కెంపులు భూమి నుండి లభ్యమవుతాయి. ఉపరితలం నుండి భూమి లోపలికి 150 నుండి 300 కిలో మీటర్ల లోతులో ఇవి తయారయ్యాక భూమి పైపొరలలోకి వెదజల్లబడుతాయి. త్రవ్వకాల ద్వారా, అగ్నిపర్వత శిలలు బ్రద్దలవ్వడం ద్వారా రూపాంతరం చెందిన శిలల నుండి కెంపులు లభిస్తాయి. సాధారణంగా ఎరుపు (దానిమ్మగింజ) రంగులో వున్నప్పటికీ, గులాబీ, నలుపు, పసుపు, స్కై బ్లూ కలర్స్ లోనూ కెంపులు దొరుకుతాయి.
ప్రాచీన సంస్కృతి, పురాణాలననుసరించి కెంపును 'రత్నరాజం', రత్ననాయక' అని పిలుస్తారని తెలుస్తుంది. కెంపుని పద్మారాగమణి గా పిలుస్తారు. పద్మరాగమణిని పూర్వపు గ్రంథాలలో చాలా చక్కగా వర్ణించారు.
అప్పుడే ఉదయించుచున్న సూర్యబింబమువలె ప్రకాశించునది పద్మరాగం. దానిమ్మ – పుష్పంలాగా ప్రకాశించునది. సౌగంధికము. కామ వికారాన్ని పొందిన కోకిల నేత్రమువలె ఉండునది కురువిందము, కుందేలు మానసము ఖండము వలె చక్కని ఎరుపు కాంతి కలది మాంసగంధి, నలుపు ఎరుపు కలిసి కన్పించునది నీలగంధి, లెస్సగా వికసించిన లొద్దుగ పూయవలెను. అశోక పుష్పమువలెను, మంకెన పువ్వు వలెను ప్రకాశించు కెంపులే పూర్ణమైన విలువ కలిగి ఉండును.
కెంపులొ దోషాలు ఫలితం
పటలం: తెల్లని రంగులో వున్నవి దరిద్రం
త్రాస: బీటలు వారి పగుళ్ళువున్నవి కలహాలు
భిన్న: ముక్కలు ముక్కలుగా వున్నవి కష్టాలు
జర్ఘర: పొరలు పొరలుగా వున్నవి విరోధాలు
కర్కశ: మొద్దుగా వున్నవి ప్రాణాపాయం
నీలము: నల్లగా వున్నవి శతృవృద్ధి, ఉపద్రవాలు
ఇప్పుడు అత్యుత్తమ లక్షణాలతో ఉన్న కెంపులు లభించడం లేదు కెంపులలొ లేత పండురంగు లేదా పర్పల్ ఎరుపు అతి విలువైనది. కెంపు అనేది కోరండమ్ జాతికి చెందినది. అల్యూమినియం కి సంబంధించిన క్రిస్టలైజెడ్ ఆక్సైడ్, ఇందులో కొద్దిపాటి క్రోమియం కలపడం వలన కెంపు ఎరుపు రంగులో వుంటుంది.
బర్మాలోని మోంగాక్ జిల్లాలో మేలిమి జాతికి చెందినా కెంపులు దొరుకుతాయి. అలాగే శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా గనులలో కూడా కెంపులు లభిస్తాయి. భారతదేశంలోను కెంపులు దొరుకుతాయి. కాని క్వాలిటీ కెంపులు మాత్రము లభించడం లేదు.
సరైన జాతి కెంపులు ధరించడం వలన ఆ వ్యక్తికీ సంపద, సంతానం, సంతోషం, ధైర్యం, సంఘంలో పరపతి కలుగుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసము ఇనుమడిస్తుంది. కెంపును ఆది, సోమ, మంగళ వారాల్లో ధరించవచ్చు. కుడి చెయ్యి ఉంగరం వ్రేలికి ధరించడం మంచిది.
కెంపుకు ఉన్న ఇతర నామాలు:
వ్యాపారనామము - రూబి, స్టార్ రూబి, దేశీయనామం - మానిక్, మానక, రూబి. ఇతరనామాలు - కీలాలము, మాణిక్యము, తామరకెంపు, కుబిల్వము, కురువిందము, కురివిల్లము, కుల్మాషము, నీలగంధి, రోహితము, సౌగంధికము, పద్మరాగమణి, మాణిక్యం.
లక్షణాలు:
రసాయన సమ్మేళనం, Al2O3, అల్యూమినియం ఆక్సైడ్, స్పటిక ఆకారం - హెక్సాగొనాల్, మెరుపు (Luster), విట్రియస్, కఠినత్వము - 9 ధృడత్వము - గుడ్,సాంద్రము, (S.G)- 3.99 – 4.00, క్లీవేజ్ - అస్పష్టంగా, ఏక లేక ద్వికరణ ప్రసారం (SR/DR)- DR పగులు (Fracture) శంకు ఆకృతి నుండి అసమానం, అంతర్గత మూలకాలు (Inclusions) లభించు ప్రదేశమును బట్టి అంతర్గత మూలకాలు మారతాయి. ఫింగర్ ప్రింట్స్ సిల్క్ త్రికోణాకారపు సూదులు, క్రిస్టల్స్, ఫెదర్స్ ఉంటాయి. (కాంతి వరవర్తన పట్టిన) R.I.1.762-1.770, అతినీలలోహిత కిరణాల పరీక్ష (U.V. Light) జడం నుండి బలంగా, సాదృశ్యాలు, - జిర్కాన్, స్పినల్, టుర్ములిన్, గార్మెట్, బిక్స్ బైట్, కృత్రిమరూబి. కృత్రిమమైన వాటిని అంతర్గత మలినములను బట్టి గుర్తిస్తారు. వీటిని ప్లక్స్, హైడ్రోథర్మల్ పద్దతులలో తయారు చేస్తారు.