ఇది కుజునకు ప్రతీకగా చెప్పబడినది. సముద్రంలో అడుగు భాగంలో పాలిప్స్ (polyps) అనే నీటి ప్రాణి నివసిస్తున్నది. ఈ ప్రాణి చెట్టు ఆకారంలో 6 నుండి 9 అంగుళాల పొడవు పెరుగుతుంది. ఇది సముద్రపు నీటినుండి కాల్షియం సేకరించి ఒక్కకొమ్మగా లైమ్ స్టోన్ స్కెలిటన్ ని పెంచుకుంటూ పోతుంది. పాలిప్స్ కొమ్మ చివరి భాగాలు గుండ్రంగా ఖాళీగా వుంటాయి. అందులో డిపాజిట్ అయ్యే కాల్షియం కార్బొనేట్ కారణంగా పోలిప్స్ పెరుగుతుంది, అలా పెరిగిన ఆ మొక్కలాంటి జీవి కొమ్మ లేదా ఎముకలనే మనం 'పగడం' గా చెప్పుకుంటున్నాము. ఆ విధంగా 'పగడము' అనేది సముద్రంలో నివసించే ఓ జలచరం తాలూకు ఓ భాగంగా మనం చెప్పుకోవాలి. పగడం అనేది రంగులలో దొరుకుతుంది. ఎరుపు, తెలుపు, గులాబీ, కాషాయం, పసుపు, పచ్చ రంగుల్లో పగడం దొరికినా, జ్యోతిషపరంగా ఎరుపురంగు పగడాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. పగడం ఎప్పటికి అదే రంగులో ఉంటుంది అనే గ్యారంటీ లేదు. అది మంచి పగడమే అయినప్పటికీ ఒక్కసారి రంగు వేలిసిపోవడమూ జరుగుతుంది. అంత మాత్రాన రంగు వెలిసిపోయింది కాబట్టి అది నకిలీ అనుకోవడానికి వీల్లేదు.
“మెఱసి నిద్దంపు గెంపుల మిగులంగదసి
కోరి ధరియించు వారికి గొఱత లేక
సర్వ సౌభాగ్య ప్రశస్త వస్తు
భద్రకారణ సంసిద్ధి విద్రుమంబు"
తా|| దొండపండ్లను, ఉస్తి పండ్లను, ఎర్రటి పండ్లను, దేవదారు పండ్లను, సుందరాంగుల కెంపెదవులను, చిలుక ముక్కులను, రక్తచంద్రన కాష్ఠమును మించి కెంపు వంటి కెంజాయ కలిగియుండెడి పగడములను ధరించు వారలకు కొరత లేక సర్వసౌభాగ్యములు, సర్వయోగ్య వస్తు సమృద్ధియు గలుగును.
పడగములో దోషాలు:
కొమలము: ఆవుపేడ వంటి మరకలు వున్నవి
జర్ఘరము: బుడిపెలు వంటివి వున్నవి.
బొప్పి: సమానముగా లేకుండా వున్నవి.
మలినము: నల్లటి మరకలు వున్నవి
కుందేటి రక్తము వలె ఎర్రగా వున్నది బ్రాహ్మణ జాతి అని, మనోహరమై తేలికగా మంకెనపువ్వు, దాసానిపువ్వు, సిందూరము వీనిలో రంగుకు తీసిపోక గట్టిగాను, నునుపుగాను నుండునది క్షత్రియ జాతి. మోదుగ, పొదిరిపుష్పము వలె విరాజిల్లు నది వైశ్యజాతి, మలినముగా తక్కువ ప్రకాశం కలిగి నునుపుగానున్నది శూద్రజాతి అని చెప్పవచ్చును.
లభించే ప్రదేశాలు:
అల్జీరియా, ట్యునీషియాలతో పాటు, ఫ్రాన్స్, సిసిలీ, స్పెయిన్, ఆస్ట్రేలియా, మారిషన్, తాలూకు ఎర్ర సముద్రతీరాల్లో తీరం వెంబడి ఐదు నుండి యాభై మీటర్ల దూరంలో పగడపు కొమ్మలు దొరుకుతాయి. సముద్రంలో ఎంతలోతులోకి వెళ్తే అంత తేలికైన పగడాలు దొరుకుతాయి.
పగడం ధరించడం వల్ల నీరసం వదిలి, శారీరక సమర్ధతను, నాయకత్వ లక్షణాలను సంపాదించగలుగుతారు. పగడం ఎరుపురంగు కాస్మిక్ రేస్ ని ట్రాన్స్ మిట్ చేస్తుంది. అది రక్తం మీద నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఆవిధంగా జ్వరం, బ్రాంకై టిస్, జాండిస్. ఫైల్స్, చికెన్ ఫాక్స్ లాంటి వ్యాధుల నుండి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. పగడ ధారణ మంగళవారం చేయవలెను. పగడాన్ని ఉంగరంలో ధరించేటప్పుడు బంగారం, వెండి, రాగి లోహాలను ఉపయోగించవచ్చును. పగడం చేతివ్రేళ్ళలో అనామిక (ఉంగరం వ్రేలు), చూపుడు వ్రేలికి ధరించవచ్చును.
పగడం వివిధ నామాలు:
వ్యాపారనామం- కొరల్, దేశీయనామం - కొరల్, ముంగా, మంగల్, ప్రవాళము
ఇతర నామాలు - అంగారక మణి, అబ్దిపల్లవము, కుజప్రియము, రక్తాంగము, విద్రుమము
లక్షణాలు:
రసాయన సమ్మేళనం: CaCO3, కాల్షియం కార్బొనేట్ మరియు 3% MgCO3 స్పటిక ఆకారం కర్బణ సమ్మేళనం. వర్ణము - లేత ఎరుపు, ముదురు ఎరుపు, ఆరెంజ్,నలుపు, బ్లీచింగ్ తరువాత బంగారు వర్ణం, వర్ణమునకు కారణం - ఐరన్, మెగ్నీషియం,మెరుపు - వాక్సిం, కఠినత్వము - 3.5, దృఢత్వము - గుడ్, సాంద్రత(S.G) 2.60 – 2.7, పగులు - అసమానం నుండి స్పింటరి: అంతర్గత మూలకాలు - రంధ్రాలు, పట్టిలు, కాంతి పరావర్తన పట్టిక (RI) 1.486-2.658. U.V.Light – జడం, సాదృశ్యాలు, - పెస్ట్, ప్లాస్టిక్, మైనం, సింథటిక్ గిల్సన్ కొరల్ పెరల్, ఇవరి, మార్బుల్, కాలసైట్ HCL తో చర్యజరిపిన రంగు కోల్పోవును.