రత్నాలు - నవ లక్షణాలు
1. స్వచ్ఛత కలిగి వుండుటం, 2. బీటలు లేకుండటం, 3. లోపల బుడగలు లేకపోవడం, 4. అపరిశుభ్ర పదార్ధాలు లోపల లేకుండుట, 5. ప్రకాశం కలిగి వుండుట. 6. అర్హమైన మంచి రంగు కలిగి వుండుట, 7. కఠినత కలిగి ఉండుట, 8. ద్రావకానికి చెడకుండా వుండుట, 9. అరిగిపోక నిల్చివుండు శక్తి కలిగి ఉండుట ఇవి రత్నాలకు నవ లక్షణాలుగా భావించాలి. ఈ లక్షణాలున్ననూ కోతకు పనికి రానిది అగునేని ఆ రత్నం నిరర్థకమే అయి మూల్యం లేనిదిగా భావించాలి.