి: పుచ్చులు వున్నవి
గార: కప్పువేసినట్లు ఉన్నవి
కర్కశం: కఠినముగా గరుకుగా ఉన్నవి
పచ్చమీద సున్నము పూసినను ఆ పూత అతిక్రమించి బాల సూర్యుని ప్రకాశమున విరాజిల్లుచుండును. అట్టి శుద్ధమైన పచ్చను ఎంత ఖరీదుతో అయినా కొనవచ్చును.
దొరుకు ప్రదేశాలు:
కొలంబియా, బ్రెజిల్, జాంబియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, రష్యా, ఈజిప్ట్, ఇండియా, ఆఫ్రికా, దేశాలలోని గనుల్లో దొరుకుతాయి. వీటన్నింటిలో కొలంబియన్ ఏమరాల్డ్స్ ఉత్తమమైనవిగా చెప్పబడుతున్నాయి. ప్రపంచంలోని ఏమరాల్డ్స్ లో తొంభై శాతం ఈ కొలంబియన్ గనుల నుండే వస్తున్నాయి.
గనుల్లో నుండి బయటకు తీయగానే ఏమరాల్డ్స్ ని చాలా వరకు ఆయిల్ లో ముంచుతారు. దీని వలన రత్నం తాలుకూ ఉపరితలంలోని పగుళ్ళు కప్పబడిపోతాయి. కొన్నిసార్లు పగుళ్ళు కప్పిపుచ్చటానికి, రంగును ఇంప్రూవ్ చేయడానికి ఆయిల్ ను ఉపయోగించడమూ జరుగుతుంది.
లోపాలు లేని జాతిపచ్చ సంపదను, ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని అందిస్తాయి. జాతిరత్నం జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు, ధరించిన వ్యక్తి చదువు పట్ల ఏకాగ్రత ఏర్పడేలా చేస్తుంది. ఎమరాల్డ్ నుండి ఆకుపచ్చ కిరణాలు బయటకు వెదజల్లబడతాయి. కాబట్టి ఆరంగు మూత్రపిండాలు, ప్రేగుల మీద, కాలేయం మీద పనిచేసి ఆరోగ్యస్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాక శ్వాసప్రక్రియ సరిగా జరగడం, ఏకాగ్రత కలగడం, ఇన్ సోమ్నియా, డీసెంట్రీ, డయేరియా, ఆస్తమా, అల్సర్ వ్యాదులనుండి దూరం కావడం జరుగుతుంది.
బంగారం లేదా, వెండిలో జాతిపచ్చను పొదిగి బుధవారం ధరించడానికి, కుడిచేతి చిటికెన వ్రేలికి ధరించాలి.
జాతిపచ్చకున్న నామాలు:
వ్యాపారనామం: ఎమరాల్డ్, దేశీయనామం, పన్నా, ఇతరనామాలు: మరకతము, అశ్మగర్భము, గరలాం గురణాంకితము, గురుడాశ్శము, గురుడోత్తరము, గారుడం, తృణగ్రాహి, గరుడపచ్చ, మకరతము, హరిన్మణి.
లక్షణాలు:
రసాయన సమ్మేళనం- BeOAl2O3, 6 స్ఫటిక ఆకారం - హెక్సాగోనాల్, స్ఫటిక లక్షణం, - ఫ్రిసేమ్యాటిక్, వర్ణం - ముదురు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ; వర్ణమునకు కారణం - క్రోమియం, మెరుపు - విట్ రియస్, కఠినత్వము - 7.5,దృఢత్వము - పూర్, సాంద్రత (S.G.) 2.67 – 2.78, క్లీవేజ్ - స్పష్టంగా లేదు, ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR, పగులు - శంకు ఆకృతి, అంతర్గత మూలకాలు - ఇండియా దానిలో రెండు మూలకాల సమ్మేళనం, మైకా, ఫింగర్ ప్రింట్, ద్రవం, కొలంబి పచ్చలో - మూడు మూలకాల సమ్మేళనం పైరైట్, మైకా ౦ బ్రెజిల్ పచ్చలో- డోలమైట్, పైరట్, క్రొమైట్ కాంతి పరావర్తన పట్టిక (RI)-1.56 నుండి 1.57 వరకు 1.59 – 1.60 వరకు U.V.Light (S.W) లో చర్య ఉండదు. L.W. లో ఎరుపుగా ఉండును. సాదృశ్యాలు - చాల్ సిడని, గ్రీన్ బెరిల్, గ్రీన్ సఫై ర్ సహజంగా దొరికే జాతిపచ్చ రంగును అధికం చేయుట. ఉపరితలానికి పూత పూయుట ఇరీడియేషన్ చేస్తారు.
ప్రకృతిలో దొరికే పచ్చలో S.G. మరియు RI అధికంగా ఉంటుంది. సింథటిక్ లో వీటి విలువ తక్కువగా ఉంటుంది. అంతర్గత మూలకాలలో S.G, RI ల ద్వారా (సింథటిక్ వాటిని) గుర్తుంచవచ్చును. శ్రేష్టమైన పచ్చలు కొలంబియాలో దొరుకుతాయి.